కడప

ఉద్యోగాల కల్పన కార్పొరేషన్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, సెప్టెంబర్ 27:నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామకపు పత్రాలను మేడా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట ఎఐటిఎస్‌లో ఆదివారం ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి దాదాపు 1600 మంది యువతీ యువకులు పాల్గొనగా, అందులో 778 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించడం హర్షణీయమన్నారు.
ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన వివరించారు. నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దూరపు ఆలోచనతో ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచి నిరుద్యోగులు లేని రాష్ట్రంగా చేసేందుకు ముఖ్యమంత్రి పడుతున్న తపనకు త్వరలోనే కార్యరూపం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి పరిశ్రమల నెలకొల్పేందుకు నిరంతరాయంగా ముఖ్యమంత్రి పడుతున్న శ్రమకు తగ్గ ఫలితం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా అడవెంట్ గ్లోబల్ సొల్యూషన్ లిమిటెడ్‌లో 13 మందికి, పోలారిస్ కంపెనీలో 40 మందికి, నిసిఫిట్ కంపెనీలో 6మందికి, పేటిఎంలో 52 మందికి, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలో 6 మందికి, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో 9 మందికి, మనపురంలో 10 మందికి, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్‌లో 79 మందికి, ఫ్లిప్‌కార్ట్‌లో 112మందికి, హెచ్‌డిఎఫ్‌సిలో 27 మందికి, శాంతిరామ్ హాస్పిటల్‌లో 7 మందికి, జి.జె సొల్యూషన్స్‌లో 23 మందికి, వినూత్న ఫర్టిలైజర్స్‌లో 33 మందికి, అపోలో ఫార్మశీలో 55 మందికి, బిగ్‌సిలో 10 మందికి, శ్రీవారి ఎంటర్‌ప్రైజెస్‌లో 296 మందికి ఉద్యోగాలు లభించడం ఎంతో ఆనందదాయకమని విప్ మేడా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్ పిల్లై, డ్వామా పిడి రమేష్, ఎపిఎస్‌ఎస్‌డిసి అసోసియేటెడ్ ప్రాజెక్టు మేనేజర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.