కడప

జిల్లాకే ఆదర్శం స్వచ్ఛవిద్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం, అక్టోబర్ 25: మండలంలోని మాధవరం -1 గ్రామపంచాయతి వెంకటేశ్వరాపురం స్వచ్చవిద్యాలయం చాలా బాగుందని ఎస్‌ఎస్‌ఏ ప్రత్యామ్నాయ పాఠశాలల సహాయ సమన్వయకర్త డి.సుజాతరాణి అన్నారు. మండలంలోని మాధవరం -1 గ్రామపంచాయతి వెంకటేశ్వరాపురం ప్రాథమిక ఉన్నతపాఠశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు.
పాఠశాలలోని రికార్డులను, పరిసరాల పరిశుభ్రత , మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో సిద్దవటం మండలంలోని వెంకటేశ్వరాపురం పాఠశాల, జమ్మలమడుగులో కెజివిపి , పాత రాయచోటిలో ఎంపిపిఎస్ పాఠశాల, బద్వేలులో జెడ్పి ఉన్నతపాఠశాల, పోట్లదుర్తి పాఠశాల స్వచ్చవిద్యాలయాలుగా ఎంపికయ్యాయన్నారు. త్వరలో రాష్ట్ర కమిటీ ఆయా పాఠశాలలను పరిశీలించి అందులో ఒక పాఠశాలను స్వచ్చవిద్యాలయంగా కేంద్ర పురస్కారానికి ఎంపిక చేస్తుందన్నారు.
ఎంపికైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాష్టప్రతి, ప్రధాని చేతులమీదుగా పురస్కారం అందుకుంటారన్నారు. ఈ పురస్కారాన్ని సాధించేందుకు ఉపాధ్యాయులు మరింత శ్రమించాలని , మరుగుదొడ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పార్వతమ్మ, ఉపాధ్యాయురాలు అరుణ, సాలమ్మ, ఉపాధ్యాయులు ఫయాజ్,నరసింహులు, సిఆర్‌పి రాజేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.