కడప

22 నుంచి శుభప్రదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప (కల్చరల్), ఏప్రిల్ 16: హిందు ధర్మప్రచార పరిషత్ , తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 29వ తేది వరకు శుభప్రదం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ధర్మప్రచార పరిషత్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ హరినాధ్ శనివారం తెలిపారు. శుభప్రదం కార్యక్రమంలో 8,9వ తరగతులు పూర్తిచేసిన విద్యార్థులు పాల్గొనవచ్చునన్నారు. దరఖాస్తులు కడప నగరంలోని టిటిడి కల్యాణ మండపంలో ఉచితంగా లభిస్తాయని, పూర్తి చేసిన దరఖాస్తులు కల్యాణ మండపంలోని తమసంస్థ కార్యాలయంలో ఈనెల 20వ తేదిలోగా అందజేయాలన్నారు. కడప నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో 400మంది, రిమ్స్ వద్దవున్న శ్రీరామకృష్ణమిషన్‌లో 300 మంది విద్యార్థులకు శుభప్రదం శిక్షణ తరగతులు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు హరినాధ్ తెలిపారు. జిల్లాలో ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.