కడప

గండికోట ఎత్తిపోతల పథకానికి మోక్షం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపురం, డిసెంబర్ 20: గండికోట ఎత్తిపోతల పథకానికి త్వరలో మోక్షం లభించనున్నట్లు తెలుస్తుంది. గాలేరునగరి-సృజల శ్రవంతిలో అంతర్భాగమైన గండికోట జలాశయంలో ఐదు టిఎంసీల నీటి కంటే నీరు ఎక్కువ నిల్వ చేస్తే గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా పైడిపాళెం రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు పాత కొండాపురం సమీపంలో ఎత్తిపోతల పథకమును ఏర్పాటుచేశారు. ఈ నిర్మాణం జరిగి సంవత్సరాలు గడిచినా గండికోట ప్రాజెక్టులో తగినన్ని నీరు లేకపోవడంతో ఇప్పటివరకు నిరుపయోగంగా ఉంది. అక్టోబర్ 2వ తేదీ నుండి గండికోటకు నీరు వస్తుండటం, ముంపుగ్రామాల సమస్యలు ఒక కొలిక్కి రావడంతో ఇక త్వరలో నీటిని ఎత్తిపోసేందుకు అవకాశముంది. పైడిపాళెం రిజర్వాయర్ నిర్మాణముకు సింహాద్రిపురం మండలంలో సుమారు రూ.760 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. పిబిసికి నీరందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు కింద సుమారు 47,500 ఎకరాలను ఆయకట్టుగా స్థిరికరించారు. వరదనీటితోపాటు శ్రీశైలం మిగులుజలాల ఆధారంగా గండికోట రిజర్వాయర్ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా పైడిపాళెం రిజర్వాయర్‌కు నీటిని రప్పించి అటునుంచి ప్రత్యేక కాలువల ద్వారా పిబిసికి నీటిని విడుదల చేయాల్సి వుంది. శ్రీశైలం మిగులుజలాలు కర్నూలుజిల్లాలోని పోతిరెడ్డిపాడు నుండి ఓర్వకల్లు ఆతర్వాత అవుకు, తదనంతరం జిల్లాలోని గండికోటకు నీరు వచ్చి చేరుతోంది. ఇక్కడ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా పైడిపాళెం ప్రాజెక్టుకు నీరందిస్తారు. ఈ పైడిపాళెం ప్రాజెక్టులో 6 టిఎంసీల నీరు నిల్వ వుండేలా నిర్మాణం చేశారు. అయితే ప్రస్తుతం 2టిఎంసీల నీరు నిల్వ వుంచే అవకాశముందని సమాచారం. పైడిపాళెం నుంచి హిమకుంట్ల చెరువు అక్కడి నుండి పిబిసికి నీటిని తరలించడం పైడిపాళెం లక్ష్యం. అలాగే ఆయకట్టుదారులకు సాగునీందించడంతోపాటు కొన్ని గ్రామాలకు తాగునీటిని కూడా అందించే అవకాశాలున్నాయి. ఎత్తిపోతల పథకానికి బ్రెజిల్ దేశం నుంచి తెప్పించిన తొమ్మిది భారీ మోటర్లను నీటిని ఎత్తిపోయడానికి ఏర్పాటుచేశారు. 3,700 హెచ్‌టి సామర్థ్యం గల ఈ మోటర్లు పైడిపాళెం ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోయడానికి సిద్ధం కావలసిన సమయం ఏర్పడిందని చెప్పవచ్చు. ఎంతోకాలంగా వ్యవసాయ రంగంలో వెనుకబడిన పులివెందుల ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేందుకు పైడిపాళెం ద్వారా నీరందించి ఆ భూములను బంగారుమయం చేసే అవకాశముంది.

