కడప

గండికోట ఉత్సవాలకు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 29:వారసత్వ ఉత్సవాలను అక్టోబర్ 16, 17వ తేదీల్లో రెండురోజులపాటు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటుచేయాలని కలెక్టర్ కెవి సత్యనారాయణను ఆదేశించడం , రాయలసీమ జిల్లాల పర్యాటకశాఖకు చెందిన ప్రధాన అధికారి గండికోట ఉత్సవాల నిర్వహణపై ప్రణాళికలు రూపొందించి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. గండికోటకు ప్రపంచవ్యాప్తంగానే స్థానం సంపాయించేందుకు ఈ వారసత్వ ఉత్సవాల్లో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో గండికోట వారసత్వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి జిల్లా పేరుప్రతిష్టలు పెంచనున్నారు. ముఖ్యంగా శాస్ర్తియ, సాంస్కృతిక, గండికోట చరిత్ర తదితర సాంప్రదాయ కళారూపాలతో కార్యక్రమాలు నిర్వహించేందుకు నడుం బిగించారు. జిల్లా స్థాయిలో అన్నిశాఖల అధిపతులను ఈ ఉత్సవాల్లో భాగస్వాములను చేసి కమిటీలు ఏర్పాటుచేశారు. గత ఏడాది ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిధిగాహాజరై గండికోటను ప్రపంచపర్యాటకంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రూ.500 కోట్లతో పురాతనమైన గండికోటను రూపుదిద్ది, పాత కట్టడాలకు సొగసులు చేసి పెన్నానది ఒడ్డున ఉండటంతో పెన్నానదిని తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వారసత్వ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రిసెప్షన్ కమిటీ , కల్చరల్ కమిటీ, ఫైనార్ట్స్ కమిటీ, శానిటేషన్ కమిటీ, సావనీర్ కమిటీ, ఫుడ్ కమిటీ తదితర కమిటీలు జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ అధ్యక్షతన నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు వారసత్వ ఉత్సవాలపై వ్యాసరచన, క్విజ్, వక్తృత్వపోటీలు, ఆటలు, పాటలు తదితర పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. అక్టోబర్ 16,17వ తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ముషాయిరా,ఖవ్వాలి , భక్తిగీతాలు, కూచిపూడి నృత్యాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కలెక్టర్, జిల్లా ఎస్పీ, రాయలసీమ జిల్లాల పర్యాటకశాఖ అధికారులు, జిల్లా పర్యాటక ఇన్‌చార్జ్ అధికారులు, వైవియు ప్రొఫెసర్ ఈశ్వరరెడ్డి, టూరిజం శాఖ అధికారి ప్రసాద్‌రెడ్డి, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డిలచే వారసత్వ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జమ్మలమడుగు నుంచి గండికోటకు వెళ్లేందుకు రూ.17కోట్లతో రహదారి నిర్మాణం పనులు చేపట్టారు. గండికోటలో రోడ్డు విస్తరణ , పాతభవనాల మరమ్మతులు చేపట్టి వారసత్వ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.