కడప

గ్రామపంచాయతీల్లో కనిపించని ప్రగతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,నవంబర్ 20:గ్రామసీమలే అభివృద్ధికి పట్టుకొమ్మలు కాగా దాదాపు మూడేళ్లు క్రితం సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గానికి నిధులకొరతతో అభివృద్ధి ఆమడదూరంలో ఉందనేది జగమెరిగిన సత్యం. కేవలం 14వ ఆర్థికసంఘం నిధులకింద నిధులు విడుదలయ్యేయే కానీ జిల్లాలోని 790గ్రామపంచాయతీలు ఉండగా రాజంపేట మండలంలో 5 గ్రామపంచాయతీలను రాజంపేట పురపాలక సంఘంలో చేర్చడంతో 785 గ్రామపంచాయతీలలో జనాభా ప్రాతిపదికపై నిధులు విడుదల కాలేదనేది జగమెరిగిన సత్యం. అయితే గ్రామపంచాయతీల పరిసర ప్రాంతాల్లో, పంచాయతీల్లో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా వివిధ రకాల అభివృద్ధి పనులు పంచాయతీరాజ్ శాఖ ద్వారా మరికొన్ని అభివృద్ధి పనులు , మిగిలిన పనులు ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారా పనులు చేపట్టడం వల్ల గ్రామపంచాయతీ సర్పంచ్‌లు కొంతవరకు అసంతృప్తివ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 50 మండలాల పరిధిలో 9 మేజర్ గ్రామపంచాయతీలు, 781 మైనర్ గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈగ్రామపంచాయతీలను 371క్లస్టర్లుగా విభజించి పంచాయతీ కార్యదర్శులను ఆక్లస్టర్లకు నియామకం చేశారు. 2015-16 సంవత్సరానికిగాను 14వ ఆర్థిక సంఘం నిధులకింద రూ.25,69,94,200- 4శాతం గ్రాంటు కింద 2015-16లో రూ.17,89,900 , సీనరైజ్ గ్రాంట్ కింద 2015-16లో 66,24,000 గ్రాంట్లు విడుదలయ్యాయి. ఏకగ్రీవంగా ఎన్నికకాబడిన 104 గ్రామపంచాయతీలకు ప్రోత్సాహక నిధుల కింద ఒక్కొక్క గ్రామపంచాయతీకి రూ.7లక్షలు ప్రకారం రూ,10,15,00,000 చొప్పున నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులు తప్ప మిగిలిన వివిధ పథకాల ద్వారా ఎటువంటి నిధులు విడుదలకాలేదు. సంబంధిత గ్రామపంచాయతీల పరిధిలో భూములు కొనుగోళ్లు, భవనాల రిజిస్ట్రేషన్లు, పరిశ్రమల నెలకొల్పన తదితరాలు నెలకొల్పి వాటికి ప్రభుత్వ నిబంధనల మేరకు చెల్లించే నిధులు గ్రామపంచాయతీలకు , రిజిస్టర్ కార్యాలయం, సబ్ ట్రెజరరీ కార్యాలయాలకు కేటాయిస్తారు. అయితే రాజకీయ పలుకుబడి పెరగడంతో గ్రామపంచాయతీలకు ఆదాయం చేకూర్చే వనరులకు బ్రేక్‌లు పడ్డాయి. గ్రామపంచాయతీల సర్పంఛ్‌ల ఆధ్వర్యంలో విద్య, ఆరోగ్యం, పారిశుద్ద్యం, నీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజిల అభివృద్ధి వీధిదీపాల ఏర్పాటు, పెన్షన్ల పంపిణీ, ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంలో సర్పంచ్‌లు భాగస్వామ్యం తప్పనిసరి. వివిధ రాజకీయపార్టీ నేతల పాలనలో ఉన్న గ్రామపంచాయతీలకు ఆదిపత్యపోరుతో అధికారపార్టీ నేతల పిలుపును పట్టించుకోక పోవడం, కొంతమంది అధికారపార్టీ నేతలు సర్పంచ్‌లను ఖాతరు చేయకపోవడంతో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంచుమించు ఒక్కొక్క సర్పంచ్ రూ.15 నుంచి కోటిరూపాయలు వెచ్చించి ఎన్నికయ్యామని, ఎన్నికల పెట్టుబడిలో వడ్డీలు కూడా రావడం లేదని ప్రతిపక్ష పార్టీసర్పంచ్‌లు వాపోతున్నారు. వాస్తవంగా ప్రభుత్వం గ్రామకమిటీలు,జన్మభూమి కమిటీలు ఏర్పాటుచేసి నీరు-చెట్టు వివిధ అభివృద్ధి పథకాలకు కమిటీలు ఏర్పాటుచేసి అన్నిశాఖల అధికారులను భాగస్వామ్యంలోకి అనేక రకాల అభివృద్ధి పనులు మంజూరు చేస్తున్నా ప్రతిపక్షపార్టీ సర్పంచ్‌లు మాత్రం గ్రామపంచాయతీల్లో ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదని రానున్న ఎన్నికల్లో తాము ఓట్లు అడగలేమని వాపోతున్నారు. మొత్తంమీద గ్రామపంచాయతీల సర్పంచ్‌లకు ప్రభుత్వం ఆర్థికంగా పనులు కేటాయించకపోవడంపై కొంతమేరకు అసంతృప్తి ప్రభుత్వంపై నెలకొనివుంది. అయితే గ్రామాల్లో విరివిగా అభివృద్ధి పనులు అన్నిశాఖల సమన్వయంతో జరుగుతున్నాయి. ప్రతిపక్షపార్టీ సర్పంచ్‌లు అడ్డుతగులుతుండటంతో ఎక్కడి పనులు అక్కడే తిష్టవేసుకుని కూర్చున్నాయి. ఈనేపధ్యంలో గ్రామాల అభివృద్ధి పనులు కాలమే నిర్ణయించాల్సివుంది.