కడప

జగజ్జననికి విశేష పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)అక్టోబర్ 4: శరన్నవరాత్రులంటే, అమ్మవారికి సంబంధించిన తొమ్మిదిరోజులపాటు జరిగే పండుగ. అత్యంత భక్తిశ్రద్ధలతోనూ, వైభవంగానూ దేశమంతటా చేసుకునే పండుగ దసరా. పదిరోజులూ పది రకాల అలంకరణలతో దేవిని కొలుచుకుంటారు. అంతేగాకుండా, ప్రత్యేకంగా నవదుర్గలనూ పూజించి తరిస్తారు. అలాగే తొమ్మిది రోజుల పాటు తమ తమ ఇళ్ళ వద్ద ప్రతిష్ఠించిన దేవీవిగ్రహాలను, పదవరోజు పూజల తరువాత నిమజ్జనం చేస్తారు. అందరినీ తరింపజేసే ఆ తల్లి, జగజ్జననిని అందరం మనసారా పూజించుకుందాం....
శరన్నవరాత్రుల సందర్భంగా ప్రధానంగా ఎనిమిదవరోజు అష్టమినాడు దేవిని శ్రీదుర్గాదేవిగా అలంకృతను చేస్తారు. దుర్గతలను దూరం చేయడంలో అఖండురాలు కనుక దేవికి 3దుర్గ2 అని పేరు వచ్చింది. శక్తిస్వరూపిణి అయిన దుర్గాదేవి, ఈ అష్టమి రోజున, రురుడనే దనుజుని కుమారుడైన దుర్గముడిని సంహరించింది. ఈ దుర్గముడు వేదాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తపశ్శక్తితో విరించిని మెప్పించి, అది మొదలు విప్రులు స్నానసంధ్యాదులూ, పూజలూ, జపాలూ మరిచిపోయి, రాక్షసుల్లాగా సంచరించడం ప్రారంభించారు. దుర్గముడు దేవలోకం పై దండెత్తి వెళ్లి, దేవతలను తరిమి కొట్టగా, వారు తలో దిక్కుకూ పారిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు. అక్కడ జగజ్జనని అయిన శ్రీమాతను ఆరాధిస్తూ గడుపుతున్నారు. ఆమె కరుణించి వారికి దర్శనమిచ్చింది. వేదాలు తిరిగి తమ వశం చేయమన్నారు దేవతలు. వాళ్ళకు ఆహారపదార్థాలూ, శాకాలూ ప్రసాదించి, ఆ దేవి 3శాకంభరీ దేవి2 నామాన్ని గ్రహించింది. 3శతాక్షి2 పేరుతోనూ విరాజిల్లింది. ఈ ఉదంతమంతా తన చారులవల్ల తెలుసుకున్న దుర్గమదనుజుడు, విప్రదేవతాదులను విపరీతంగా హింసలకు గురిచేశాడు. వారు తమను రక్షించమని శతాక్షిని ప్రార్థించారు. చక్రప్రయోగంతో దుర్గముని శరపరంపరను వారి మీద పడకుండా ఆపింది. దేవికీ, దుర్గమునికీ జరిగిన ఆ లోక భయంకర రణం, పదిరోజులపాటు ఎడతెరిపిలేకుండా సాగింది. అప్పటికీ సేననంతటినీ పరిమార్చింది దేవి. చివరికి మిగిలిపోయినవాడు దుర్గముడొక్కడే. పదకొండవరోజున, అగ్నిజ్వాలల వంటి శరాలను సంధించి, దేవి, దుర్గముడ్ని అన్ని రకాలుగానూ బాధించింది. చివరికి దుర్గముని దేహం నుంచి ఒక తేజస్సు వెలువడి, దేవిలో లీనమైపోయింది. విజయం