కడప

ప్రబలుతున్న అంటువ్యాధులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 29: ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో అంటువ్యాధులు ప్రబలేది సర్వసాధారణమే ఇందుకు కారణం కడప నగర పాలక సంస్థ జిల్లాలోని పురపాలక సంఘాల అధికారులే బాధ్యులని చె ప్పవచ్చు. ప్రతి పురపాలక సంఘంలో డ్రైనేజి అస్తవ్యస్థంగా ఉండటం, అండర్ గ్రౌండ్ డ్రేనేజి పేర్లతో ఏటా లక్షలరూపాయలు ఖర్చు చేస్తున్నారే తప్ప నిర్వహణ లోపంలో అడుగడుగునా అవినీతి చోటుచేసుకుందనేది జగమెరిగిన సత్యం. నగర పాలక, పురపాలక సంఘాల్లో శానిటరీ అధికారులు, సూపర్‌వైజర్లు కేవలం అనుభవంతో పదోన్నతులు పొంది పలువురు అవినీతికి అలవాటుపడి పారిశుద్ధ్య సిబ్బందిని వేధించడం తప్ప పారిశుద్య కార్యక్రమాలు చేపట్టడంలో ఘోరంగా విఫలమయ్యారు. అలాగే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ఇళ్లనిర్మాణంలోను, డ్రైనేజిల నిర్మాణాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడటంతో నగరపాలక, పురపాలక సంఘాల్లోని మురుగునీరు నేటికి బయటకు పంపలేక నిర్మాణాలన్నీ ఇష్టారాజ్యంగా చేపట్టారు. మురికివాడల్లో డ్రైనేజి వ్యవస్థ పూర్తిగా రూపురేఖలు మారిపోయింది. కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రజల అనారోగ్యానికి కారణమని చెప్పవచ్చు. రాయచోటి, రాజంపేట, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, ఎర్రగుంట్ల పురపాలక సంఘాలున్నా పురపాలక సంఘాల్లోని కమిషనర్లు, ఇంజనీర్లు , రెవెన్యూ అధికారులు ,శానిటేషన్ అధికారుల్లో చాలా మంది మామూళ్ల మత్తులో జోగుతుండటం వల్లే పారిశుద్ద్యం అస్తవ్యస్థంగా మారి ప్రతి ఇంటిలో ఏదో ఒక జబ్బుతో మంచానపడి వున్నారు. చివరకు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దోమలపై దాడి కార్యక్రమం పేరుతో శానిటేషన్‌పై శ్రద్దచూపారు. దీంతోనైనా నగర పాలక,పురపాలక సంఘాల అధికారులకు ఇప్పటికైనా సిగ్గొచ్చి ప్రజల నుంచి వసూళ్లు చేస్తున్న ప్రతి పైసాను ప్రజారోగ్యం కోసం ఖర్చుపెట్టి పారిశుద్ద్య కార్యక్రమాలు వేగవంతం చేసి అందర్నీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.