కడప

జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం, సెప్టెంబర్ 22:ప్రభుత్వం కడప జిల్లాను మలేరియా హెల్త్ ఏమర్జెన్సీగా ప్రకటించినట్లు కలెక్టర్ సత్యనారాయణ వెల్లడించారని జాతీయ కీటక జనిత నిర్మూలన అధికారి త్యాగరాజు తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటం సబ్ యూనిట్ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో 2012లో 668 మలేరియా కేసులు నమోదుకాగా, 2013 లో 247, 2014లో 407, 2015లో 353, ఈ ఏడాది ఇప్పటి వరకు 589 కేసులు మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. అందులో వివిధ రకాల జబ్బులకు సంబంధించిన కేసులున్నాయన్నారు. ప్రపంచంలో 2800 రకాల దోమలు ఉండగా అందులో ఆడ ఎనాఫిస్ దోమ వల్ల మలేరియా జ్వరం సోకుతోందన్నారు. ఈ దోమ మూడురోజుల నుంచి వంద రోజుల వరకు జీవిస్తుందని కిలో మీటర్ నుంచి 2కి.మీ.వరకు ప్రయాణిస్తుందన్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో వర్షాభావం తగ్గువగా ఉండటం వల్ల ఎక్కడ చూసినా ప్రజలు నీటిని నిల్వవుంచుకుంటారని, దేవలంపల్లెలో 23 కేసు లు, సురభిలో 23 కేసులు, చెన్నూరులో13, సికెదినె్నలో 16, గాలివీడులో19, రామాపురంలో 31, ఎండపల్లిలో 16, దేవపట్లలో 18, సుండుపల్లెలో 25, వీరబల్లిలో 20 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. జ మ్మలమడుగు డివిజన్‌లో 67 మలేరియా కేసులు నమోదుకాగా రాజంపేట డివిజన్‌లో 112 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. సిద్దవటంలో 10 మలేరియా కేసులు నమోదయ్యాయని నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో అబేట్‌మందును చల్లాలని సూచించారు. అలాగే మండలంలోని 30పడకల ఆసుపత్రిని తనిఖీ చేశారు. మలేరియా కేసులకు సంబంధించిన రికార్డులు ఆయన పరిశీలించారు. సబ్ యూనిట్ అధికారి సుబ్బరాయుడు, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.