కడప

సంక్షేమ పథకాల మంజూరుకు నిబంధనలు పాటించాలి : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)డిసెంబర్ 2: జిల్లాలో వివిధ పథకాలు అమలుచేసే మంజూరుకు ఎంపికకు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల అధికారులతో, ఆర్డీవోలు, పల్స్‌సర్వే, ఓడిఎఫ్, నగదు రహిత లావాదేవీలు, పెన్షన్స్, గృహనిర్మాణం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో అర్హుల ఎంపికకు సంబంధించిన నియమ నిబంధనలు తప్పకపాటించాలని, వచ్చిన దరఖాస్తులు ఎంపికచేసి ఆన్‌లైన్‌లో ఉంచాలని అధికారులు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఖచ్చితంగా అర్హతను బట్టి ఎంపికచేసే పారదర్శకతను పాటించాలని కోరారు. మండల కమిటీల ద్వారా ఎంపిక చేసి మంజూరు చేయాలన్నారు. గడువులోగా లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. బహిరంగ మల విసర్జన లేని గ్రామాలు అమలులో ఈనెల 31వ తేదీ లోగా వందగ్రామాలు ఎంపికచేయాలని కోరారు. ఈ విషయంపై ప్రత్యేకశ్రద్ధవహించాలన్నారు. అలాగే ప్రజాసాధికారత సర్వేలు ఇంకా పూర్తికాలేదని వాటిని పూర్తిస్థాయిలో చేయాలని, ఆర్డీవోలు ఈ అంశంపై మ్యానటరింగ్ చేసి ఈనెల 5వ తేదీలోపు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వివిధ రకాల పెన్షన్ల కింద జిల్లాలో 16586 మందికి బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాకుండా ఉన్నాయని వాటిని వెంటనే చర్యలు తీసుకుని పెన్షన్ ఇవ్వాలని సూచించారు. నగదు రహిత లావాదేవీలు చేసేందుకు స్వైప్ మిషన్లు జిల్లాకు 20 నుంచి 30వేలు అవసరం ఉంటుందని, ప్రభుత్వ శాఖలకు ఎన్ని అవసరమో ప్రతిపాదించాలని అలాగే అన్ని వ్యాపార సంస్థలకు స్వైప్ మిషన్లు ఏర్పాటుకు దరఖాస్తులు కోరాలని తెలిపారు.