తెలంగాణ

ఎన్టీఆర్ గార్డెన్‌కు ముప్పు ఉండదు : కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అని, తెలుగువాళ్ల గుండెల్లో ఆయన చిరకాలం నిలిచిపోతారని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. నటుడు బాలకృష్ణ నూరవ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ముహూర్తపు సన్నివేశం ప్రారంభం సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నగరంలో ఎన్టీఆర్ గార్డెన్ ఎప్పటికీ అలాగే ఉంటుందన్నారు. ఎన్టీఆర్ గార్డెన్ చెక్కుచెదరకుండా ఉండాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. బాలయ్య కొత్త సినిమాను కుటుంబ సభ్యులందరితో కలిసి తొలిరోజే చూడాలని ఉందని ఆయన అన్నారు. నవశకానికి నాంది పలికిన యుగపురుషుడు శాతకర్ణి అని, అటువంటి వ్యక్తి కథను సినిమాగా తీయడం అభినందనీయమన్నారు. ఈ సినిమాను తెలుగువారందరూ చూడాలన్నారు.