జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో తొలగని ప్రతిష్టంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్మూ, కాశ్మీర్‌లో భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో నెలకొన్న ప్రతిష్టంభనపై అపోహలను తొలగించడానికి పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ త్వరలోనే తమ పార్టీ సీనియర్ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ‘ప్రభుత్వం ఏర్పాటుపై గత వారం జరిగిన పరిణామాలపై వివరించడానికి పిడిపి అధ్యక్షురాలు రానున్న కొద్ది రోజుల్లోనే పార్టీ సీనియర్ నేతలతో సమావేశమవుతారు’ అని పిడిపి వర్గాలు తెలిపాయి. జమ్మూ-కాశ్మీర్ జాతీయ రహదారి మూసివేత కారణంగా పార్టీకి చెందిన చాలామంది సీనియర్ నేతలు చిక్కుపడిపోయినందున సమావేశం తేదీని ఖరారు చేయలేదని కూడా ఆ వర్గాలు తెలిపాయి.
గత గురువారం పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా మధ్య జరిగిన సమావేశంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుపై ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగలేదు. పిడిపి పెట్టే కొత్త షరతుల ఆధారంగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బిజెపి అంటుండగా, తాము ఎలాంటి కొత్త డిమాండ్లు పెట్టలేదని, గత ఏడాది రెండు పార్టీల మధ్య కుదిరిన కూటమి అజెండా అమలు గడువుపై స్పష్టమైన హామీలను మాత్రమే కోరుతున్నామని పిడిపి అంటోంది. ‘ప్రభుత్వం ఏర్పాటుకు పిడిపి కొత్త డిమాండ్లు పెడుతోందనే భావనను సృష్టించడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. అది నిజం కాదు. కూటమి అజెండాను అమలు చేయమని మాత్రమే మేము కోరుతున్నాం. ఈ అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది’ అని పిడిపి వర్గాలు తెలిపాయి. బిజెపి అగ్రనేతలతో జరిపిన సమావేశాల్లో మెహబూబా ముఫ్తీ లేవనెత్తిన అంశాలు పిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మహమ్మద్ బిజెపితో కుదుర్చుకున్న పొత్తు అజెండాలో భాగమేనని కూడా ఆ వర్గాలు చెప్పాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మంచిదని ముఫ్తీ మహమ్మద్ భావించారని, అందువల్ల తన తండ్రి తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని మెహబూబా ముఫ్తీ పదే పదే స్పష్టం చేశారు. రాజకీయ చర్యలు, రాష్ట్ర ఆర్థిక పురోగతికి సంబంధించి తన తండ్రికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాత్రమే ఆమె కోరుతున్నారు’ అని కూడా ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ప్రతిష్టంభనపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయడానికి మెహబూబా ముఫ్తీ ఒకటి రెండు రోజుల్లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేస్తారని కూడా ఆ వర్గాలు తెలిపాయి.
ముఫ్తీ మహమ్మద్ సరుూద్ మృతి చెందిన ఒక రోజు తర్వాత గత జనవరి 8న జమ్మూకాశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగిన పక్షంలో గత రెండు నెలలుగా పాలనా వ్యవహారాలు చూస్తున్న గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రాకు అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికల నిర్వహణకు సిఫార్సు చేయడం తప్ప మరోమార్గం లేదు. అసెంబ్లీ రద్దుకు జమ్మూ, కాశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ వర్తిస్తుందా లేదా అనే దానిపై న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా వోహ్రా ఈ ఏడాది ఏప్రిల్ 9, జూన్ 8 మధ్య కాలంలోనే ఆ పని చేయాల్సి ఉంటుంది. రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య ఆరు నెలలకు మించి గడువు ఉన్న పక్షంలో గవర్నర్ అసెంబ్లీని రద్దు చేయక తప్పదు. జమ్మూ, కాశ్మీర్ అసెంబ్లీ చివరగా గత ఏడాది అక్టోబర్ 10న సమావేశమైంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 87 స్థానాలున్న అసెంబ్లీలో పిడిపి 28 స్థానాలతో (ముఫ్తీ మహమ్మద్ మృతితో ఇప్పుడు సంఖ్య 27కు చేరింది) అతి పెద్ద పార్టీగా అవతరించగా, బిజెపికి 25 స్థానాలు లభించాయి. నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12 పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు 2 సీట్లు లభించాయి.