తెలంగాణ

అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం:కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అక్రమ కట్టడాలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో నూతన పురపాలక చట్టం-2019పై చర్చ జరిగింది. చర్చలో ఆయన పాల్గొంటూ ప్రాపర్టీ టాక్స్ విషయంలో భారీ జరిమానా ఉంటుందని అన్నారు. తప్పుడు సర్ట్ఫికేషన్ ఇస్తే 25 రెట్లు జరిమానా ఉంటుందని హెచ్చరించారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని ఫ్లయింగ్ స్కాడ్ బృందం కొలతలు చేపడుతుందని అన్నారు. పురపాలక చట్టంలోని ప్రతి వ్యాఖ్యాన్ని తానే రాయించానని చెప్పారు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చని అన్నారు. ఈ చట్టం ద్వారా కలెక్టర్లు కీలకం కానున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులందరూ తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాలని అన్నారు. హరితహారం లక్ష్యాలు పూర్తిచేయని అధికారులపై, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని ఆయన ఆకాంక్షించారు.