బిజినెస్

వచ్చే ఏడాది 7-7.5 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ బసు
హైదరాబాద్, డిసెంబర్ 29: భారతీయ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది 2016లో 7-7.5 శాతం వృద్ధిరేటును సాధించగలదని ప్రపంచ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ బసు అన్నారు. మంగళవారం ఇక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటికీ ప్రపంచంలోని ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడుతూనే ఉందన్నారు. ఈ ఏడాదేగాక, వచ్చే ఏడాదిలోనూ భారత్ ఆర్థిక వృద్ధి కొనసాగగలదన్న విశ్వాసాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) 7.5 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) 7.8 శాతం, ఆపై ఆర్థిక సంవత్సరం (2017-18) 7.9 శాతం చొప్పున భారత జిడిపి వృద్ధిరేటు ఉంటుందని ఇప్పటిదాకా వేసిన అంచనాల్లో ప్రపంచ బ్యాంక్ పేర్కొన్నది తెలిసిందే. అయితే ప్రస్తుతం చోటుచేసుకుంటున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాల మధ్య భారత్ జిడిపి అంచనాలను ప్రపంచ బ్యాంక్ సవరించే అవకాశాలు కనిపిస్తున్నాయ. ఈ విషయాన్ని కౌశిక్ బసు ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం.