కడప

జిల్లాలో పార్టీ బలోపేతంపై తెలుగు తమ్ముళ్ల దృష్టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, అక్టోబర్ 24 : తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం 2019 ఎన్నికల నాటికి జిల్లాలో అన్ని పార్లమెంట్, ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకునే విధంగా అధిష్టానం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయిలో సమావేశాలు ఏర్పాటుకు సోమవారం అధిష్టానం శ్రీకారం చుట్టింది. ఈ నేపధ్యంలో జిల్లాస్థాయిలో జరిగే సమన్వయ కమిటీకి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్టప్రరిశీలకులు తరలిరానున్నారు. జిల్లాలో రైల్వేకోడూరు మినహా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుతమ్ముళ్లలో కుమ్ములాటలు మొదలై ఆధిపత్యపోరు మధ్య కార్యకర్తలు నలిగిపోతూ పార్టీ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. రాష్టవ్రిభజన అనంతరం కాంగ్రెస్‌పార్టీ కనుమరుగుకావడం, వైసిపిలో కొంతమేరకు అసంతృప్తి, టిడిపిలో ఆశించిన మేరకు జిల్లాలో కేడర్ లేకపోవడంతో తెలుగుదేశంపార్టీలోకి భారీ ఎత్తున వలసనేతలు రాకతో పార్టీ స్థాపితం నుంచి పార్టీని నమ్ముకుని అన్ని ఒడుదుడుకులు ఎదుర్కొన్న అసలైన సిసలైన నేతలకు అన్యాయం జరగడంతో వారు ఏమీ దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ నలుగుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పార్టీ టికెట్ దక్కించుకున్నవారిలో కూడా అధికసంఖ్యలోనే వలస నేతలు ఉన్నారు. గతంలోనూ ప్రస్తుతం పార్టీని నమ్ముకుని ఉన్న వారు ప్రత్యర్థుల మద్య గత పదేళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొని సర్వం కోల్పోయి ఉన్నారు. కేవలం వైసిపి అధినేత ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుండకూడదని పార్టీ హైకమాండ్ వివిధ పార్టీల నేతలను పార్టీలోకి తీసుకుంది. అయితే పార్టీనినమ్ముకుని ఉన్న నేతలు, మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 10 ఏళ్లుగా ప్రత్యర్థులతో సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇరువర్గాల్లో ఆధిపత్యం కొనసాగుతుండటంతో పార్టీ బలోపేతం అయిందని అధిష్టానం అయ్యిందని యోచిస్తున్నా అది బలుపేగానీ పార్టీ బలం కాదనేది జగమెరిగిన సత్యం. ప్రభుత్వ చౌకదుకాణాలు, వివిధ కాంట్రాక్టు పనులు, చివరకు నీరు-చెట్టు పనులు అసలైన టిడిపి నేతలకు, కార్యకర్తలకు దక్కకుండా వలస నేతలకే దక్కుతుండటంతో టిడిపి కేడర్ జీర్ణించుకోలేక పోతోంది. వచ్చేనెల 1 నుంచి జనచైతన్యయాత్రలు ప్రారంభం కావడంతో ఒకవర్గం నేతలు మాత్రమే యాత్రల్లో పాల్గొని, మరో వర్గం ఆ కార్యక్రమాలకు దూరంగా ఉండేందుకు ఉంది. పార్టీ సభ్యత్వ కార్యక్రమాల నమోదులో కూడా అసమ్మతి వర్గం అంటీ అంటనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరగనున్న సమావేశాల్లో పార్టీ అధిష్టానం దృష్టికి తమ అభిప్రాయాలు తీసుకువెళ్లేందుకు సమీక్ష సమావేశాల్లో జిల్లా, నియోజకవర్గ స్థాయిలో గళం విప్పి తాము ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు సర్వం సిద్దంచేసుకుంటున్నారు. కుల సామాజికవర్గాలో రాజకీయం పనిచేస్తుండటంతో అధికారపార్టీ నేతలు పార్టీని నమ్ముకున్న నేతలు వలస నేతల మధ్య తాడోపేడో తేల్చుకునేందుకు సర్వం సిద్దం చేసుకుని సమీక్షా సమావేశాలకు హాజరుకానున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌బాబు జిల్లాలో పలుమార్లు పర్యటించి ఆధిపత్యపోరు, అసమ్మతి వాదులను హెచ్చరించినా తీరు మారలేదు. ప్రస్తుతం సమీక్ష సమావేశాల్లో తమకు జరిగిన అన్యాయాలను నేతలు, కార్యకర్తలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సర్వం సిద్దం చేసుకుంటున్నారు.
వైవియూ అంతర్ కళాశాలల క్రీడా పోటీల్లో
కమలాపురం విద్యార్థుల ప్రతిభ
* వాలీబాల్, ఖోఖో, టేబుల్‌టెన్నిస్‌లో విన్నర్స్
కమలాపురం, అక్టోబర్ 24: కమలాపురం సియస్‌యస్సార్ డిగ్రీ కళాశాలలో మూడురోజులుగా జరిగిన వైవియూ అంతర్ కళాశాలల క్రీడా పోటీల్లో వాలీబాల్, ఖోఖో, టేబుల్‌టెన్నిస్ విన్నర్స్‌గా స్థానిక డిగ్రీ కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేసారు. అంతేకాక చెస్, శరీర సౌష్టవాల్లో పతకాలను కైవశం చేసుకున్నారు. టేబుల్‌టెన్నిస్ బాలికల విభాగంలో సింగిల్స్‌లో కడప ఎస్‌కేఆర్ కాలేజి విన్నర్స్‌గా, రన్నర్స్‌గా స్థానిక సియస్‌యస్సార్ కళాశాల, డబుల్స్‌లో విన్నర్స్‌గా ఆ కాలేజి నిలిచింది. ఖోఖోలో బాలికల విభాగంలో విన్నర్స్‌గా ప్రొద్దుటూరు ఆర్‌సిపిఈ, రన్నర్స్‌గా వైవియూ, వాలీబాల్‌లో బాలికల విభాగంలో విన్నర్స్‌గా ఆర్‌సిపిఈ, రన్నర్స్‌గా కడప జియోన్ కాలేజి, చెస్‌లో బాలికల విభాగంలో మొదటి బహుమతి కృష్ణతేజ, రెండవ బహుమతి జ్యోత్స్న, మూడవ బహుమతి శే్వత గెలుచుకున్నారు. టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో, డబుల్స్‌లో బద్వేల్ యస్‌బివిఆర్ డిగ్రీ కళాశాల, రన్నర్స్‌గా సింగిల్స్‌లో కోడూరు ప్రభుత్వ కళాశాల, రన్నర్స్‌లో యోగివేమనా, ఖోఖోలో బాలురలో విన్నర్స్‌గా స్థానిక కళాశాల రన్నర్స్‌గా ఆర్‌సిపిఈ ప్రొద్దుటూరు, వాలీబాల్‌లో విన్నర్స్‌గా స్థానిక కళాశాల, రన్నర్స్‌గా ప్రొద్దుటూరు ఆర్‌సిపిఈ, చెస్‌లో బాలురలో మొదటి బహుమతి నాగదస్తగిరిరెడ్డి, రెండవ బహుమతి దాదాపీర్, మూడవ బహుమతి మహమ్మద్ జానీ, శరీర సౌష్టవాల్లో 75కేజిల విభాగంలో మొదటి బహుమతి మధుసూదనరెడ్డి, రెండవ బహుమతి బాలాజినాయక్, మూడవ బహుమతి యన్ రోహిత్‌తోపాటు వివిధ విభాగాల్లో మరో 15మంది గెలుపొందారు. వీరందరికి వైవియూ వైస్ చాన్స్‌లర్ రామచంద్రారెడ్డి పతకాలను, సర్ట్ఫికెట్లను పంపిణీ చేసారు. అలాగే జాతీయ స్థాయిలోవెయిట్ లిఫ్ట్‌ంగ్‌లో బంగారు పతకాన్ని పొందిన నారాయణరావు అనే విద్యార్థిని వైస్ చాన్సలర్ దుశ్శాలువకప్పి పతకం, ప్రశంసాపత్రాలు నగదు ప్రోత్సాహకాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలేజి కరస్పాండెంట్ రాజగోపాలరెడ్డి, యూనివర్సిటీ క్రీడా అధికారులు పాల్గొన్నారు.

రబీలోనైనా ప్రకృతి కరుణించేనా..
రాజంపేట, అక్టోబర్ 24: రాజంపేట డివిజన్‌లో ఆయకట్టు మొత్తం ప్రకృతి కరుణపై ఆధారపడి ఉంది. ప్రకృతి కరుణిస్తే కాని ఇక్కడి ఆయకట్టు పంటపొలాలతో కళకళలాడే పరిస్థితి లేదు. బావులు, బోర్ల క్రింద మాత్రమే రబీ పంట పండించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ నెల పూర్తి కావస్తోంది. ఆయకట్టు రైతులు అనుకున్నరీతిలో వర్షాలు లేవు. రబీకి అదును మొదలైంది. దీంతో ఈ ఏడాది రబీలో ప్రకృతి కరుణిస్తుందా లేదా అన్న ఆందోళనతో ఆయకట్టు రైతులు ఆకాశంవైపు వర్షం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. గత ఎడాది రబీలో మంచి వర్షాలు పడి ఇక్కడి చెరువులు, వంకలు, వాగులు పూర్తిస్థాయిలో నిండాయి. ఆ తరువాత ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు లేక ఆయకట్టు మొత్తం బీడుగానే ఉండిపోక తప్పలేదు. గత రెండు మూడు నెలల నుండి అడపా తడపా మొత్తం చిరుజల్లులకే పరిమితమైంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడతాయన్న గంపెడాశను మాత్రం ఆయకట్టు రైతులు వీడలేదు. పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన రాజంపేట డివిజన్‌లో ప్రస్తుతం రైతాంగానికి ప్రకృతి సమస్యే అధికంగా ఉంది. ఇక్కడ పూర్తిగా వర్షాధారంపైనే అత్యధికశాతం రైతులు ఆధారపడి ఉన్నారు. ఇక్కడి భూగర్భజలవనరులను రైతుల దరికి చేర్చే పథకాలను ఇక్కడి పాలకులు దశాబ్దాలుగా పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితిని రైతులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ప్రతిఏడు పెనుగాలులు, గిట్టుబాటుధరలు లేకపోవడం, సరైన మార్కెటింగ్ వసతులు కరవవ్వడం, పండ్ల నాణ్యత తగ్గడం, తెగుళ్లు ఇత్యాది కారణాలతో పండ్ల తోటల రైతాంగం కూడా నష్టపోతూ వస్తున్నారు. డివిజన్‌లో గుంజన, చెయ్యేరు, పెన్నా, పుల్లంగేరు తదితర నదులున్నాయి. ఈ నదుల్లో భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నట్టు నిపుణులు చెపుతున్నారు. వర్షాలతో పనిలేకుండా ఇక్కడి ఆయకట్టుదారులను ఆదుకునేందుకు ఈ నదుల్లోని భూగర్భజలాలను వెలికితీసే పథకాలు అమలుచేయడంలో నిర్లక్ష్యం ఇక్కడి రైతుల శాపంగా మారుతుంది. ఒక చెయ్యేరులోనే 50కి పైగా టిఎంసిల భూగర్భజలాలున్నట్టు నిపుణులు అంచనా వేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే కనీసం బావులు, బోర్లక్రింద రైతాంగాన్నిఅయినా ఆదుకోవాల్సి ఉంది. వారికి అవసరమైన వరి విత్తనాలు సబ్సిడీలో అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ప్రస్తుతం కరంటు సమస్యను ప్రక్కన పెడితే ప్రకృతి సమస్య ముఖ్యంగా ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది. ఏ మాత్రం మబ్బులు పట్టినా ఆయకట్టు రైతుల్లో ఆనందం కనిపిస్తుంది. అయితే భారీ వర్షాలు పడితే తప్ప వీరి కష్టాలకు పరిష్కారం లభించదు. ఈ డివిజన్‌లో వరిసాగు ప్రస్తుతం రైతులు బావులు, బోర్లకింద పండిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రకృతి కరుణిస్తే ఆయకట్టురైతులు కూడా వరిపంట సాగుకు సమాయత్తమవుతారు. ప్రస్తుతం వేల ఎకరాలు సరైన వర్షాలు లేక బీడుగా ఉంది. ఆయకట్టు రైతులపట్ల ఏ మాత్రం ప్రకృతి వికటించినా రైతుల బతుకు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది.
క్రీడలకు మరింత ప్రోత్సాహం
కమలాపురం, అక్టోబర్ 24: యోగివేమనా యూనివర్సిటీ పరిధిలో మరింతగా క్రీడలను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటామని యూనివర్సిటీ వైయస్ చాన్సలర్ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం రాత్రి సియస్ యస్సార్ డిగ్రీ కళాశాలలో 3రోజులుగా జరుగుతున్న యూనివర్సిటీ డిగ్రీ అంతర్ కళాశాలల క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వాలీబాల్ ఫైనల్ మ్యాచ్‌లకు చెందిన క్రీడాకారులను పరిచయం చేసుకుని స్వయంగా ఆటను తిలకించారు. అలాగే స్థానిక కళాశాలలో లైబ్రరీ భవనాన్ని ప్రారంభించారు. క్యాంటిన్ భవనాలకు శంకుస్థాపన చేసారు. అనంతరం జరిగిన క్రీడాసభలో క్రీడాకారులను ఉద్ధేశించి మాట్లాడుతూ యూనివర్సిటీలో క్రీడల్లో పాల్గొనే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలను పెద్ద ఎత్తున అందచేసేందుకు తగు నిర్ణయాలను తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా స్థానిక కళాశాలకు చెందిన విద్యార్థి నారాయణరావ్ జాతీయస్థాయిలో వెయిట్‌లిప్ట్‌ంగ్‌లో బంగారు పతకాన్ని సాధించడంతో ఆ విద్యార్థిని ప్రపంచ యూనివర్సిటీక్రీడా పోటీలకు పంపించేందుకు అవసరమైన రవాణా చార్జీలను ప్రోత్సాహకాలను అందచేస్తున్నామన్నారు. ఎంతోమంది విద్యార్థులు చదువుల్లో రాణించగలరని ఐతే అందరూ క్రీడల్లో రాణించలేరన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొని తమ కుటుంబాలకు, కళాశాలలకు పేరు తీసుకురావాలన్నారు. స్థానిక కాలేజిలో వరుసగా 4 ఏళ్లుగా చక్కటి వాతావరణంలో ఎంతో వ్యవప్రయాసలకు లోనై అంతర్ కళాశాలల పోటీలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇతర కళాశాలలకు భిన్నంగా ఇక్కడ విద్యార్థులు శరీర సౌష్టవాలు, బాక్సింగ్‌లో పాల్గొనేందుకు జిమ్‌ను అధునాతరంగా ఏర్పాటు చేయడం స్వాగతించ విషయమన్నారు.త్వరలోనే యూనివర్సిటీలో అన్ని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేసి క్రీడల ప్రోత్సాహం కోసం సలహాలు, సూచనలు తీసుకుని క్రీడా అభివృద్ధికోసం తగిన నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం వైవియూ క్రీడాబోర్డు కార్యదర్శి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో క్రీడా అభివృద్దికి పక్కా ప్రణాళికను సిద్దం చేసి మరింతగా నిధులు మంజూరు చేయించి క్రీడలను ప్రొత్సిహిస్తామన్నారు. మొదటి దశ పోటీలు ముగిసాయని, రెండోదశ పోటీలు వీయన్ పల్లె డిగ్రీ కాలేజిలో 3వ దశ పోటీలు ప్రొద్దుటూరు ఆర్‌సిపిఈ కాలేజిలో 4వ దశపోటీలు వైవియూలో నిర్వహిస్తామన్నారు. కాలేజి కరస్పాండెంట్ రాజగోపాలరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 65కు పైగా ప్రవేటు కళాశాలలుండగా కేవలం ప్రభుత్వ కళాశాలలతో కలసి 22కాలేజిలు మాత్రమే క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయంపై వైస్ చాన్స్‌లర్ దృష్టి సారించి ప్రవేటు కళాశాలలకు క్రీడలు ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ వర్సిటీ ప్రొఫెసర్ యల్ కుళ్లాయిరెడ్డి, వైవియూ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ చాంద్ బాష, ప్రిన్సిపాల్స్ అంకిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, కృష్ణమోహన్, పిఆర్వో ప్రభుదాస్ పాల్గొన్నారు. అనంతరం కాలేజి కరస్పాండెంట్ రాజగోపాల రెడ్డి, ఎస్వీవర్సిటీ ప్రొఫెసర్ కుళ్లాయి రెడ్డితమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం యూనివర్సిటీలో క్రీడల రోలింగ్ షీల్డ్‌ల ఏర్పాటుకు గాను వరుసగా 1.5కేజి, 1.00 కేజి వెండి దిమ్మెలు వైస్ చాన్సలర్‌కు అందచేసారు. తదనంతరం వైస్ చాన్సలర్‌ను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్స్,్ఫఫెసర్లు దుశ్శాలువలు కప్పి మెమెంటోలతో ఉచిరీతిన సత్కరించారు.

జగన్ అధికారంలోకి వస్తే అభివృద్ధి
* ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు, అక్టోబర్ 24: వైకాపా అధ్యక్షుడు వై ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. సోమవారం గడపగడపకూ వైకాపా కార్యక్రమంలో భాగంగా రూరల్ పరిదిలోని సోములవారిపల్లె గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం చంద్రబాబునాయుడు అభివృధ్దినంతా రాజధానికే పరిమితం చేస్తున్నాడని, రాయలసీమను కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఇలాగైతే రాయలసీమ ఎడారిగా మారకతప్పదని, తాగేందుకు నీరు లేక ప్రజలు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే వైకాపా అధికారం చేపడితే రైతులకు, ప్రజలకు సాగు, తాగునీటిని అందించుటలో ప్రత్యేక చొరవ చూపుతారని, నిరుద్యోగ యువతను ఆదుకొనేలా ప్రతి ఒక్కరికీ ఉపాధి చూపుతాడని, పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తారన్నారు. ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రజలు నిశితంగా గమనించాలని, చంద్రబాబుకు రాబోవు ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైకాపా పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మురళీధర్‌రెడ్డి, ఖాజా, పెంచిలయ్య, దేవీప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే
ప్రభుత్వ లక్ష్యం
వీరబల్లి, అక్టోబర్ 24: మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాజంపేట ఎమ్మెల్యే, విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని గుర్రప్పగారిపల్లె, సానిపాయి, తాటికుంటపల్లె తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అదే విధంగా గత 60 సంవత్సరాల నుండి సిమెంట్‌రోడ్లకు నోచుకోని ప్రాంతాలలో సైతం సిమెంట్‌రోడ్లు మంజూరు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. సానిపాయి గ్రామ పంచాయతీలోని లగిశెట్టివారిపల్లె తదితర ప్రాంతాల్లో గత ప్రభుత్వాలు ఇంత వరకు రోడ్లు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలు చైతన్యవంతులై ప్రజాప్రతినిధులను నిలదీసి తమ ప్రాంతాలకు సిమెంట్‌రోడ్లు, తాగునీటి