కడప

జన చైతన్యయాత్రలతో ప్రజలకు చేరువగా మేడా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, నవంబర్ 4: తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన జనచైతన్యయాత్రల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు విప్ మేడా మల్లికార్జునరెడ్డి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజంపేటలో ఎన్నికల సమయంలో నిర్వహించే ప్రచారాలను తలపిస్తూ జనచైతన్యయాత్రలు తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహిస్తుండడం విశేషం. శుక్రవారం రాజంపేట పట్టణం బండ్రాళ్లవీధి, నాగులమానువీధి ప్రాంతాల్లో జనచైతన్యయాత్రల్లో వివిధవర్గాల ప్రజలతో ముఖాముఖి సమావేశమవ్వడం జరిగింది. వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ పార్టీ కరపత్రాలను పంచుతూ, పార్టీ స్టిక్కర్స్‌ను సైతం ఇళ్లకు కరిపిస్తూ మేడా ప్రజలకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. రాజస్తాన్‌కు చెందిన మార్వాడీ మదన్ టీ దుకాణంలో స్వయంగా మేడా మల్లికార్జునరెడ్డి టీ కలపడం అందరిని ఆకట్టుకుంది. టీ దుకాణం ద్వారా వస్తున్న ఆదాయ వివరాలను, కష్టనష్టాలను మార్వాడీ మదన్ నుండి మేడా అడిగి తెలుసుకున్నారు. అలాగే పార్టీ పతాకాన్ని భుజాన స్వయంగా వేసుకొని కార్యకర్తలాగా జనచైతన్యయాత్రల్లో మేడా పాల్గొంటుండడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా జనచైతన్యయాత్రల్లో ముమ్మరంగా పాల్గొంటుండడం విశేషం. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా మేడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు టి.సంజీవరావు, పార్టీ సీనియర్ నేత డాక్టర్ సి.సుధాకర్, పార్టీ నేతలు ఎం.వెంకటసుబ్బయ్య, మెంటాశేఖర్, పబ్బిశెట్టి సుబ్రమణ్యం, సత్యనరశింహా, ఆంజనేయులు, వై.రమేష్, పి.నరశింహా, కాశీ, పి.రాధాక్రిష్ణమూర్తి, జి.సుబ్బనరశింహులు, ఎ.నారాయణ, రామక్రిష్ణ, సూరి, వడ్డెర రమణ, ఆజీముద్దీన్‌జ ఆని, ఎం.వెంకటేశ్, కుమార్, మురళిఆచారి, ఎం.చిన్నయ్య, వై.శ్రీనివాసులు, పీరూసాహెబ్, రామచంద్రయ్య, విశ్వనాధఆచారి, మందాశ్రీను, సి.శివకుమార్, ఈషాక్, నాగరాజ, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.