కడప

రైతు ఆత్మహత్యపై ఆర్డీఓ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్రాయపేట, సెప్టెంబర్ 27: మండలంలోని యర్రగుడి గ్రామం ముద్దప్పగారిపల్లె గ్రామానికి చెందిన రైతు చెన్నారెడ్డి జూన్ నెలలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. ఆ రైతు ఆత్మహత్య విచారణపై మంగళవారం ఆర్డీవో చినరాముడు, తహశీల్దార్ నాగేశ్వరరావు, వ్యవసాయాధికారి నాగమధుసూదన్, వీఆర్‌వో రామచంద్ర, స్థానిక సర్పంచ్ గఫూర్‌లు కలిసి ముద్దప్పగారిపల్లెలో విచారణ చేపట్టారు. విచారణలో పంటల దిగుబడి రాకపోవడంతో అప్పులు చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారన్న నివేదికను సంబంధిత అధికారులకు పంపనున్నట్లు ఆర్డీఓ చినరాముడు పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ పంటల దిగుబడి రాకపోవడంతో జీవనోపాధి కొరకు అప్పులు చేసుకొని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జూలై నెలలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అప్పట్లో ప్రభుత్వం నుండి ఏ ఒక్క రూపాయి ఆర్థికసాయం రైతుకు అందలేదని ఆ రైతుపై విచారణ చేపట్టి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలన్న మేరకు ప్రభుత్వం అధికారులు విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.