వసతి తదితర సౌకర్యాలు కల్పించుకోవాలన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి తమ తమ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేయించుకోవాలన్నారు. తాటికుంటపల్లె గ్రామ పంచాయతీలో తాటికుంటపల్లె, షికారుపాలెం, శీతంపేట కొత్తపల్లె తదితర ప్రాంతాల్లో సిమెంట్‌రోడ్లు ప్రారంభించారు. నియోజకవర్గపరంగా రూ.38 కోట్లు నిధులు నీరు-చెట్టు పథకానికి ఖర్చు చేసిన ఘనత తమదేనన్నారు. అదే విధంగా వివిధ అభివృద్ధి పనులకు రూ.30 కోట్లు నిధులు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో ప్రజాప్రతినిదులు గ్రామాల అభివృద్ధి మరిచి తమ సొంత లాభాల కోసమే పాటుపడ్డారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి తమ సమస్యల పరిష్కారానికి ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, శ్రీ్ధర్‌రెడ్డి, యువనాయకులు వీరనాగిరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు రామక్రిష్ణమరాజు, ఎంపీపీ స్వప్న, ఎంపీడీవో జనార్ధన్‌రెడ్డి, తహసిల్దార్ నారాయణరెడ్డి, అన్ని శాఖల అధికారులు, గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పందుల బెడద నివారించాలని ఎస్‌ఐకి ఫిర్యాదు
చెన్నూరు, అక్టోబర్ 24: మండల పరిధిలోని శాటిలైట్ సిటీ, రుద్రభారతిపేటలో నివాస గృహాల మధ్య పందులు సంచరించడం ఎక్కువైందని వీటి బెడద నుంచి తమను రక్షించాలని కోరుతూ సోమవారం శాటిలైట్‌సిటీ, రుద్రభారతి పేటకు చెందిన ప్రజలు స్థానిక ఎస్‌ఐ వినోద్‌కుమార్‌కు ఫిర్యాదుచేశారు. అలాగే కడప కార్పొరేషన్‌లో కమిషనర్‌కు పందుల బెడదను నివారించాలని ఫిర్యాదుచేశారు. గత కొద్దికాలంగా శాటిలైట్ సిటీలో నిర్మించిన గృహాలుఖాళీగా ఉండటంతో అక్కడ అనేక మంది పందుల పెంపకం చేపట్టారని వాటి వల్ల నివాస గృహాల్లోని వస్తున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకుని పందుల బెడద నివారించాలని కోరారు.
26న టిడిపి జిల్లా విస్తృతస్థాయి సమావేశం
కడప(కలెక్టరేట్), అక్టోబర్ 24: తెలుగుదేశంపార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఈనెల 26న కడప నగరంలోని మేడా కన్వర్షన్ హాల్‌లో ఉదయం 9.30గంటలకు నిర్వహిస్తున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈసమావేశానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరౌతారన్నారు. సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
నేడు మంత్రి రావెల రాక
కడప(కల్చరల్), అక్టోబర్ 24: రాష్టస్రాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు 25న జిల్లాకు వస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఈశ్వరయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి 25న ఉదయం 7గంటలకు అనంతపురం నుండి రోడ్డుమార్గాన బయలుదేరి ఉదయం 9.30గంటలకు కడపలోని ప్రభుత్వ అతిథిగృహం చేరుకుని అధికారులతో సమావేశవౌతారు. అనంతరం 9.50గంటలకు స్టేట్ గెస్టుహౌస్ నుంచి బయలుదేరి ఉదయం 10గంటలకు స్థానిక మద్రాసు రోడ్డులోని మున్సిపల్ స్టేడియం చేరుకుని చంద్రన్న దళితబాట కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. మద్యాహ్నం 12.30గంటలకు భోజనం అనంతరం మద్యాహ్నం 1గంటకు రోడ్డుమార్గాన బయలుదేరి తిరుపతి వెళ్తారని డిఆర్వో తెలియజేశారు.
నేడు వేణుస్కిల్ అకాడమిలో ప్రాంగణ ఎంపికలు
కడప(రూరల్), అక్టోబర్ 24: కడప నగరం పాతబస్టాండు సమీపంలోని వేణుస్కిల్ అకాడమిలో 25వ తేది మంగళవారం ఉదయం 10గంటలకు డిగ్రీ, పిజిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికల్లో భాగంగా లాట్ మొబైల్ సంస్థలో వివిధ ఉద్యోగాలకు ఎంపికచేస్తారన్నారు. ఆసక్తిగల నగరంలోని ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు తమ ఆధార్, రేషన్, సంబంధిత పత్రాలు తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు.
