జాతీయ వార్తలు

బలమైన ఫెడరల్ ఫ్రంట్ కోరుకుంటున్నారు:మమత, కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: దేశ ప్రజలు బలమైన ఫ్రంట్‌ను కోరుకుంటున్నారని తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు కేసీఆర్, మమతాబెనర్జీ అన్నారు. సోమవారం వీరివురు మధ్య రెండు గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడారు. దేశం మార్పును కోరుకుంటుందని మమత పేర్కొన్నారు. ఒకే పార్టీ దేశాన్ని పాలిస్తుందని అనుకోవద్దని అన్నారు. దేశ ప్రజలు మరో ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని కేసీఆర్ అన్నారు. ఈ చర్చలు ప్రారంభం మాత్రమేనని ఆయన అన్నారు. కలిసివచ్చే పార్టీలతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. మమతా బెనర్జీతో సమావేశం తొలి అడుగుమాత్రమేనని అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని అన్నారు.