కడప

అగ్నిగుండంగా మారిన కడప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 16: జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి అగ్నిగుండంగా మారుతోంది. శనివారం కడపలో 46 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లావ్యాప్తంగా శనివారం అన్ని నియోజకవర్గాల్లో ప్రతిరోజు కంటే 3 నుంచి 4 సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగాయి. కడపలో 46డిగ్రీలు, రాయచోటిలో 42, బద్వేలులో 41, కోడూరులో 40, రాజంపేటలో 41, కమలాపురంలో 42, జమ్మలమడుగులో 43, ప్రొద్దుటూరులో 42, మైదుకూరులో 42, పులివెందులలో 43 సెల్సియస్ డిగ్రీలు నమోదైంది. దీంతో ఎండలకు తట్టుకోలేక పట్టణవాసులు గ్రామీణ ప్రాంతాలకు వలసలు మొదలుపెట్టారు. ప్రస్తుతం వేసవిలో పాఠశాలలు ఉదయం వేళల్లో నిర్వహిస్తున్నా ఉదయం 10గంటల తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎండదెబ్బకు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కర్ప్యూవాతావరణం నెలకొని ఇళ్లనుంచి కార్యాలయాల నుంచి బయటకురావాలంటే జంకుతున్నారు. వ్యాపార సంస్థలు సైతం బోసిపోయి వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. అలాగే ఇటీవల గత నాలుగు మాసాల క్రితం కొన్నిప్రాంతాలకే వర్షం పరిమితమై చెరువులు,కుంటలకు చేరిన నీరు సైతం ఎండలకు ఆవిరైపోతోంది. నదీ పరివాహక ప్రాంతాలు, ప్రాజెక్టుల పరిసర ప్రాంతాల్లో సాగైన పంట పొలాలు ఎండ వేడిమికి నిట్టనిలువునా ఎండిపోతున్నాయి. వడగాలులు వీస్తుండటంతో వృద్ధులు, పసిపిల్లలు తల్లడిల్లుతూ మంచాలకు పరిమితమవుతున్నారు. పలువురు వడదెబ్బకు గురై జ్వరాలు, వాంతులు, విరోచనాలతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. గతంలో రెండు దశాబ్దాల్లో ఇటువంటి ఎండలు, వేడిమి చూడలేదని వృద్దులు చెబుతున్నారు. మొత్తమీద జిల్లాలో భానుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతుండటంతో జిల్లావాసులు బెంబేలెత్తిపోతున్నారు.