ముస్లిం పర్సనల్ లాకు
ఆల్ ఇండియా ఇమామ్‌ల కౌన్సిల్ మద్దతు
కడప,(కల్చరల్)అక్టోబర్ 24: ఆల్ ఇండియా ఇమామ్‌ల కౌన్సిల్ ముస్లిం పర్సనల్ లాకు సంపూర్ణ మద్దతు ఉంటుందని కౌన్సిల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వౌలానా జాకీర్ హుస్సేన్, వౌలానా ఇద్రీస్‌లు తెలిపారు. స్థానిక మదీన ఇంజనీరింగ్ కాలేజి ఆవరణంలోని మసీదులో సోమవారం ఆల్ ఇండియా ఇమామ్‌ల కౌన్సిల్ బేసిక్ లీడర్‌షిప్ కోర్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక మతగురువు ప్రజలకు ఎలా సమాచారాన్ని వివరించాలి, ప్రజలతో ఎలా ప్రవర్తించాలి, ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి తదితర విషయాలపై తెలియజేశారు. ఇంకా ఈకార్యక్రమంలో కౌన్సిల్ రాష్ట్ర డివిజన్, యూనిట్ ప్రెసిడెంట్, కార్యదర్శి , మతగురువులు, ముఫ్తిహనీఫ్ అహ్మద్ ఖాస్మి, వౌలానా షాహుల్ హమీద్‌సాహెబ్, వౌలానా యూనుస్ సాహెబ్, ముఫ్తి అబ్బుస్సుబహానీ, ఖాజా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
వేంపల్లె, అక్టోబర్ 24: మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పీయూసీ-1 విద్యాభ్యాసం చేస్తున్న సుమియా అనే విద్యార్థిని సోమవారం వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతపురం జిల్లాలోని ఎన్‌పీ కుంట గ్రామానికి చెందిన సుమియాకు ఇటీవలే ట్రిపుల్ ఐటీ సీటు రావడం జరిగింది. అయితే ఆ విద్యార్థినికి ట్రిపుల్ ఐటీలో విద్యాభ్యాసం చేయడం ఇష్టం లేదని తల్లిదండ్రులు మహబూబాషా, జైబున్నీసాలకు పలుమార్లు విన్నవించుకున్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ట్రిపుల్ ఐటీలో ఆరు సంవత్సరాల పాటు విద్యాభ్యాసంచేసి ఇంజనీరింగ్ పట్ట్భద్రురాలు అవుతుందని నచ్చజెప్పడం జరిగింది. కానీ ఆ విద్యార్థిని మనస్థాపం చెంది తల్లిదండ్రులకు సెల్‌ఫోన్ ద్వారా తాను వాస్మోల్ సేవించి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మెసేజ్ పెట్టడం జరిగింది. తల్లిదండ్రులకు ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ సంఘటన ఆ విద్యార్థిని పాల్పడినట్లు తెలుస్తోంది. వాస్మోల్ తాగిన విద్యార్థినిని ట్రిపుల్ ఐటీ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమచికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు.
బెల్టుషాపుల నిర్వాహకుల అరెస్టు
సిద్దవటం, అక్టోబర్ 24: మండలంలోని మాధవరం -1,2,3వ వార్డులకు చెందిన జె.కృష్ణయ్య అనే బెల్టుషాపునిర్వాహకుడిని అరెస్టుచేసినట్లు ఏఎస్‌ఐ చెన్నయ్య తెలిపారు. మాధవరం 1,2,3 వార్డుల గ్రామపంచాయతి గంగమ్మ ఆలయం వద్ద కృష్ణయ్య మద్యం అమ్మేందుకు 30బాటిళ్లు ఉంచుకుని ఉన్నారన్నారు. పోలీసులువస్తుండగా చూసి భయపడి పారిపోయేందుకు ప్రయత్నించగా అతన్ని పట్టుకుని అరెస్టుచేసి అతని వద్ద వున్న 30 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈమేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
బైక్‌ల దొంగ అరెస్టు
* రూ.2.8 లక్షల విలువచేసే 7 బైక్‌లు స్వాధీనం
కడప,(క్రైమ్)అక్టోబర్ 24: పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెకు చెందిన వల్లెపు రమేష్‌ను అరెస్టుచేసి అతని వద్ద నుంచి 7 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సిసిఎస్ డిఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం సిసిఎస్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం బిల్టప్ వద్ద సాధారణ తనిఖీల్లో భాగంగా పులివెందుల వైపు నుంచి వల్లెపు రమేష్ , తండ్రి రాములు అనే వ్యక్తి పులివెందుల వైపు నుంచి వస్తుండగా అతని ద్విచక్రవాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా వాహనానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేనందున విచారించగా ఆ వాహనాన్ని మండీ బజార్‌లో దొంగతనం చేసినట్లు తెలిపారు. దీంతో రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఇంకా ఆరు బైక్‌లను దొంగిలించి తమ గ్రామసమీపంలో దాచి వుంచినట్లు తెలిపారు. దీంతోపోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ వాహనాలు కడప వన్‌టౌన్ పరిధిలో రెండు, టుటౌన్ పరిధిలో ఒకటి, చిన్నచౌకు, రిమ్స్ ,ప్రొద్దుటూరు వన్‌టౌన్, అనంతపురం వన్‌టౌన్ పరిధిలో ఒక్కొక్క వాహనం దొంగిలించినట్లుగా తెలిపారు. ఈ కేసులో సిసిఎస్ ఎస్‌ఐ ఈశ్వరరెడ్డి, వన్‌టౌన్ ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి, విశ్వనాధరెడ్డి , సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి బైక్‌లను రికవరీ చేసినట్లు డిఎస్పీ తెలిపారు.
