రంగారెడ్డి

తెలంగాణ అభివృద్ధికి కేసిఆర్ నిరంతర కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, డిసెంబర్ 8: తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది దేశానికే తలమానికంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నట్లు మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కేపిఆర్ గార్డెన్‌లో మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు దర్గ దయాకర్‌రెడ్డి అధ్యక్షతన మండల టిఆర్‌ఎస్ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గాన్ని పద్దెనిమిది నెలల వ్యవధిలో 415 కోట్ల నిధులు వెచ్చించి అన్ని రంగాలలో అభివృద్ధి పరిచినట్లు ఆయన తెలిపారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత యిస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్ళి పార్టీ ప్రతిష్ఠను పెంచేందుకు ప్రతి కార్యకర్త నిరంతరం కృషి చేయాలని ఆయన అన్నారు. అర్హులైన పేదలకు పార్టీలకతితంగా సేవలు అందించటంతో మరింత ప్రజా మద్దతు కూడగట్టుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న పనులన్ని ఇప్పటి వరకు పూర్తి చేయటంతో పాటు హామీ ఇవ్వని పనులను కూడ చేసి చూపించిన ఘనత కేసిఆర్‌దేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వాటర్‌గ్రిడ్ పథకాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేసేందుకు ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ హయంలో మండలానికి నెలకు కోటి 28లక్షల 13వేల 500 రూపాయలను ఫించన్ల రూపేణ ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలో ఎమ్మెల్యే నిధులు 75 లక్షలు, లక్షలు బిఆర్‌జిఎఫ్ నిధులు కోటి 11 లక్షలు, పది కోట్ల నిధులతో అవుషాపూర్ నుండి మాదారం రోడ్డు, పది కోట్ల నిధులతో పీర్జాదిగూడ నుండి ప్రతాపసింగారం రోడ్డు, పది కోట్లతో ప్రతాపసింగారం నుండి జోడిమెట్ల రోడ్డు, ఆరున్నర కోట్ల నిధులతో ఎదులాబాద్ సమీపంలోని మూసి వంతెన నిర్మాణం, మండల కేంద్రంలోని కొండాపూర్ రైల్వే వంతెన నిర్మాణంలో స్థలాలు కోల్పోయిన బాధితులకు 15 కోట్లు, వంతెన నిర్మాణానికి 39 కోట్లు, బిటి రోడ్ల మరమ్మత్తులకు ఎనిమిదిన్నర కోట్లు, మెటల్ రోడ్లను బిటి రోడ్లుగా మార్చేందుకు 7.66 కోట్లు, మట్టి రోడ్ల మరమ్మత్తులకు 1.5 కోట్లు, బొక్కోనిగూడ గ్రామంలోని ఎరిమల్లెవాగు వంతెన నిర్మాణానికి నాలుగు కోట్లు, మేడ్చల్ నియోజకవర్గంలో వాటర్‌గ్రిడ్ పథకానికి 235 కోట్లు, ఘట్‌కేసర్ నుండి షామీర్‌పేట వరకు అవుటర్ రోడ్డు మరమ్మత్తులకు 235 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గానికి 449 డబుల్ బెడ్ రూమ్‌ల ఇండ్లు మంజూరు అయినట్లు, మరో 650 ఇండ్లు అదనంగా సాదించినట్లు ఆయన తెలిపారు. ఏదులాబాద్ చెరువును మిని ట్యాంక్ బాండ్‌గా మార్చేందుకు తొమ్మిది కోట్లు, అన్నోజిగూడలో మూడు కోట్ల నిధులతో గోదాంల నిర్మాణం, 85 లక్షల నిధులతో మేడిపల్లి గ్రామంలో రైతు బజారు ఏర్పాటు, రైతుల రుణమాఫీకి ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలో 65 లక్షల నిధుల చొప్పున నాలుగు సబ్ రిజిష్టార్ కార్యాలయాలను మేడిపల్లిలో ఒకటి, జోడిమెట్లలో రెండు, కీసరలో ఒకటి ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ డిగ్రి కళాశాల, కీసరలో ఐటిఐ, షామీర్‌పేట్‌లో ఐటిఐ, మేడ్చల్‌లో పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలలోకి తీసుకువెళ్ళి పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున నామినేటెడ్ పదవులను వచ్చే సంవత్సరం మార్చిలో భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా జడ్పీటిసిల ఫోరం అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వ హయాంలో బంగారు తెలంగాణ విజయవంతం అవుతుందన్నారు. రెండు సంవత్సరాలు పూర్తిగా నిండక ముందే దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూడటం ప్రతి తెలంగాణ పౌరుడు గర్వపడాలని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించేందుకు ప్రతి కార్యకర్త నిరంతరం కృషి చేయాలని ఆయన కోరారు. పార్టీ పటిష్ఠతకు కృషి చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, టిఆర్‌ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు దర్గ దయాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుల కుమార్, మండల రైతు సేవా సహకార సంఘం చైర్మన్ గొంగళ్ళ స్వామికుర్మ, కృష్ణమూర్తి, బొమ్మక్ శ్రీనివాస్, బైరు రాములుగౌడ్, బోయపల్లి కొండల్‌రెడ్డి, ఎంపిటిసి సభ్యులు ఇతర నేతలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.