కథా సాగరం

ఎర్రటి రాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టి విచిత్రమయింది. మనోహరమైంది. వైవిధ్య భరితమయింది. ప్రతి మనిషీ ప్రత్యేకత కలిగినవాడే. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఎవర్నీ ఎవరితో పోల్చడానికి లేదు.
సృష్టిలోని ఆ అనంత వైవిధ్యమే మనల్ని చైతన్యవంతుల్ని చేస్తుంది. ఆసక్తిని రేపుతుంది. ప్రతిదీ సృష్టిలో అర్థవంతమైందే.
బయాజిద్ అన్న సూఫీ గురువు ఉండేవాడు. ఆయన శిష్యులతో కలిసి పర్యటించేవాడు. మధ్యలో బస చేస్తూ ఆసక్తి కలిగిన వాళ్లకు బోధనలు చేస్తూ గడిపేవాడు.
ఒకసారి ఒక గ్రామం నించి ఆయన ఇంకో గ్రామానికి వెళుతున్నాడు. శిష్యులు వెంట వున్నారు.
బయాజిద్ దారి పక్కన ఒక రాయిని చూశాడు. అది ఎర్రగా నునుపుదేలి మెరుస్తోంది. ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆయన కాసేపు అక్కడ ఆగి ఆ రాయిని తదేకంగా చూశాడు. ఆ రాయిని దగ్గరకు తీసుకుని శ్రద్ధగా పరిశీలించి మళ్లీ ఆ రాయిని యథాస్థానంలో ఉంచి ముందుకు సాగాడు.
శిష్యులకు ఆశ్చర్యం కలిగింది.
‘మీరు ఎందుకు ఆ రాయిని తీసుకున్నారు. దాన్ని చూసి మళ్లీ ఎందుకు అది ఎక్కడ ఉందో అక్కడే ఉంచారు?’ అన్నారు.
దానికి గురువు ‘దేవుడు దానికో ప్రత్యేకతనిచ్చాడు. దాని నిర్మాణంలో నైపుణ్యం ప్రదర్శించాడు. దానికొక స్థానమిచ్చాడు. అందుకనే అది అక్కడ ఉంది. ఆ కారణంగా దాన్ని అక్కడ ఉంచాను. దాని చోటును మార్చడానికి నేనెవర్ని? నాకేం హక్కుంది. నేను ఉద్రేకపడ్డాను. నిజానికి దానికి స్థానచలనం కలిగించాను. ఆ రాయి సౌందర్యం నన్ను కదిలించింది. కానీ వెంటనే సరయిన సమయంలో దైవసృష్టి స్మరణకు వచ్చింది. అది అక్కడే వుండాలని గుర్తు తెచ్చుకున్నాను. అందుకనే దాన్ని తిరిగి యథాస్థానంలో పెట్టాను’ అన్నాడు.
ఆ మార్మికుడి విచిత్ర వాక్యాలు విని శిష్యులు పరవశించారు.

- సౌభాగ్య, 9848157909