మాలమహానాడు కార్యవర్గం ఎన్నిక
రాజుపాళెం, అక్టోబర్ 24: పివి.రావు మాలమహానాడు మండల కార్యవర్గాన్ని ఎంపికచేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సాత్వి లక్షుమయ్య తెలిపారు. సోమవారం మండలంలోని అర్కటవేముల గ్రామంలో మాలమహానాడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో నియోజకవర్గ ఉపాధ్యక్షుడుగా దొరసానెపల్లె పాల్, మండల కార్యదర్శులుగా రామోజీచిరాస్, సామ్యేలు, బాల వెంకటయ్య, కృపావనం, మండల ప్రధాన కార్యదర్శిగా కుమ్మెర లింగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు నాగరాజు, నియోజకవర్గ అధ్యక్షుడు సాల్మో న్, మండలాధ్యక్షుడు ఓబులేసు, ఉపాధ్యక్షుడు దానమయ్య పాల్గొన్నారు.

దైవదర్శనానికి వెళ్లి
కానరాని లోకానికి ఇంజినీరింగ్ విద్యార్థి
* పుష్పగిరిలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి
వల్లూరు, అక్టోబర్ 24: సహచరులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం పుష్పగిరిలోని క్షేత్రాల్లో దైవదర్శనం చేయిపిస్తానంటూ పిలుచుకుని వెళ్లి కానరాని లోకాలకువెళ్లిన సంఘటన నెలకొంది. పోలీసుల సమాచారం మేరకు ..సోమవారం గ్లోబల్ కాలేజిలో డిప్లొమో ఇంజినీరింగ్ విద్యార్థి కోట్ల శివశంకర్ (18) పుష్పగిరి గ్రామం నుంచి కొండపైకి వెళ్లేందుకు సహచరులతో వెళ్లగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిలో పడి కొట్టుకుపోయి మృతి చెందాడు. సుమారు అరకిలోమీటరు దూరంలో నీటిలో కొట్టుకుపోయిన మృతదేహాన్ని గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. మిగిలిన విద్యార్థులు సహచరుని కోసం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేదు. మృతుడు కడప నగరం శంకరాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుని అన్న రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. తమకు దైవదర్శనం చేపిస్తానంటూ ఇంతవరకు మాతో ఉండి ఇప్పుడు లేకపోవడం ఎంతగానో బాధాకరమైన విషయమని సహచరులు, తల్లిదండ్రులు లబోదిబోమంటూ ఆ ప్రాంతం శోకసంద్రమైంది.

లారీతో సహా
35 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సిద్దవటం, అక్టోబర్ 24: మండలంలోని కనుమలోపల్లె బేస్ క్యాంప్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున అటవీశాఖ, పోలీసుశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి లారీతో సహా 35 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. కడప -చెన్నై జాతీయ రహదారిలోని కనుమలోపల్లె బేస్ క్యాంప్‌వద్ద నుంచి ఎర్రచందనం అక్రమరవాణాకు గురౌతోందని అటవీశాఖ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు దాడు లు నిర్వహించారు. ఎర్రచందనం అక్రమంగా తరలించేందుకు సిద్దంగా ఉం చిన లారీని 35 ఎర్రచందనం దుంగలను పట్టుకోగా 20 మంది తమిళకూలీలు పరారయ్యారు. విషయాన్ని తెలుసుకున్న కడప డిఎఫ్‌ఓ దివాన్‌మైదీన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్వాధీనం చేసుకున్న లారీని ఎర్రచందనం దుంగలను కడప అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. పరారైన కూలీల కోసం అటవీశాఖ అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
గ్రామాల్లో పర్యటించిన డిఎల్‌పిఓ
రైల్వేకోడూరు, అక్టోబర్ 24:మండలంలోని పలు గ్రామాలలో సోమవారం డివిజనల్ పంచాయితీ అధికారి రమణ, ఎంపిడిఓ కృష్ణయ్య, ఈఓపిర్డీ సంజీవయ్య పర్యటించారు. మండలంలోని బుడుగుంటపల్లె, సమతానగర్, విద్యానగర్ తదితర ప్రాంతాలలో అధికారులు పర్యటించారు. పరిసరాల పరిశుభ్రత, అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంటి పన్నులు, తాగునీటి పన్నులను సకాలంలో చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుధామణి, మాజీ ఎంపిటీసీ గంగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
హైస్కూల్‌లో రక్త పరీక్షలు
చిట్వేల్, అక్టోబర్ 24:చిట్వేల్ సాయి వికాస్ హైస్కూల్‌లో విద్యార్థులకు సోమవారం రక్తపరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు రక్త గ్రూపులను నిర్ధారించారు. ఎంఇఓ మార్కొండాయనాయుడు ఆధ్వర్యంలో జవహర్ ఆరోగ్య రక్ష పథకంలో భాగంగా 750 మంది విద్యార్థులు రక్తపరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలలో భాగంగా రక్తపరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ టి.రెడ్డయ్యనాయుడు, రక్తపరీక్షల నిపుణులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అటవీ అభివృద్ధి పనుల తనిఖీ
రైల్వేకోడూరు, అక్టోబర్ 24:రైల్వేకోడూరు అటవీ పరిధిలోని వై.కోట అటవీ ప్రాంతంలో సోమవారం తిరుపతి స్క్వాడ్ డిఎఫ్‌ఓ పవన్‌కుమార్ పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇందులో భాగంగా స్థానిక అటవీ శాఖ అతిథిగృహంలో అటవీ సంరక్షణ, ఎర్రచందనం అక్రమ నిర్మూలన తదితర అంశాలపై రైల్వేకోడూరు, బాలుపల్లె అటవీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వనం-మనం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ లక్ష్యం మేరకు మొక్కలు నాటే విధంగా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు రెడ్డిప్రసాద్, నయూంబాషా సిబ్బంది పాల్గొన్నారు.
