కడప

అదుపుతప్పిన ‘ఆధార్’ అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 21: వౌలిక సదుపాయాలు తరహాలో ప్రతి ఒక్కరికీ వినియోగమైన ఆధార్ కార్డుల అనుసంధానం అదుపుతప్పింది. జిల్లాలో దాదాపు 29 లక్షల జనాభా ఉండగా ఆధార్‌కార్డుల పంపిణీ 30లక్షలకు చేరుకుంది. వౌలిక సదుపాయాల్లో భాగంగా వంటగ్యాస్, మరుగుదొడ్ల మంజూరు, స్కాలర్‌షిప్‌ల మంజూరు, రుణాల మంజూరు మొదలుకుని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలచే పంపిణీచేసే ప్రతి సంక్షేమ పథకాల అమలుకు ఆధార్‌కార్డు అనుసంధానం తప్పనిసరి. అయితే సంబంధిత ఆధార్ కార్డు విషయంలో వారి వివరాలు ఎంతో గోప్యంగా ఉంచాల్సివుంటుంది. ప్రస్తుతం ఆధార్‌కార్డు దారుడి ప్రమేయం లేకుండానే ఆధార్ డౌన్‌లోడ్ చేసేందుకు లాగిన్ పాస్వార్డ్‌లు, ఎన్‌రోల్‌మెంట్ నెంబర్లతో డౌన్‌లోడ్ చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. కార్డుల్లో లేని ఫోటోలను మార్చాలని సంబంధిత ప్రైవేట్ వ్యక్తులకు చేతులు తడిపితే జనాలకు కార్డులు లభించడంతోపాటు ఫొటోలను తారుమారు చేయడం తదితర మోసాలకు ప్రైవేట్ వ్యక్తులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రవాణాశాఖలో వాహనాయ యజమానుల హక్కులు మార్పులకు, పల్స్‌పోల్ సర్వేకు, యునిక్ ఐడి తదితరాలకు ఉపయోగించే ఆధార్ అనుసంధానం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో ఒక్కొక్కరు తమకు కావాల్సిన రీతిలో రెండేసి కార్డులను కూడా ప్రైవేట్ వ్యక్తుల సహాయంతో పొందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓటరుకార్డులు, రేషన్‌కార్డులు, భూమి రికార్డులు , వాహనాల రిజిస్ట్రేషన్లు, వివిధ రకాల లైసెన్సులు పొందేందుకు ఇప్పటికే ఆధార్‌కార్డులు ఆన్‌లైన్ అయి ఉంటాయి. ప్రైవేట్ ఏజెన్సీలు ఆధార్‌కార్డుల్లో తప్పుడు సమాచారం నిమిత్తం ఆశ్రయించే వ్యక్తులకు టైట్ లాగిన్ చేసి ప్రైవేట్ వ్యక్తుల్లో ఉన్న లాగిన్‌తో వివరాలు మార్పులు , చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. నూతనంగా ఆధార్‌కార్డులు పొందేందుకు ఇప్పటికే ఆధార్‌కార్డులు పొంది తప్పుడు తడకలు ఉన్నవారు వాటిని మార్పులు చేర్పులు చేసుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఆ వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో జనాభాను మించి ఆధార్‌కార్డులు పొందడం, ముఖ్యంగా కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లా నుంచి వెళ్లి స్థిరపడిన వారు సైతం సంబంధిత ప్రాంతాల్లో ఆధార్ పొంది జిల్లాలో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి ఆధార్‌కార్డులు పొందుతున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇచ్చే రాయితీలు పొందేందుకు ధనిక వర్గానికి చెంది అన్ని విధాల సంపూర్ణంగా ఉన్నవారు కూడా ఆధార్‌కార్డులు తయారుచేసుకుని పేదవారిగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను పొందేందుకు ఆధార్‌కార్డును ప్రైవేట్ వ్యక్తుల నుంచి సృష్టించుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థలను మోసం చేసేందుకు కూడా జిల్లాలో కాపురం లేని వారు సైతం ఆధార్‌కార్డులు సృష్టించుకుని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆధార్‌కార్డులు జారీ, తప్పుడు తడకలు సవరించే ప్రైవేట్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుని అర్హులైన వారికే ఆధార్‌కార్డు లభించే విధంగా సంబంధిత జిల్లా అధికారులు దృష్టిసాంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.