కడప

అభివృద్ధితోనే గ్రామాలు సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, అక్టోబర్ 6: గ్రామీణ ప్రాంతాలు సస్యశ్యామలం కావాలంటే గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో జరిగితేనే సాధ్యమవుతుందని కలెక్టర్ కె.వి.సత్యనారాయణ అన్నారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం సభాభవనంలో జరిగిన డివిజన్‌స్థాయి సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఎంపిడిఓలు, కార్యదర్శులు తదితరులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కలిసి ప్రణాళిక తయారుచేసి దానిని అమలుచేసినప్పుడే గ్రామాలు ఆర్థికంగా సంపూర్ణ పారిశుద్ధ్యంతో అభివృద్ధి చెందుతాయన్నారు. జిల్లాలో 182 గ్రామాలను ఓడిఎఫ్ క్రింద ఎంపిక చేయడం జరిగిందని, రాజంపేట డివిజన్‌లో 31 గ్రామాలు ఎంపిక చేశామన్నారు. సర్పంచ్‌లు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కడప జిల్లాలో ఇప్పటికీ 30 లక్షల మంది ప్రజలున్నారని, 8 లక్షల కుటుంబాలున్నాయని, వీటిలో ఇప్పటికీ 2.5 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడం శోచనీయమన్నారు. సర్పంచ్‌లు ప్రత్యేక శ్రద్ధ చూపి 15 రోజుల్లో జరగనున్న సమావేశంలో తమ ప్రగతిని నివేదించాలన్నారు. చక్కగా పనిచేసిన సర్పంచ్, కార్యదర్శులకు సత్కారంతోపాటు వారి గ్రామానికి కావాల్సిన అన్ని పనులను అదే సమావేశంలో మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు 20వేల పక్కా గృహాలు మం జూరయ్యాయని, ఒకొక్క నియోజకవర్గానికి 1250 గృహాలు మంజూ రు చేశామన్నారు. పక్కా గృహాలు లేని నిరుపేదలు, సంబంధిత అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. గత కొన్ని రోజులుగా దోమలపై దండయాత్ర చేపట్టడం జరుగుతున్నదని, ఇటీవల కాలంలో మలేరియా జ్వరాలు విజృంభించి ఒక రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట గ్రామంలోనే 42 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ సందర్భంగా శెట్టిగుంట కార్యదర్శిని విచారించగా గ్రామం లో ఎలాంటి మలేరియా కేసులు నమోదు కాలేదన్నారు. రైల్వేకోడూరు ఎంపిడిఓ మాత్రం కేసులు నమోదైన మాట వాస్తవమేనని, వ్యాధుల నివారణకు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని సమావేశంలో కలెక్టర్‌కు వివరించారు. పారిశుద్ధ్యంపై అశ్రద్ధ వహించిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాల్సిందిగా జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశిస్తూ ఆ కార్యదర్శిని సమావేశం నుండి బయటకు వెళ్లాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రతిభ కనబరచిన గ్రామ సర్పంచ్‌లకు కలెక్టర్ సత్కరించారు. ఈ సమావేశంలో డ్వామా పిడి రమేష్, డిఆర్‌డిఎ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్ ఆర్డీఓ చెంగల్రావు, డిపిఓ సుబ్రమణ్యం, ఎపిఎంఐపి పిడి మధుసూదన్‌రెడ్డి, ఆర్‌డబ్యూఎస్ ఎస్‌ఇ సంజీవరావు, జిల్లా మలేరియా అధికారి త్యాగరాజు, డివిజన్ పంచాయతీ అధికారి రమణ, డివిజన్‌లోని ఎంపిడిఓలు, ఇఓఆర్డీలు, ఓడిఎఫ్ క్రింద ఎంపికైన సర్పంచ్‌లు, కార్యదర్శులు, డివిజన్‌లోని వ్యవసాయ, ఉద్యానవన శాఖ హౌసింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

బద్వేలులో 12 తులాల బంగారం చోరీ

బద్వేలు, అక్టోబర్ 6: పట్టణంలోని నెల్లూరురోడ్డు వెంకటయ్యనగర్‌లో నివాసముంటున్న వెంకటసుబ్బయ్య ఇంటిలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు దాదాపు 12 తులాల బంగారు నగలను దోచుకెళ్లినట్లు బాధితుడు వెంకటసుబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిందని, తాను పనికివెళ్లి సాయంత్రం వచ్చానని, తన భార్య వద్దకు వెళ్లాలని, ఎవరూలేని సమయంలో ఇంటిలో చోరీ జరిగిందన్నారు. తన కుటుంబంతోపాటు తన కుమార్తెకు సంబంధించిన బంగారు కూడా దోచుకెళ్లారని బాధితుడు తెలిపాడు. బంగారుతోపాటు కొంత నగదును కూడా అపహరణకు గురైందన్నాడు. ఫిర్యాదు మేరకు దొంగతనం జరిగిన ఇంటిని ఎస్సై నరసింహారెడ్డి పరిశీలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.