నగిరిపాడులో కాలువ ఆక్రమణను అరికట్టాలి
చిట్వేల్, అక్టోబర్ 24:మండలంలోని నగిరిపాడు పంచాయితీ వెంకటరాచపల్లె గ్రామం మధ్య నుండి పోతున్న కాలువ ఆక్రమణకు గురవుతుందని, ఆక్రమణదారుల నుండి కాలువను కాపాడాలని గ్రామస్తులు సోమవారం తహశీల్దార్ పార్వతికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నగిరిపాడు చెరువుకు అటవీ ప్రాంతం నుండి వచ్చే వరద నీటి కాలువను కొంతమంది ఆక్రమణ చేయడంతో వర్షాకాలంలో వచ్చే వరద నీరు గ్రామంలోకి వస్తుందన్నారు. దీంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. అలాగే 25 సెంట్లు గ్రామ కంఠం స్థలం ఆక్రమణకు గురవుతుందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన గంగాధర్, శంకరరెడ్డి, సుబ్బరాయుడు, భాగ్యలక్ష్మీ, కె.శ్రీనివాసులు, జివి రెడ్డిలతో పాటు దాదాపు 50 మంది తహశీల్దార్‌ను కోరారు.

ఎస్సీ రుణాల కేటాయింపులో అన్యాయం
చాపాడు, అక్టోబర్ 24: ఎస్సీ కార్పోరేషన్ ద్వారా నిరుద్యోగులకు సబ్సిడీ రుణాల కేటాయింపులో చాపాడుకు అన్యాయం జరిగిందని ఎమ్మార్పీ ఎస్ మండల కన్వీనర్ అయ్యవారయ్యమాదిగ పేర్కొన్నారు. సోమవారం ఆయన చాపాడులో మాట్లాడుతూ గత మూడేళ్లుగా చాపాడు మండలానికి ఎస్సీ కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు నిరుద్యోగులకు అందడం లేదన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 18 యూనిట్లను కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. గత ఏడాది 30 యూనిట్లు కేటాయించినప్పటికీ లబ్దిదారుల ఎంపికలో ఆలశ్యం జరిగి ఆ రుణాలు లబ్దిదారులకు అందకుండా పోయాయన్నారు. ఈసారైనా తగిన విధంగా ఇంటర్వ్యూలు జరిపి అర్హత కలిగిన ఎస్సీలకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
వంద క్వింటాళ్ల శెనగ విత్తనాలు అవసరం
చాపాడు, అక్టోబర్ 24: మండలానికి వంద క్వింటాళ్ల శెనగ విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు మండల వ్యవసాయాధికారి సురేష్‌బాబు తెలిపారు. ఇటీవల మండలానికి 200 క్వింటాళ్ల సబ్సిడీ శెనగ విత్తనాలు మంజూరు కాగా వాటిని మెట్ట ప్రాంతాలైన పెద్దచీపాడు, మడూరు, వెదురూరు గ్రామాల రైతులకు అందివ్వడం జరిగిందన్నారు. ఈ గ్రామాలతోపాటు మరికొన్ని గ్రామాలకు అదనంగా వంద క్వింటాళ్లు సబ్సిడీ శెనగ విత్తనాలు అవసరమని గుర్తించి, అందుకనుగుణంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశామన్నారు. సకాలంలో విత్తనాలను సరఫరా చేస్తే రైతులకు అందివ్వడం జరుగుతుందన్నారు. రబీ పంట సాగుకు రైతులు సంసిద్ధమయ్యారని, వర్షం రాగానే పంటలు సాగుచేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు.
26న కలెక్టరేట్ ఎదుట ధర్నా
గోపవరం, అక్టోబర్ 24: ఉపాధ్యాయులకు కంట్రిబ్యూటరీ పెన్షన్‌ను విధానమును తొలగించి పాత పెన్షన్ విధానమును అమలుచేసే వరకు పి ఆర్‌టియు ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని పి ఆర్‌టియు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు రవిశంకర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 26న కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ధర్నాకు బద్వేలు రీజనల్‌కు సంబంధించిన ఉపాధ్యాయులందరూ తరలి వచ్చి ధర్నాను విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.
రాయితీపై కోడిపిల్లల పంపిణీ
రాజుపాళెం, అక్టోబర్ 24: మండలంలోని ఎస్సీ, ఎస్టీ లబ్దిదార