కడప

గణపతి సచ్చిదానందస్వామీజీకి యోగా నేర్పింది ప్రొద్దుటూరే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 23: గణపతి సచ్చిదానందస్వామి దత్తపీఠాలను దేశవ్యాప్తంగా స్థాపించిన పరమపూజ్యులైన స్వామీజీకి ప్రొద్దుటూరు పట్టణమే యోగా నేర్పిందని, ఇలాంటి ప్రొద్దుటూరు విశిష్టమైందని దత్తపీఠం రెండవ పీఠాధిపతి శ్రీశ్రీ దత్తవిజయానందతీర్థస్వామీజీ అన్నారు. దత్త పీఠాల్లోనే రెండవ పీఠంగా వెలుగొందుతున్న ప్రొద్దుటూరులోని శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థాన సముదాయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13వ చాతుర్మాసం మైసూర్ దత్తపీఠంలో అత్యంత వైభవంగా, పవిత్రంగా భక్తులచే ఆధ్యాత్మిక చింతనతో సాధన చేయడం జరిగిందని, సాధన ద్వారా మనిషిలో నూతన శక్తి ఉద్భవిస్తుందన్నారు. కర్ణాటకలోని మేకధాట్‌లో ఉచితంగా భారీ మెడికల్ క్యాంప్ నిర్వహించామన్నారు. ఈయేడు వర్షాలు బాగా కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండి రైతులు, వ్యాపారులు, ప్రజలు సుఖసంతోషాలతో వుంటారన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయని, నవరాత్రుల్లో నరసింహస్వామి, సుదర్శనయోగస్వామివార్ల వద్ద ప్రార్థన చేయడం వల్ల దేశ సంరక్షణ కోసం సైనికులలో నూతనోత్తేజాన్ని సమకూర్చినవారమవుతామన్నారు. నరసింహస్వామిని పూజించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని, కార్యసిద్ధి నెరవేరుతుందన్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తపించడం వలన శత్రుదోషం, నరదోషాలు తొలగి అష్ట్యైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నారు. గణపతి సచ్చిదానందస్వామీజీ బాల్యం ఎక్కువగా ప్రొద్దుటూరులోనే గడపడం, ఇక్కడే యోగం సిద్ధించడం, ప్రపంచవ్యాప్తంగా ప్రొద్దుటూరు యొక్క విశిష్టతను తెలియజేయడం ఆనందంగా వుందన్నారు. ప్రొద్దుటూరు ప్రజలు స్వామికృపతో కష్టాలన్నీ తొలగిపోయి సుఖాలు సిద్ధిస్తాయన్నారు. కర్ణాటక నుంచి తిరుమల, కడప, ప్రొద్దుటూరు పట్టణాలకు చేరుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ సత్యనారాయణ దేవస్థానాన్ని దర్శించుకోవడం వలన పుణ్యప్రాప్తి లభిస్తుందని, ఈ పీఠం అత్యంత శక్తివంతమైనదని తెలిపారు. అనంతరం మాకం జెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి తన మిత్రులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో మాకం రామాంజనేయులుగుప్తా, మోహన్‌రావు, సుధాకర్‌గుప్తా, పట్టణ ప్రముఖులు స్వామీజీ ఆశీస్సులు పొందారు.