కడప

అబ్దుల్ కలాం అందరికీ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట టౌన్, అక్టోబర్ 15:ప్రతి భారతీయుని హృదయంలో మాజీ రాష్టప్రతి అబ్దుల్ కాలం చిరస్థాయిగా నిలిచిన ఆదర్శనీయ వ్యక్తియని ఎఐటిఎస్ వైస్ ఛేర్మన్ చొప్పా యల్లారెడ్డి కొనియాడారు. శనివారం కళాశాలలో అబ్దుల్ కలాం 85వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సాధారణ కుటుంబంలోపుట్టి దేశ మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగిన ఆయనను ప్రతి ఒక విద్యార్థి స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. దేశానికి శాస్తవ్రేత్తగా, రాష్టప్రతిగా ఎన్నోన్నో పురస్కారాలు సాధించారన్నారు. 2010లో యుఎన్‌ఓ అబ్దుల్ కలాం జయంతిని విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతీ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌ఎంవి నారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రైల్వేకోడూరులో...
రైల్వేకోడూరు : పట్టణంలోని విక్టరీ హైస్కూల్‌లో శనివారం మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైస్కూల్ కరస్పాండెంట్ నరసింహరెడ్డి, ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని ఉన్నత పౌరులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు.