కడప

ఇద్దరు ఎంపిడిఓలపై వేటు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, సెప్టెంబర్ 23: కమలాపురం మండలం పొడదుర్తి గ్రామపంచాయతీలో జరిగిన ఉపాధి పనుల్లో అవినీతి చోటు చేసుకోవడంతో ఇందుకు బాధ్యులను చేస్తూ ఇద్దరు ఎంపిడిఓలను సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎంపిడివో కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. ఈ పనులకు సంబంధించి మండలంలో పనిచేస్తున్న ఎంపిడిఓ ప్రభాకరరెడ్డి ఇక్కడ పనిచేసి బదిలీపై చెన్నూరు మండలానికి వెళ్లిన ఎంపిడిఓ వెంకటరమణారెడ్డిని సస్పెన్షన్ చేయగా టెక్నికల్ అసిస్టెంట్, ఈసి లను విధుల నుంచి తొలగించగా ఇద్దరు ఉపాధి ఏపివో లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసారు. ఇందుకు సంబందించి వివరాల్లోకి వెళితే మండలంలోని పొడదుర్తి పంచాయతీలో గత ఏడాది రూ. 20లక్షల వ్యయంతో 4రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఐతే ఈ పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ గ్రామపంచాయతీలో నిర్వహించిన సామాజిక తనిఖీలో ప్రజలనుంచి ఫిర్యాదులు అందాయి. అంతేకాక ఈ ఏడాది మే 4న కమలాపురంలో జరిగిన ఓపెన్ ఫోరంలో ఉపాధిరోడ్డుపనుల్లో అవకతవకలు జరిగినట్లు ఇందుకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేవని సామాజిక కార్యకర్త ఓపెన్‌ఫోరం నిర్వహించిన డ్వామాపీడి రమేష్, ఇతర అధికారుల ఎదుట తెలియజేశారు. ఇందుకు తోడుగా ఆ గ్రామానికి చెందిన ప్రజలు అధికారుల ఎదుట పలు అవకతవకలు జరిగినట్లు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐతే ఇందుకోసం జిల్లా ఉన్నతాధికారులు తెలుగుగంగ పంచాయతీరాజ్, సీనియర్ కంట్రోల్ అఫీసర్‌ను త్రిసభ్యకమిటీగా ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఈ విచారణ మూడు పర్యాయాలుగా పొడదుర్తి పంచాయతీలో అధికారులు ప్రజలను విచారించారు. రోడ్లు ఏర్పాటులోనే పలు అవకతవకలు జరిగినట్లు దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రజలు విచారణలో తెలిపారు. ఈ విషయంపై లోతుగా విచారించిన అధికారులు రూ.9.31లక్షల మేర అవకతవకలు జరిగినట్లు త్రిసభ్య కమిటీ అధికారులు కలెక్టరుకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాల్లో కూడా బినామి ఖాతాలు ఉన్నట్లు ఎంబుక్కుల్లో కూడా సరైన రికార్డు లేనట్లు వారు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో ఎంపిడివోల సస్పెన్షన్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా బాధ్యులైన ఎంపిడివోలను సస్పెండ్ చేయడమేకాక అవినీతి సొమ్మును రికవరీ చేయాలని కూడా కలెక్టర్ ఆదేశించారు. ఇందులో తమ వంతు బాధ్యత పోషించిన ఒక టెక్నికల్ అసిస్టెంట్, ఒక ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌ను విధుల నుంచి తొలగించడమేకాక ఇద్దరు ఏపివోలకు షోకాజ్ నోటీసు జారీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు. ఎంపిడివోల సస్పెన్షన్‌తో మండలంలోని రాజకీయ నేతల్లో అలజడి ప్రారంభమైంది. ఈ విషయంపై మండలంలోని ఎంపిటిసిలు, సర్పంచులు శనివారం కలెక్టరును కలసి ఎంపిడివోల సస్పెన్షన్ ఎత్తివేయాలని వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.