కడప

కెసి కాలువలో పడి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాళెం, నవంబర్ 14: మండల పరిధిలోని కుమ్మరపల్లె కు చెందిన భజంత్రి యశ్వంత్ (3), భజంత్రి హరినాథ్(4) ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు చాపాడు కెసి కాలువలో పడ్డారు. కాలువలో పడిన యశ్వంత్ మృతదేహం లభ్యమైంది. కాలువలో గల్లంతైన హరినాథ్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఆ పిల్లాడి కోసం కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయమే తల్లిదండ్రులు పొలానికి సాగు అందించేందుకు వెళ్లడంతో ఇంటి వద్దనే ఉన్నా చిన్నారులు ఆడుకుంటు వెళ్లి కాలువలో పడినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్న చాపాడు కెసి కాలువలో చిన్నారులు పడిపోవడంతో గ్రామంలో విశాదఛాయలు అలుముకున్నాయి.