కడప

యువత సంక్షేమానికి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, అక్టోబర్ 25: యువత సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు విప్ మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో స్టెప్, యువజన సర్వీసుల శాఖల ఆధ్వర్యంలో జరిగిన డివిజన్ స్థాయి యువజనోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన మేడా మాట్లాడుతూ ఈ దేశాభివృద్ధి యువత వలనే సాధ్యమని ముఖ్యమంత్రి అభివృద్ధి, సంక్షేమ, విద్య, ఉపాధి రంగాలలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి యువతకు పెద్దపీట వేస్తున్నారన్నారు. అభివృద్ధిలో యువతే వెనె్నముకలాంటి వారన్నారు. అన్ని రంగాలలో రాణించేలా యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. యువతలోని ప్రతిభను వెలికి తీసేందుకు సిఎం దేశ, విదేశాలలో పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ఈ యువజనోత్సవాలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబాలని ఆయన అభివర్ణించారు. యువజనోత్సవాలు డివిజన్‌స్థాయి నుండి జిల్లాస్థాయి వరకు నిర్వహిస్తూ సాంస్కృతిక పోటీలను నిర్వహించి బహుమతులు అందజేసే సాంప్రదాయం యువతను ప్రోత్సహిస్తుందన్నారు. మన జిల్లా యువత దేశ స్థాయిలో రాణించి తెలుగు వారి కీర్తిని ఇనుమడింప చేయాలన్నారు. కడప స్టెప్ సిఇఓ మమత మాట్లాడుతూ వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం డివిజన్ స్థాయి నుండి దేశ స్థాయి వరకు యువజనోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యువజనోత్సవాలలో కర్నాటక సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, కథక్ తదితర 18 రకాల కళలపై పోటీలు నిర్వహించి, డివిజన్ స్థాయి విజేతలను జిల్లా స్థాయికి, ఆపై రాష్టస్థ్రాయి, జాతీయ స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటిఎస్ వైస్ ఛేర్మన్ చొప్పా యల్లారెడ్డి, డైరెక్టర్ జి.ప్రభాకర్‌రావులు ప్రభుత్వ విప్ మేడా వెంకట మల్లికార్జురెడ్డిని దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపాల్ ఎస్‌ఎంవి నారాయణ, ఎంపిడిఓ హరినాధ్‌బాబు, స్టెప్ అధికారులు సుబ్బరాయుడు, అబ్బాస్ అలీ, శివరామిరెడ్డితో పాటు కళాశాల హెచ్‌ఓడీల సుబ్బారావు, అరిగె సుబ్రమణ్యం, టిడిపి నాయకులు ఉప్పు రామచంద్ర, ప్రతాప్‌రాజు, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో రాజంపేట డివిజన్‌లోని అన్ని మండలాలకు చెందిన యువతీ, యువకులు పాల్గొన్నారు.