కడప

పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 21: పోలీసు అమరవీరులు దేశం కోసం, దేశభద్రత కోసం వేలాది మంది అశువులు బాసారని వారి సేవలు మరువరానివని వారిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని దేశం కోసం పాటుపడాలని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానికపోలీసు పేరేడ్ మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ అధ్యక్షత వహించారు. అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యనారాయణ ప్రసంగిస్తూ అమరులైన పోలీసు అధికారులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని, వారందరూ ప్రజల గుండెల్లో నిలచిపోతారన్నారు. దేశ వ్యాప్తంగా పోలీసులు తన విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు సైతం అర్పించారని, వారికి ప్రగాఢ సానుభూతిని తెలిజేస్తున్నానన్నారు. ఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ సమాజ సేవలో పోలీసులు ప్రాణాలను అర్పించారని వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. నక్సలైట్లు, అసాంఘిక శక్తుల చేతుల్లో బలైన పోలీసు అధికారులు, సిబ్బందిని స్మరించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఏడాది కాలంలో 14 మంది అమరులయ్యారని, అదే విధంగా దేశవ్యాప్తంగా 473 మంది పోలీసులు ప్రాణాలు అర్పించారన్నారు. ప్రజలకోసం నిరంతరం పోలీసులు పనిచేస్తూ విధి నిర్వహణలో ఎంతో మంది అశువులు బాసారన్నారు. వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఎస్పీ ఆకాంక్షించారు. అనంతరం మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ నగదు అందజేశారు. అలాగే పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ సత్యనారాయణ బహుమతులు ప్రదానం చేశారు. అలాగే అడిషనల్ ఎస్పీ పివిజి విజయ్‌కుమార్, ఏఆర్ డిఎస్పీ మురళీధర్, ఎస్టీ డిఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డిఎస్పీ శ్రీనివాసులు, సిసిఎస్ డిఎస్పీ నాగేశ్వరరెడ్డి, ఎస్సీ,ఎస్టీ డిఎస్పీలు షౌకత్ అలీ, సుధాకర్, ఎస్టీ సిఐ సత్యనారాయణ, నగర కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి, జిల్లా అగ్నిమాపకాధికారి విజయ్‌కుమార్, సిఐలు వెంకటశివారెడ్డి, రమేష్, సదాశివయ్య, రామకృష్ణతోపాటు పోలీసు సిబ్బంది అమరవీరుల స్ధూపం వద్ద పుష్పగుచ్చాలు వుంచి శ్రద్ధాంజలి ఘటించారు.