కథా సాగరం

నిజమైన సాధువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమైన సాధువు ఎవరితోనూ విభేదించడు, చర్చించడు, వాదించడు. ఒక గురువు ఉండేవాడు. ఆయన్ని కలవడానికి ఎందరో వచ్చేవాళ్లు. ఆయన వాళ్లందర్నీ సంతృప్తి పరిచేవాడు. ఎవరితోనూ విభేదించేవాడు కాడు, చర్చించేవాడు కాడు. కారణం సాధువుకు వాదన ఉండదు.
చర్చించేవాళ్లు ‘నేను చెప్పిందే కరెక్ట్. నువ్వు చెప్పింది తప్పు’ అంటారు. సాధువు ఎప్పుడూ ఆ మాట అనడు. ఫలితంగా చర్చకు అవకాశముండదు. కానీ ప్రపంచం ఎప్పుడూ చర్చలో, వాదనలో, ఘర్షణలో ఉంటుంది.
చాలామంది ఆ గురువుతో వాదించడానికి వచ్చేవాళ్లు. కానీ వీలయినంత వరకు ఆయన విభేదాల నించి దూరంగా ఉండడానికి ప్రయత్నించేవాడు.
ఒకసారి ఒక వ్యక్తి గురువుతో ‘ఆదర్శ జీవితమంటే ఏది?’ అని అడిగాడు. గురువు ‘నువ్వు ఏదనుకుంటే అది’ అన్నాడు.
ఆ సమాధానం అతనికి సంతృప్తి నివ్వలేదు. అతను ‘మీరు ఈ ప్రాపంచికమైన జీవితాన్ని లెక్కలేనన్ని బాధ్యతలతో నిండిన జీవితాన్ని ఉదయం మొదలు సాయంత్రం దాకా పడే శ్రమను, దీన్ని ఆదర్శ జీవితమంటారా?’ అన్నాడు.
గురువు ‘అవును’ అన్నాడు. అతను ‘లేదా సర్వసంగ పరిత్యాగంతో, ప్రపంచం నించి వుపసంహరించుకున్న, విశ్రాంతి నిండిన మీ జీవితాన్ని ఆదర్శ జీవితమంటారా?’ అన్నాడు.
గురువు ‘అవును’ అన్నాడు.
అతను ‘కానీ మేము వర్తమాన జీవితాన్ని ఎట్లా వదులుకోగలం? పిల్లల్ని, సంసారాన్ని, చేసే పనిని, బరువు బాధ్యతల్ని ఎట్లా వదులుకోగలం?’ అన్నాడు.
గురువు ‘మరట్లాంటప్పుడు వదలుకోవద్దు’ అన్నాడు.
అతను ‘మరి ఈ జీవితాన్ని వదులుకోలేకపోతే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎట్లా అందుకోగలం?’ అన్నాడు.
దానికి గురువు ‘ఆధ్యాత్మిక జీవితమంటే ఏదనుకుంటున్నావు?’ అన్నాడు.
అతను ‘మేము మీ జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితమని అనుకుంటున్నాం’ అన్నాడు.
గురువు ‘నా జీవితం ఆధ్యాత్మిక జీవితమని భావిస్తే అలా జీవించు లేదా నీ జీవితం ఆధ్యాత్మికమనుకుంటే అలా జీవించు’ ఏది గొప్ప జీవితం అని చెప్పడం కష్టం. నీ ప్రాపంచిక జీవితం గురించి నువ్వు పడే శ్రమ గొప్పదనుకుంటే అలా జీవించు. నీకు సంతోషాన్నిచ్చే పని ఏది వుందో ఆ పని చేయి. అది పరిపక్వతకు వస్తే అది సరైంది అవుతుంది. దానితోబాటు సాగావంటే నువ్వు అదృష్టవంతుడివి’ అన్నాడు.

- సౌభాగ్య 9848157909