తెలంగాణ

దేశానికి సీఏఏ అవసరం లేదు:కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ దేశానికి సీఏఏ అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన ఈరోజు శాసనసభలో సీఏఏకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే ఏడు రాష్ట్రాలు.. కేరళ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని, తమది ఎనిమిదో రాష్ట్రమని సీఎం తెలిపారు. ఆందోళనలను సృష్టిస్తున్న సీఏఏని పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పీకర్‌ ద్వారా కేంద్రాన్ని కోరారు. సీఏఏను తాము గుడ్డిగా వ్యతిరేకించడం లేదని, అన్నీ అర్థం చేసుకొని పూర్తిగా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో కోట్ల మందికి బర్త్ సర్టిఫికెట్ లేదు వారి పరిస్థితి ఏంటి. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలి’ అని సీఎం పేర్కొన్నారు.