8న కవ్వింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్, దీక్షాపంత్ జంటగా త్రిపురనేని విజయ్‌చౌదరి దర్శకత్వంలో అంజని మూవీస్ పతాకంపై పువ్వల శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘కవ్వింత’ అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని జనవరి 8న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శకుడు విజయ్ మాట్లాడుతూ, ఫేక్ కరెన్సీ నేపథ్యంలో ఓ అందమైన విలేజ్‌లో జరిగే ప్రేమకథే ఈ సినిమా అని, ఫొటోగ్రఫి, మ్యూజిక్ ఇందులో హైలెట్‌గా నిలుస్తాయని, ఇప్పటికే విడుదలైన పాటలు మంచి ప్రజాదరణ పొందాయని అన్నారు. టీమ్ అంతా కష్టపడి పనిచేశారని, తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం వుందన్నారు. మల్టీ డైమెన్షన్ వాసు మాట్లాడుతూ, ప్రాంతాలవారీగా చిత్రాన్ని తీసుకున్నారని అన్నారు. ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందని, రెండు రాష్ట్రాల్లో 64 సెంటర్లలో విడుదల చేస్తున్నామన్నారు. హీరో విజయ్ మాట్లాడుతూ, సినిమా మొదలుపెట్టిన రోజునుండి ఎంతో సపోర్టు అందించిన టీమ్ అందరికీ ధన్యవాదాలని, జనవరి 8న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ధన్‌రాజ్, అంబటి శ్రీను, విజయ్ తదితరులు పాల్గొన్నారు.