కడప

స్వచ్ఛవిద్యాలయంగా వెంకటేశ్వరాపురం పాఠశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం, అక్టోబర్ 25: సిద్దవటం మండలంలోని మాధవరం -1 గ్రామపంచాయతి వెంకటేశ్వరాపురం ప్రాథమిక ఉన్నత పాఠశాల స్వచ్ఛవిద్యాలయంగా రాష్ట్రప్రభుత్వ పురస్కారానికి ఎంపికైంది. ఈపాఠశాలలో ఈ ఏడాది నుంచి 1వ తరగతి నుంచే ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టిరు. ఆరుగదులు, ఐదుగురు ఉపాధ్యాయులున్న పాఠశాలలో గోడలకు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా బొమ్మలు, పాఠ్యాంశాలపై అవగాహన కల్పించేందుకు పెయింటింగ్‌తో గోడలపై రాయించారు. పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటించడంతోపాటు పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇచ్చారు. బాలుర, బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, మంచినీటి వసతి కల్పించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన, వసతుల కల్పనలో ఈ పాఠశాల ముందుంటోంది. జిల్లా వ్యాప్తంగా ఐదు పాఠశాలలు స్వచ్చవిద్యాలయాలుగా ఎంపికవ్వగా అందులో ఈ పాఠశాల ఒకటి. ఐదుపాఠశాలల్లో ఒక పాఠశాలను ఎంపికచేసేందుకు ఈనెల 30వ తేదిలోగా ఒక కమిటి పాఠశాలకు విచ్చేసి ఎంపిక చేయనుంది. ఎంపికైన పాఠశాలకు రాష్టప్రతి, ప్రధాని చేతులమీదుగా స్వచ్ఛవిద్యాలయ పురస్కారాన్ని అందుకోనుంది. ఈ పురస్కారం వెంకటేశ్వరాపురం పాఠశాలకు వరిస్తుందని ఆశిద్దాం.