టిడిపి బలోపేతానికి చర్యలు

కడప,డిసెంబర్ 20: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ బలోపేతం చేయడంతోపాటు నేతల్లో ఐక్యమత్యం తీసుకొచ్చి 2019 ఎన్నికల నాటికి పార్టీపై ప్రతిపక్షం వేలుచూపకుండా చర్యలు మొదలైనట్లు తెలుస్తోంది. మంగళవారం విజయవాడలో తెలుగుదేశం జిల్లా నేతలతో ముఖ్యమంత్రి సమీక్షించారు. జిల్లాఅధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి పనితీరుపై కితాబు ఇచ్చి పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో రాష్ట్రంలోనే ముందంజలో ఉందని, అయితే జిల్లాలో పలు సీనియర్లు, నేతల మధ్య ఉన్న ఆధిపత్యపోరుతో ప్రజలతో మమేకం కాలేకపోతున్నారని దీనివల్ల పార్టీ నష్టపోవడంతోపాటు 2019 ఎన్నికలకు ఆధిపత్యపోరు నేతలకు నష్టం జరగడమేగాకుండా పార్టీకి కూడా నష్టం జరుగుతుందని సూచించారు. కావున నేతలు ఆధిపత్యపోరుకు ఫుల్‌స్టాప్ చెప్పి ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించినట్లు తెలిసింది. సీఎం చర్యలు చూస్తుంటే జిల్లాలో నియోజకవర్గాల నేతలకు బాధ్యతలు మార్పులు చేసి, నేతలకు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకే పరిమితం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా స్పర్థలున్న నేతలతో సమస్యలు అధికంగా ఉన్నట్లు పార్టీ అధిష్ఠానం గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో తెలుగుదేశంపార్టీ నేతలంతా ఐక్యమత్యంగా ఉండాలని పార్టీ ఇన్‌చార్జిల్లో మార్పు అవసరమని, నేతలను, కార్యకర్తలను అందర్నీ కలుపుకుని పోవాలని, వలసనేతలు కూడా పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ప్రాముఖ్యత ఇచ్చి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఐక్యమత్యంతో ముందుకుసాగని పక్షంలో పార్టీకే ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాలో త్వరలో జరిగే మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీచేసే నేతలను గెలిపించుకునిరావాలని, ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా జగన్ టిడిపిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, వచ్చేనెల జనవరి నుంచి చేపట్టే జన్మభూమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నాయకులకు హితబోధ చేశారు. జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌బాబు, రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు కూడా జిల్లా నేతలకు హితబోధ చేసినట్లు తెలుస్తోంది.

పేరుకే మిత్రపక్షాలు..!

