జాతీయ వార్తలు

కెసిఆర్ ధర్నా చేస్తే స్వాగతిస్తాం: కేంద్ర మంత్రి సదానంద గౌడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ సిఎం కెసిఆర్ ధర్నా చేస్తే తాము స్వాగతిస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కెసిఆర్ విమర్శలు చేయడం తనకు విస్మయం కలిగించందని ఆయన మంగళవారం తెలిపారు. హైకోర్టు విభజన విషయమై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తనను కలిసిన సందర్భంగా గౌడ ఈ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజన అనేది తన పరిధిలో లేదన్నారు. విభజన ప్రక్రియను వేగవంతం చేయాల్సిన పని హైకోర్టుదేనన్నారు. ఎపిలో హైకోర్టు ఏర్పాటుకు వౌలిక వసతులను ఆ రాష్టమ్రే కల్పించాల్సి ఉందన్నారు. హైకోర్టు విభజనపై గతంలో ఉభయ తెలుగురాష్ట్రాల సిఎంలతో తాను చర్చించానని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో న్యాయవాదుల ఆందోళనకు సంబంధించిన తాజా పరిణామాలను సుప్రీం కోర్టుకు తెలియజేస్తానని ఆయన చెప్పారు.