తెలంగాణ

చెప్పింది చేస్తాం : కేసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఉన్నవారంతా హైదరాబాదీలుగా గర్వపడాలని, ముంబైలో ఎవరున్నా ‘ముంబైకర్’గా చెప్పుకునేందుకు గర్వపడతారని, అలాగే ఇక్కడివారంతా హైదరాబాదీలేనని, వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఆ తరువాత మరచిపోయామన్న కాంగ్రెస్ విమర్శలను ఆయన తప్పుబట్టారు. తెలంగాణకు పొట్టకూటికోసం వచ్చినవారికి ఎప్పుడూ ఇబ్బందులు ఉండవని, పొట్టకొట్టేందుకు వచ్చేవారిని చూస్తూ ఊరుకోమని అన్నారు. తెలంగాణ అప్పులఊబిలో కూరుకుపోతోందని, భవిష్యత్ తరాలపై అప్పులభారం పడుతుందన్న బిజెపి విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం అమెరికా, ప్రస్తుతం ఆర్థికంగా రెండో బలమైన వ్యవస్థ కలిగిన చైనాకూడా అప్పుల్లో ఉన్నాయని ఉదహరించిన కెసిఆర్ ఇది తప్పనిసరి చర్య అని, దీనివల్ల ముప్పేమీ ఉండదని అన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని, ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్నామని, మిషన్ భగీరథ తప్పక పూర్తవుతుందని ఆయన ధీమాగా చెప్పారు.