కడప

బాధ్యతలు చేపట్టిన వైవియు విసి రామచంద్రారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 17: యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి సోమవారం విసి చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఉపకులపతి ఉదయం వైవియులోకి రాగా బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థి సంఘాలు, డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం విసికి వైవియు ముఖద్వారం వద్ద ఘనస్వాగతం పలికారు. విసి చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి విశ్వవిద్యాలయానికి సంబంధించిన రూసా ప్రణాళికకు సంబంధించి మొదటి ఫైల్‌పై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా విసి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైవియు వైస్‌చాన్సలర్‌గా తనకు సేవచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం యూనివర్సిటీ అభివృద్ధికి తనపై ఉంచిన గురుతర బాధ్యతలు తప్పక నేరవేరుస్తూ ముందుకెళ్తానని ఆయన అన్నారు. వైస్ చాన్సలర్ రామచంద్రారెడ్డి చాంబర్‌కువెళ్లి పాలక మండలి సభ్యులు ఆచార్య ఏజి దాము, పెంచలయ్య, గోవర్దన్‌రెడ్డి, రామచంద్రయ్య, విజయజ్యోతి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితోపాటు వైవియుకు చెందిన రిజిస్టార్ ఆచార్య వై.నజీర్ అహ్మద్, ప్రిన్సిపాల్ ఆచార్య సత్యనారాయణరెడ్డి, సీనియర్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నాన్‌టీచింగ్ సిబ్బంది, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆయన్ను ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 11 గంటల నుంచి 12 గంటల వరకు వైవియులోని సివి రామన్ బ్లాక్‌లో అధ్యాపకులు ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్‌చాన్సలర్ ఏ.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం 12 గంటల నుంచి 1 గంట వరకు నాన్‌టీచింగ్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.