కడప

దళితుల సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, అక్టోబర్ 25: రాష్ట్రప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం 180 పథకాలు ప్రవేశపెట్టిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం దళితబాట కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో 99వేల మంది దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పిస్తోందన్నారు. బ్యాంకర్లు దళితుల రుణాలు మంజూరు చేసేందుకు ముందుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితులకు రుణాలు మంజూరు చేయడంలో సహకరించని బ్యాంకర్లను ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారని గుర్తుచేశారు. దళితులకు రుణాలు మంజూరు చేయడంలో పారదర్శకత కోసం ఆన్‌లైన్ ద్వారా మంజూరు చేస్తున్నామన్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్ చొరవచూపి దళితులకు కేటాయించిన రుణాలు వారికే చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన దళితబాట కార్యక్రమం దళితుల అభ్యున్నతికి ఎంతో తోడ్పడుతుందని ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు దళితుల అభ్యున్నతికి చేస్తున్న కృషిని ఆయన శ్లాఘించారు. దళిత అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషిని నిరుద్యోగులైన దళితులు సద్వినియోగం చేసుకుని తద్వారా సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. గతంలో దళితులపట్ల ఏ ముఖ్యమంత్రి చూపని చొరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూపుతున్నాడని దళితులకు ఆయనకు రుణపడి ఉండాలన్నారు. దళిత మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు సంతృప్తికరంగా ఉన్నాయని డ్వాక్రా సంఘాల సభ్యత్వం ద్వారా దళిత మహిళలు పలు విధాల కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధికి కృషిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.