కడప

రేషన్‌డీలర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, జనవరి 1: ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా ప్రభుత్వ రేషన్ డీలర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తన స్వగృహంలో వేంపల్లె తహశీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వేంపల్లె పట్టణంలోని 7 మంది రేషన్‌షాపుల డీలర్లకు సెల్లులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో అవినీతికి చోటు లేదన్నారు. దేశం డిజిటల్ వైపు చూస్తోందని, అర్హులకు రేషన్ సరుకులు అందాలనే ఉద్దేశ్యంతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఈ సెల్లులో కైజాలా యాప్, జియోట్యాగ్ ఉంటుందన్నారు. దీంతో రేషన్‌షాపుల పంపిణీ సక్రమంగా జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, రేషన్‌డీలర్లు పాల్గొన్నారు.

నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి

రాజంపేట టౌన్, జనవరి 1:నూతన సంవత్సరం 2017కు ఘనంగా స్వాగతం పలకాలనుకున్న ఇరువురు యువకులు బైక్ రేసింగ్‌లో దుర్మరణం చెందిన దుర్ఘటన శనివారం అర్ధరాత్రి రాజంపేట పట్టణం రైల్వేస్టేషన్ రోడ్‌లో చోటు చేసుకుంది. రాజంపేట పట్టణంలోని మన్నూరు శివాలయం వీధికి చెందిన వినోద్ (20), బలిజపల్లె వీధికి చెందిన సాయిప్రసాద్‌లు మోటార్‌బైక్‌లపై రైల్వేస్టేషన్ రోడ్‌లోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వెళుతుండగా ఎదురుగా అతివేగంగా వస్తున్న మోటార్ బైక్‌లు ఢీ కొనడంతో ఇరువురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మూడు బైక్‌లు ఒకదానిని ఒకటి వేగంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో నలుగురు యువకులు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురి కాగా వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం వైద్యుల సిఫార్సుల మేరకు తిరుపతి రూయాకు తరలించారు. స్థానిక అన్నమాచార్య కళాశాలలో చదువుతున్న ఈ విద్యార్థులు దుర్మరణం చెందడం స్థానికులను కలచి వేసింది. మన్నూరు, బలిజపల్లె ప్రాంతాలలో విషాదం నెలకొంది. ఆదివారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని పోస్టుమార్టమ్ గదిలోని మృతదేహాలను విప్ మేడా మల్లికార్జునరెడ్డి పరిశీలించి, యువకుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. తిరుపతిలో చికిత్స పొందుతున్న నలుగురు యువకులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.