సాధించిన మాత కనుక, ఈమెను 3శ్రీవిజయదుర్గా2 అనీ స్తుతిస్తారు. అదిప్రకృతి అయిన ఈదుర్గాదేవి, పంచమహా స్వరూపాల్లో ప్రధమస్థానంలో వుంటుంది. ఈ దేవికి అనంతమైన శక్తి వుంటుంది. మంత్రశాస్త్రాల్లోనూ, తంత్ర గ్రంథాల్లోనూ, ఎన్నోరకాల ఆయుధాలను ధరించి, విభిన్నాలంకరణ కలిగిన దుర్గాదేవి, మనకు గోచరిస్తుంటుంది. ఈ రూపాల్లో ఏ దేవిని ధ్యానించినా, పూజించినా, అమ్మవారు మనసు ఆవశ్యం అనుగ్రహిస్తుంది. భక్తజనులను అన్ని రకాల దుర్గతుల నుంచీ కాపాడుతుంది కనుక, ఈ దుర్గాదేవిని నిత్యమూ మంత్రరూపేణా వినయవిధేయతలతో పూజిస్తే, అన్ని రకాల గ్రహాల బాధలూ, దుష్టగ్రహాల వల్ల కలిగే పీడలూ నశిస్తాయి. ఈ శరన్నవరాత్రుల సమయంలో వ్యాఘ్రవాహనిగా, త్రిశూలధారిణి అయి దర్శనమిచ్చే ఈ శక్తిస్వరూపిణిని, శ్రీదుర్గాదేవికి, ధ్యానపూజాదులు చేయడం మంచిది... అలాగే దేవీనవరాత్రుల్లో చివరిరోజు మహర్నవమి. అత్యంతప్రధానంగా అందరూ భావించే ఈ రోజును అమ్మవారిని పూజించటం వల్ల ఎన్నో పుణ్యఫలాలు కలుగుతాయి. కనీసం ఈనాడైనా దేవిని పూజిస్తే, ఆ జగజ్జనని సంతోషించి, భక్తులను అనుగ్రహిస్తుంది. ఈరోజు దేవిని శ్రీమహిషాసుర మర్థినిగా అలంకృతను చేసి, పూజలందిస్తారు. ఇది చివరిరోజు కనుక, ఈ రోజు మరింత వేడుకగా జరుపుకుంటారు. శ్రీమహాలక్ష్మీదేవి అయిన దుర్గాదేవి, ఎనిమిది హస్తాలతో, లోక కంటకుడైన మహిషాసురుణ్ని దునుమాడి, సమస్తలోకాలకూ శాంతిని చేకూర్చింది. నవమి రోజునే ఈ తల్లి, రక్కసుణ్ని వధించింది కనుక, ఈ రోజుకు మహర్నవమి అని పేరు వచ్చింది. సింహవాహనంగా ఆ ఆదిపరాశక్తి, తన అట్టహాసంతో మహిషాసురుడి సేనాధిపతులైన దానువులంటదరినీ సంహరించింది. అందుకని ఈ రోజున దేవిని సింహవాహనారూఢగా దర్శించుకుంటారు. త్రిశూల ధారిణి అయినీ ఈ మాతను, 3మహిషాసురమర్దిని2 స్తోత్రంతో పూజిస్తారు. దేవీపూజల వల్లా, శరన్నవరాత్రుల్లో చేసే ఉపవాసాల వల్లా, ఆయువూ, ఆరోగ్యమూ కలుగుతాయి. వాటితోపాటు దేవి అనుగ్రహంతో, ఐశ్వర్య సమృద్దీ కలుగుతుంది. ఈ పండుగల్లో తొమ్మిది రాత్రులలోనూ తొమ్మిది రకాలుగా దేవిని అలంకరించటంతో పాటు, తొమ్మిది రకాలుగా ఆ తల్లికి నైవేద్యాలూ సమర్పిస్తారు. కట్టుపొంగలి, పులిహోర, కొబ్బరి చిత్రాన్నం, అల్లం కలిపిన గారెలు, కేసరిబాత్, కూరలు కలిపిన అన్నం, చక్కెర పొంగలి, పాయసం, చిత్రాన్నం, లడ్డూలూ... ఇలా ఎన్నో ప్రసాదాలు నైవేధ్యంగా ఉంచుతారు.