బాల భూమి

ఉన్నమాటే చెప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇదుగో రోజూ ఇలా అన్నం పారేస్తే బూచాడు ఎత్తుకుపోతాడు’ అంది కోప్పడుతూ గౌరి.
‘బూచాడంటే..’ అడిగింది రాణి.
‘బూచాడంటే మనింటికి వస్తాడే గడ్డం పెంచుకుని, ఎర్రటి కళ్లతో అలా ఉంటాడు. తీసికెళ్లి చీకటి కొట్లో పడేస్తాడు. అన్నం పెట్టడు’ అని చెప్పింది.
‘ఆ...’ అంటూ ఏడుపు మొహం పెట్టింది రాణి.
‘వాణ్ణి నేను చంపేస్తాను’ అంది ఏడుస్తూనే.
‘గౌరీ! ఎందుకలా పిల్లలను భయపెట్టి పాడుచేస్తావు. అది వాడి మీద క్రోధం పెంచుకోదూ?’ అంటూ ఇంగ్లీషులో కోప్పడి ‘రాణీ ఇలా రామ్మా’ పిలిచాడు తండ్రి. రాణి వచ్చింది.
‘ఎందుకంటే దేశంలో అన్నం లేనివాళ్లు ఎంతోమంది ఉన్నారు. మనకు ఉన్నదాంట్లో ఎంతో కొంత వారికి పెట్టాలి. లేదా అన్నం మనకి ఎంత కావాలో అంతే పెట్టించుకోవాలి. నీ దగ్గర నాలుగు లడ్డూలు ఉన్నాయనుకో. మొత్తం నువ్వు తినలేవు. కాబట్టి ఎవరికైనా ఇవ్వాలి. కానీ వేస్ట్ చేయకూడదు. మన ఇంట్లో పనిచేసే కాళీకి పాపం లడ్డూలు లేవుగా. అలాంటి వారికి ఇవ్వాలి’ అని చెప్పాడు రాణి తండ్రి మరింత అర్థమయ్యేలా.
‘చీకట్లో తిరక్కు. దెయ్యాలుంటాయి’ అంది నాయనమ్మ చీకటి పడినా దొడ్లో ఆటలు మానని రాణితో.
రాణీ లోపలికి వచ్చి తండ్రిని కావలించుకుంది.
‘అమ్మా! నువ్వు జాగ్రత్త చెప్పు. కానీ భయపెట్టకు’ అన్నాడు తన తల్లితో.
‘చూడమ్మా రాణీ! దెయ్యాలు ఉండవు కానీ చీకట్లో తిరిగితే పాములు మొదలైనవి కరవచ్చు. లేదా చిన్నచిన్న పురుగులు కుట్టవచ్చు. అందుకే నాయనమ్మ అలా చెప్పింది. కాబట్టి చీకట్లో తిరక్కూడదు’ అని రాణికి చెప్పాడు.
* * *
‘అమ్మో బొద్దింక’ అంటూ ఎగిరి గంతేసి మంచం ఎక్కి కూర్చుంది రాణి.
‘బొద్దింక ఏం చేస్తుందే? మంచం తొక్కకు. దిగు’ తల్లి కసిరింది.
‘చూడు రాణీ. నువ్వు బొద్దింక కంటే ఎంతో పెద్దగా ఉన్నావ్. అది ఎంత చిన్నగా ఉంది. నువ్వు దాన్ని తరిమెయ్యగలవు. కావాలంటే చంపెయ్యగలవు కూడా. అయినా అలా అంత చిన్న వాటికే భయపడితే పెద్దవి ఎలా ఎదుర్కోగలవు. ట్రై చెయ్యి. బొద్దింకను తీసి బయట పడెయ్యి’ అన్నాడు తండ్రి.
రాణి కొద్దిగా భయపడుతూనే మంచం దిగి చాటలోకి బొద్దింకను లాగి పడేసింది బయట. ‘గుడ్’ అన్నాడు రాణి తండ్రి.
* * *
‘అలా రాకుమారుడు వచ్చి పెళ్లి చేసుకున్నాడు. అలాగే నిన్నూ ఓ రాకుమారుడు పెళ్లి చేసుకుంటాడు’ అంది అత్తయ్య రాణితో.
‘రాదా నువ్వు అలాంటి కథలు చెప్పకు’ అన్నాడు రాణి తండ్రి.
‘ఏమిటన్నయ్యా! ప్రతీదీ ఇలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అంటావ్. చిన్నపిల్ల. దానికి ఏం అర్థమవుతుంది. ఏదో సరదాకి చెబుతాం’ అంది రాణి అత్తయ్య.
‘తప్పే! మనం పిల్లలూ వాళ్లకేం అర్థమవుతుందిలే అనుకుని, ఇలా దెయ్యాలున్నాయని భయపెట్టడం.. రాకుమారుడు వచ్చి పెళ్లి చేసుకుంటాడని మభ్యపెట్టడం చేస్తాం. రెండూ తప్పే! దాని వల్ల సరియైన అవగాహన రీజనింగ్ పవర్ ఉండవు పెద్దయినా. ఉన్న విషయం ఉన్నట్లు చెబితే ఇప్పుడు అర్థం కాకున్నా కొంతకాలానికి వారికే అన్నీ సరిగ్గా అర్థమవుతాయి. నిరాశలకు, అనవసర భయాలకి లోను కారు. అందుకే పిల్లలకు వీలయినంత వరకు ఉన్నదున్నట్లు చెప్పాలి. అప్పుడే కల్పనా జగత్తుకు, నిజ జగత్తుకు దూరం తగ్గి, దృఢమైన వ్యక్తిత్వం గలవారు అవుతారు’ అన్నాడు రాణి తండ్రి రఘురాం.

--ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి 9849464017