రాష్ట్రీయం

నెలాఖరులోగా గ్రేటర్ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గులాబీ జెండా ఎగురుతుంది
మాది అహోబిల మఠం కాదు
రాజకీయ పార్టీ ప్రయోజనం చేస్తుంది
ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్, జనవరి 2: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నెలాఖరులోగా పూర్తవుతాయని సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం శనివారం సాయంత్రం సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కోర్టు చెప్పిన విధంగా నెలాఖరులోగా ఎన్నికలు పూర్తవుతాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో తెరాస జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల వారినీ ప్రభుత్వం సమానంగా చూస్తుందన్నారు. ఎవరు ఓటు వేస్తారు, ఎవరు వేయరన్న మాటెలావున్నా ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తుందన్నారు. తెలంగాణలో ఉన్నవారంతా తెలంగాణ వారేనని, హైదరాబాద్‌లో ఉన్న వారంతా హైదరాబాదీలేనని వ్యాఖ్యానించారు. ఇతర ప్రాంతాల వారు తెరాసకు ఓటు వేయరనే ప్రచారం గురించి మీడియా ప్రశ్నించగా, ప్రభుత్వానికి మాత్రం అందరూ సమానమే, అందరి కోసం పని చేస్తామన్నారు. ఇంత ఫ్రెండ్లీ ప్రభుత్వం ఎక్కడాలేదని, గతంలోనూ లేదన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే వరాలు కురిపిస్తున్నారనే విమర్శ గురించి మీడియా ప్రశ్నించగా, మాదేమన్నా అహోబిలం మఠమా? రాజకీయ పార్టీ, ప్రయోజనం ఆశించడంలో తప్పేముందని కెసిఆర్ వ్యాఖ్యానించారు.చంచల్‌గూడ జైలు, రేస్‌కోర్స్‌ను నగరం నుంచి తొలగించనున్నట్టు చెప్పారు. నగర శివారులో మరో ప్రాంతంలో రేస్‌కోర్స్‌కు 200 ఎకరాల స్థలం వారు కోరినట్టు చెప్పారు. చంచల్‌గూడ, రేస్‌కోర్స్‌లో అన్నివర్గాల వారికీ విద్యా సంస్థలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల ఎలాంటి నష్టం లేదన్నారు. 18 రాష్ట్రాలు వివిధ సందర్భాల్లో ఈవిధంగా ముందుగానే బడ్జెట్ ప్రవేశపెట్టాయని తెలిపారు. కేంద్రం నుంచి ఆర్థిక సహాయం ఏవిధంగా వస్తుందో, ఎంత వస్తుందో ముందుగానే అంచనా ఉంటుంది కాబట్టి సమస్య లేదన్నారు.