కడప

26న జిల్లాకు మంజునాథ్ కమిటీ రాక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 23: కాపులు (బలిజలు)లను బిసి జాబితాలో చేర్చేందుకు మంజునాధ్ కమిటీని ఏర్పాటుచేయడం ఆ కమిటీ జిల్లాకు ఈనెల 26న జిల్లాకు రావడంతో కాపు సంఘం, బిసి కులసంఘాలు తమ వాణిని విన్పించేందుకు సిద్దమయ్యారు. కాపు సంఘం రాష్టన్రేతలు, ప్రభుత్వ సూచనల మేరకు మంజునాథ్ కమిటీ వద్ద వారి స్థితిగతులను, వెనుకబడిన తనాన్ని తదితర విషయాలపై మంజునాథ్ కమిటీ ఎదుట విన్పించాలని శుక్రవారం పలు సంఘాలు కలిసి సమావేశమై నిర్ణయించారు. బిసిల్లో కులాల వారీగా జిల్లాస్థాయి నేతలు, మేధావులు, ఉద్యోగ సంఘాల నేతలు మంజునాథ్ కమిటీ వద్ద వాడివేడిగా తమ వాదనలు విన్పించేందుకు ఎడతెరిపిలేకుండా గత వారం రోజులుగా సమావేశం నిర్వహిస్తున్నారు. అలాగే బిసి సంఘం భవన్‌లో జిల్లా అధ్యక్షుడు చిదానంద గౌడ్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి మంజునాథ్ కమిటీ ఎదుట గట్టిగా వాధించేందుకు బిసిల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వారిని ఏరికోరి సమావేశం ఏర్పాటుచేశారు. అయితే బిసి సంఘాల్లో అనేక కులసంఘాలు ఉండటం, ఆ కులసంఘం నేతలంతా జిల్లాస్థాయి నేతలతో సమాయత్తమయ్యారు. ఈ మధ్యకాలంలో బిసి సంఘం నేతలు కలిసి సమావేశమై జాతీయ, రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం నేతలతో సంప్రదింపులు చేశారు. మంజునాథ్ కమిటీ వద్ద కాపులను బిసిల్లో చేర్చకుండా ఉండేందుకు తమ వాదన గట్టిగా విన్పించడంతోపాటు కమిటీ ఎదుట అమీతుమీ తేల్చుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అలాగే ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కమిషన్ వెనుదిరిగేందుకు కూడా బిసి సంఘం నేతలు వ్యూహరచనలో ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా జిల్లాను శాసిస్తున్న కాపుల సంఘం వాదనలు వ్యతిరేకించాలని బిసి సంఘం నేతలు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. శాంతిభద్రతలు కలగకుండా పోలీసులుకూడా బిసి కమిషన్ రోడ్డుమ్యాప్‌ను పరిశీలించి కాపు, బిసి సంఘం నేతల కదలికలపై నిఘాను పెంచారు. అవసరమనుకుంటే రాష్టన్రాయకులను కూడా కడపకు రప్పించి వారి ద్వారా కూడా వాదనలు వినిపించనున్నారు. ముఖ్యంగా యోగివేమన విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాలలు, పిజి కళాశాలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి మంజునాథ్ కమిటీ వద్దకు కాపులు రాకుండా అడ్డుకునేందుకు కూడా యోచిస్తున్నారు. కాపు ఫెడరేషన్ సభ్యుడు మోదుగుల పెంచలయ్య ఆధ్వర్యంలో జిల్లా కాపునేతలంతా ఇప్పటికే సమావేశమై వారి వాదనలను విన్పించేందుకు బిసి సంఘాల ఎత్తులకు పై ఎత్తులువేసేందుకు సర్వం సిద్ధం చేశారు. మొత్తంమీద మంజునాథ్ కమిటీ వద్ద ఇరువర్గాలవారు వాదనను విన్పించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.