కడప

ముగ్గురు అంతర్ రాష్ట్రాల మట్కాబీటర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 6: అంతర్ రాష్ట్రాల మట్కాబీటర్లు ముగ్గురు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.47లక్షలు పైబడి నగదు, మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు కడప బిల్టప్, ఎర్రగుంట్ల బైపాస్, వీరపునాయునిపల్లె ప్రాంతాల్లో అంతర్ రాష్ట్రాల మట్కా బీటర్లు సంచరిస్తున్నారని మంగళవారం సమాచారం అందడంతో వారిపై దాడులు చేసి ప్రొద్దుటూరుకు చెందిన జాలాది నాగేశ్వరరావు(43), పబ్బతి రాఘవేంద్రప్రసాద్ (36), పబ్బతి సుధీర్‌బాబు (38) అనే ముగ్గురిని అరెస్టుచేసి వారి నుంచి రూ.47లక్షల 26వేల 900లు నగదు (పాతనోట్లు), మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో జాలాది నాగేశ్వరరావు ప్రధాన మట్కా నిర్వాహకుడిగా ఉంటూ విజయవాడలో నివాసం ఏర్పాటుచేసుకుని పబ్బతి సుధీర్‌బాబు, రాఘవేంద్రప్రసాద్‌లతో మట్కా నిర్వహించేవాడు. దాడిలో పాల్గొన్న వారిలో ఎర్రగుంట్ల సిఐ రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐ నారాయణ యాదవ్, కలమల ఎస్‌ఐ రవికుమార్‌లు ఉన్నారు. కడప డిఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో మట్కా నిర్వాహకులపై దాడులు జరిగాయి. మొత్తంమీద జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పిహెచ్‌డి రామకృష్ణ గత ఐదుమాసాలుగా అసాంఘిక శక్తుల కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకే పెద్దపీట వేశారని చెప్పవచ్చు.

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
పోరుమామిళ్ల, డిసెంబర్ 6: విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని ఎంపిపి చిత్తా విజయప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన బద్వేలు జోనల్ క్రీడల సందర్భంగా జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపిపి, జడ్పిటిసి శారదమ్మ, ఎంపిడిఓ రామక్రిష్ణ, తహశీల్దార్ దైవాదీనంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ చిన్నవయస్సు నుండే విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ చూపి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ముఖ్యంగా చిన్ననాటి నుంచే అన్నివిధాలా పిల్లలు రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరుప్రతిష్టలు తీసుకురావాలన్నారు. జడ్పిటిసి, ఎంపిడిఓ మాట్లాడుతూ విద్యార్థులు చురుగ్గా వుండి ఉన్నత ఫలితాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో సిఐ, ఎంపిటిసి ప్రతాప్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.