అదిలాబాద్

మద్యం మత్తులో జోగుతున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పింఛన్ ప్రజల హక్కు.. నజరానా కాదు
* విద్యార్థులకు కెజి టు పిజి ఏమైనట్లు ?
* ఉద్యమ నేతల చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాలి
* పివోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య
ఖానాపూర్ , నవంబర్ 27: బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యం డ్రిగ్గులను ఏర్పాటుచేస్తూ ప్రజలను మద్యం మత్తులో దింపుతున్నాడని, మిషన్ కాకతీయ అని, వాటర్ డ్రిగ్గులని తెలంగాణ ప్రభుత్వాన్ని మద్యం డ్రిగ్గులుగా మార్చి బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను శాసిస్తున్నాడని పివొ డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ వి.సంధ్య అన్నారు. పట్టణంలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పిడి ఎస్‌యు 13వ నిర్మల్ డివిజన్ మహాసభల సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటుకు కవులు, కళాకారులు, ఉద్యోగులు, ఉద్యమకారులు, విద్యార్థులు ఉద్యమాల నేపథ్యమే తెలంగాణ ఏర్పాటుకు కారణమైందన్నారు. కేసి ఆర్ ఎన్నికల్లో చేసిన హామీలను మరిచి విద్యార్థులకు అన్నివిధాల ఆదుకుంటామని, విద్యార్థులకు చెందాల్సిన ఫీజు రియంబర్స్‌మెంట్‌ను ఇవ్వకుండా పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే విధంగా చేస్తున్నారన్నారు. గత 40 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటుకు నోచుకోలేదన్నారు. విదేశీ పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తూ కార్పోరేట్ స్కూళ్లకు వత్తాసుపలుకుతున్నారన్నారు. తమ పిల్లలు ఉన్నతమైన విద్యను అభ్యసించాలన్న నిరుపేద తల్లితండ్రుల ఆశలు బుగ్గిపాలవుతున్నాయన్నారు. గిరిజన గోండు నాయకుడు కొమురంభీం స్వతంత్య్ర పోరాటంలో ప్రాణాలు వదిలిని పోరాటవీరుల చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్పించాలని పిడి ఎస్‌యు ఆధ్వర్యంలో ఎన్నో సార్లు ఉద్యమాలు చేసినప్పటికి కెసిఆర్ విద్యార్థుల మాటలను లెక్కచేయడం లేదన్నారు. కేజిటు పిజి నిర్భంద విద్యను కొనసాగిస్తామని, విద్యార్థులకు తీరని లోటు కల్పిస్తున్నారన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎండిపోగా పంటకు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర అనుకున్న స్థాయిలో లేకపోగా రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణలో 1400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారి గుర్తింపులో కూడా దోపిడి రాజకీయాలు కెసిఆర్ చేస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇంటింటా ఉద్యోగాలు, దళితులకు మూడెకరాల భూమి, కళ్యాణలక్ష్మి, అర్హులకు పింఛన్లు కేసి ఆర్‌కే సరిపోవన్నారు. ప్రభుత్వం పింఛన్లు ఇస్తున్నామన్న పేరేకాని సరైన లబ్ధిదారులకు చెందడంలేదన్నారు. బంగారు తెలంగాణ కాదు భవిష్యత్తు తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమించాలని విద్యార్థులకు తెలియజేశారు. ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెకు కనీస మద్దతు కూడా తెలపలేదన్నారు. టిడిపి ప్రభుత్వంలో ఉన్న తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌లకు తెలంగాణ వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులను ఇవ్వడం కెసిఆర్ బుద్దితక్కువ పనేనని ఎద్దేవచేశారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు నర్సయ్య, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె.రణధీర్, పిడిఎస్‌యు మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జలసాధన సమితి జిల్లా అధ్యక్షులు నైనాల గోవర్ధన్, ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి శంకర్, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు సురేష్, జిల్లా కార్యదర్శి శంకర్ సత్యం, జిల్లా సహాయ కార్యదర్శి సునారికారి రాజేష్, పివోడబ్లూ జిల్లా కార్యదర్శి శ్రీరాంపూర్ ఎంపిటిసి లహరిక, ఎఐకెఎంఎస్ జిల్లా నాయకులు సర్దార్, డివిజన్ నాయకులు గోపాల్, మండల్ల నాయకులు లక్ష్మణ్, నిర్మల్ డివిజన్ కన్వీనర్ రాజునాయక్,సుధీర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.