కడప

సీసీ రోడ్లకు రూ.1.30 కోట్ల నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలివీడు, సెప్టెంబర్ 30: ఈ మండలంలోని పలు గ్రామాల్లో సిమెంట్‌రోడ్ల నిర్మాణాలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా రూ.1.30 కోట్లు మంజూరు చేశారని మాజీ ఎమ్మెల్యే, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మదనపల్లెరోడ్డులోని బజాజ్ షోరూంను ఆయన రిబ్బన్‌కట్ చేసి ప్రారంభించారు. అనంతరం బజాజ్ షోరూం డీలర్ మాజీ ఎమ్మెల్యేను దుశ్శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ప్రధమంగా రమేష్‌రెడ్డి చేతుల మీదుగా మోటార్‌బైక్‌ను విక్రయింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరవీడు గ్రామానికి రూ.40 లక్షలు, గోరాన్‌చెరువు గ్రామానికి రూ.30 లక్షలు మిగిలిన కొన్ని గ్రామాలకు రూ.60 లక్షల మేర నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అదనంగా ఎస్‌డీ ఎఫ్ నిధులు రూ.75లక్షలు సీసీ రోడ్లకు వెచ్చించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జగన్‌మోహన్‌రాజు, టీడీపీ జిల్లా కార్యదర్శి ముస్తాక్‌హుస్సేన్, బజాజ్ షోరూం ఎండీ అబ్దుల్‌కలాం, మాజీ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి, సర్పంచులు మహమ్మద్‌రియాజ్, శ్రీనివాసరాజు, బయమ్మ, మండల టీడీపీ అధ్యక్షులు రవీంద్రబాబు, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ ఉపాధ్యక్షులు లక్షుమయ్య, నీటి సంఘం అధ్యక్షులు విశ్వనాథరెడ్డి, రెడ్డప్పరెడ్డి, మాజీ ఎంపీటీసీ రెడ్డిప్రసాదరెడ్డి, మాజీ సర్పంచ్ వీరభద్రప్పనాయుడు, టీడీపీ నాయకులు ధర్మారెడ్డి, డాక్టర్ రామచంద్రారెడ్డి, ఆగ్రోస్ సూర్యనారాయణరెడ్డి, కదిరినాయుడు, మైనార్టీ నాయకులు ఖలీల్, ఖాసీం పాల్గొన్నారు.