రాజంపేట, డిసెంబర్ 20:రాజంపేట పార్లమెంటు స్థాయిలో పేరుకే మిత్రపక్షాలు అన్నట్టుగా బిజెపి, తెలుగుదేశం పార్టీల పనితీరు ఉంది. ఎన్నికలు పూర్తయ్యి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా ఎప్పుడూ కలిసి బిజెపి, తెలుగుదేశం పార్టీలు పనిచేసిందిలేదు. ఎవరికి వారు యమునాతీరన్నట్టుగా ఈ రెండు పార్టీల నేతలు, కార్యకర్తలున్నారు. క్షేత్ర స్థాయిలో కూడా ఈ రెండు పార్టీల నేతల మధ్య కలయికలు కాని, సంబంధాలు కాని లేవంటే అతిశయోక్తి కాదు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో సైతం ఈ రెండు పార్టీల నేతలు కలుసుకుంటున్నది లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ రెండు పార్టీల నేతల మధ్య రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి కూడా ఎలాంటి ఆహ్వానాలు లేవు. బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య మిత్ర బంధం ఎన్నికల వరకే పరిమితమైందన్నట్టుగా తయారైంది. అయితే బిజెపికి చెందిన మంత్రుల పర్యటనల్లో మాత్రం బిజెపి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసి పాల్గొంటున్నా వీరి కలయిక మంత్రుల పర్యటన వరకే పరిమితమవుతూ వస్తున్నది. కడపజిల్లాలో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒంటరిగా పోటీ చేసి లక్ష ఓట్లు సాధించిన చరిత్ర బిజెపికి గతంలో ఉంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ నియోజకవర్గ పరిధిలో బిజెపికి అంకితభావంతో కూడిన నేతలు, కార్యకర్తల అండ ఉండడమే. ఈ కారణంతోనే తెలుగుదేశం, బిజెపిల మధ్య ఎన్నికల ఒడంబడికలో భాగంగా పొత్తు కుదిరినప్పుడు రాజంపేట పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు తమకివ్వాలని బిజెపి పట్టు పట్టింది. అయితే రాజంపేట పార్లమెంటు స్థానం వరకు పొత్తులో భాగంగా బిజెపికి దక్కింది. గత ఎన్నికల్లో మాజీ కేంద్ర మంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంద్రీశ్వరి రాజంపేట పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కూడా బిజెపి, తెలుగుదేశం పార్టీలు ఇక్కడ కలిసి పనిచేసినా ఓట్ల విషయంలో ఎవరి ప్రయోజనాలు వారు ఆశిస్తూ లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. అంతకు మించి దగ్గుబాటి పురంద్రీశ్వరి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుల మధ్య సత్సంబంధాలు కరవవ్వడం, ఒకరిపై ఒకరికి రాజకీయంగా ఉన్న విభేదాలు కూడా స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య రాజకీయ ప్రభావం పనిచేసినట్టు బిజెపి, తెలుగుదేశం పార్టీ నేతల అంతర్గత సంభాషణల్లో వెల్లడవుతూ ఉంటుంది. ఈ కారణంగానే రాజంపేట పార్లమెంటు స్థానంలో గెలుపు సాధించే విషయంలో తెలుగుదేశం పార్టీ సరైన రీతిలో ఎత్తులు వేయలేదన్న ఆరోపణలున్నాయి. ఎందుకంటే చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాకు చెందిన నాలుగు అసెంబ్లీ స్థానాలు రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. జగన్ సొంత జిల్లా అయిన కడపజిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు వస్తాయి. కడపజిల్లాలో మెజార్టీ విషయానికి వస్తే రాజంపేట అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం పార్టీ 10వేలకు పైబడి ఓట్ల మెజార్టీతో విజయం సాధించినా, ఇదే అసెంబ్లీ స్థానంలో బిజెపి అభ్యర్థి దగ్గుబాటి పురంద్రీశ్వరికి మెజార్టీ రాలేదు సరికదా ఓట్లు తక్కువగా రావడం జరిగింది. ఈ ఎన్నిక తీరుపై అధికార తెలుగుదేశం పార్టీ నేతల విశే్లషణ ఏ విధంగా ఉన్నప్పటికీ తెలుగుదేశం, బిజెపి నేతల మధ్య ఏ రీతిగా సంబంధాలున్నాయో ఈ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి, పార్లమెంటు స్థానంలో బిజెపి అభ్యర్థికి వచ్చిన ఓట్లను బట్టే అర్థమవుతుంది. ఇకపోతే ఎన్నికల్లో తమ మధ్య సవాలక్ష సమస్యలున్నా బిజెపి, తెలుగుదేశం పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ రెండు పార్టీలు వారి వారి పార్టీల కార్యక్రమాలకే పరిమితమయ్యారు. అంతకు మించి బిజెపి నేతలు, కార్యకర్తలు కూడా అధికార తెలుగుదేశం పార్టీ నేతల వద్దకు వచ్చి పనులు చేయించుకుంటున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఇక్కడున్న బిజెపి నేతలు నేరుగా న్యూడిల్లీతో సంబంధాలు పెట్టుకొని ఎవరికి వారు అధికారికంగా అందే లాభాలను అందుకుంటూ వస్తున్నారు. అయితే కిందిస్థాయిలో ఉండే బిజెపి కార్యకర్తలు చాలా మంది లబ్ది పొందుతున్న శాతం తక్కువగా ఉందన్న ఆరోపణలు కూడా ఆ పార్టీలో వినిపిస్తుంది. తాజాగా రాష్ట్రానికి అందాల్సిన సాయం సక్రమంగా అందని సందర్భాల్లో మరోమారు బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య ఉన్న మిత్రబంధంపై ఈ రెండు పార్టీల్లోని శ్రేణుల్లో అనుమానాలు మొదలవ్వడం షరామామూలు తంతుగా ఉంది. రానున్న రోజుల్లో తెలుగుదేశం, బిజెపిల మధ్య మిత్రబంధం ఉంటుందా? ఉండదా? ఉండకుంటే రాజకీయంగా ఎవరికి లాభం? తదితర అంశాలపై కూడా అంచనాలు ఈ రెండు పార్టీలు వేసుకుంటున్నాయి. ఏది ఏమైనా తాజాగా తెలుగుదేశం, బిజెపిలు మిత్రపక్షంగా ఉన్నందున ఈరెండు పార్టీల నేతలు మాత్రం ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బహిరంగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న శాతం చాలా తక్కువ.