కడప

నేతల వర్గపోరుతో అర్హులకు అందని పెన్షన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 7: తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయాలతో ప్రవేశపెట్టిన రేషన్‌కార్డులు, ఎన్‌టిఆర్ గృహనిర్మాణాలు, పెన్షన్లు పంపిణీల్లో అధికారపార్టీ నేతల మధ్య ఉన్న వర్గపోరు అర్హులకు శాపంగా మారి ఆ పథకాలు అమలుకావడంలేదనేది జగమెరిగిన సత్యం. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు అధికంగా ఉన్నారని జన్మభూమి కమిటీల ద్వారా అందరికీ న్యాయం చేయవచ్చునని, జన్మభూమి కమిటీ ఏర్పాటుచేస్తే అధికారపార్టీ నేతల మధ్యవున్న వర్గపోరుతో అర్హులకే పెన్షన్లు, ఎన్‌టిఆర్ గృహనిర్మాణాలు అందకపోవడం, ఇరువర్గాలకు చెందిన అధికారపార్టీలోని ప్రతి నియోజకవర్గంలో ఆధిపత్యపోరుతో అన్ని వర్గాకు చెందిన నేతలు పెన్షన్లు, గృహనిర్మాణాలు, రేషన్‌కార్డులు దక్కక జన్మభూమి కమిటీలపై వత్తిడి తెస్తున్నారు. దీంతో ఆ కమిటీ సభ్యులు ఎవరివైపు మొగ్గుచూ
పలేక చేతులు పైకెత్తేస్తున్నారు. ఇక అధికారుల ఎదుట అర్హులు తమగోడు విన్పిస్తే తమకు ఏమీ తెలియదని జన్మభూమి కమిటీల నిర్ణయమే ఎంపికకు చివరి మెట్టుఅని చేతులు పైకెత్తి ప్రేక్షకపాత్ర నిర్వహిస్తున్నట్లు తేటతెల్లవౌతుంది. ఈనెల 2 నుంచి ఈనెల 11వ తేదీ వరకు జరుగుతున్న జన్మభూమి గ్రామసభలకు ప్రజల నుంచి స్పందన బాగా కన్పిస్తున్నా అర్హులు తమకు పెన్షన్లు, గృహనిర్మాణాలు, రేషన్‌కార్డులకోసం దరఖాస్తు చేసుకున్నామని, గ్రామసభలకు వస్తే అక్కడి నేతల మధ్య ఉన్న ఆధిపత్యపోరు, జన్మభూమి కమిటీల పనితీరుతో వారికి ఎవీ లభించక ఉసూరుమని ఇళ్లకు తిరుగుముఖం పడుతున్నారు. కొంతమంది జన్మభూమి కమిటీలోని సభ్యులు దళారుల ప్రమేయంతో చేతులు తడిపిన వారికి పథకాల్లో ఎంపికచేసి కావాల్సిన వారికి పళ్లెంలో... కానివారికి ఆకుల్లో అన్నచందంగా వ్యవహరిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ప్రతి నియోజకవర్గానికి దాదాపు 2వేల మంది పెన్షన్లకు, రేషన్‌కార్డులు నియోజకవర్గానికి దాదాపు 4వేలు పైబడి ఇవ్వాల్సివుండగా అవన్నీ అనర్హులకే అందుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌పాలనలో అవకతవకలు జరిగాయని, టిడిపి పాలనలో అర్హులకే అందుతాయని గంపెడు ఆశలు పెట్టుకున్న వారికి అధికారపార్టీలో ఉన్న ఆధిపత్యపోరుతో వారి అనుచరగణాలకే అందుతున్నాయి తప్ప పూర్థిస్థాయిలో అర్హులకు అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. వాటి అమలుకు రాష్ట్రంనుంచి ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియామకంచేసినా సంబంధిత అధికారులు స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల విబేధాలను తెలుసుకుని వారు సైతం నోరుమెదపకుండా తాము వచ్చిన గ్రామసభలు ముగించుకుని పోతే చాలన్న ఆతృతతో ఉన్నారనేది జగమెరిగిన సత్యం. రాయచోటి, బద్వేలు, జమ్మలమడుగు, కడప,ప్రొద్దుటూరు, రాజంపేట నియోజకవర్గాల్లోనే ఆధిపత్యపోరు అధికంగా ఉండి స్థానిక ప్రజలకు అడుగడుగునా అవస్థలు ఎదురౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారపార్టీ నేతలు అర్హులైన నిరుపేదలకు టిడిపి ప్రభుత్వంలోనైనా న్యాయం చేకూర్చేందుకు నేతలు తమ విబేధాలు పక్కనపెట్టి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మొక్కల పెంపకం పేర
రూ.లక్షలు స్వాహా..!

కడప,జనవరి 7: కరవు నివారణ, వర్షాల రాకకోసం, పచ్చదనం కాపాడుతూ అందరికీ సంపూర్ణ ఆరోగ్యం నిమిత్తం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది మొక్కలు విరివిగా పెంచేందుకు కోటి మొక్కలు పెంచేందుకు జిల్లాలో లక్ష్యంగా పెట్టుకున్నారు. కోటి మొక్కల పెంపకం పక్కనపెడితే సంబంధితశాఖలకు చెందిన పలువురు అధికారులు, పలువురు సిబ్బంది మొక్కల పెంపకం పేరుతో భారీ ఎత్తున భోం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, సామాజిక అటవీశాఖల ద్వారా ఖర్చుచేసిన కోట్లాదిరూపాయలు పక్కదారి పట్టడం తప్ప మొక్కల చిరునామా కన్పించడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో 30శాతం మొక్కలు కూడా కన్పించడం లేదు. వాస్తవంగా ఉపాధి కూలీలకు పనులు కల్పించి నర్సరీల పెంపకాల నుంచి అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, గట్లపై మొక్కల పెంపకం, తోటల పెంపకం, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటడం, రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంచడం, హోమ్‌సీడ్ ప్లాంటేషన్ కింద ఈమారు అట్టహాసంగా మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. సామాజిక అటవీశాఖ నేతృత్వంలో ఒక కడప నగరంలోనే మొక్కలు పెంచేందుకు రూ.160కోట్లు పైబడి కేటాయించారు. అయితే సగం కూడా అందులో ఖర్చుచేయలేదని మొక్కలు కూడా పెద్దగా కన్పించడం లేదన్న ఆరోపణలున్నాయి. అలాగే డ్వామా నేతృత్వంలో టేకు, ఎర్రచందనం, గట్లపై పెంచడానికి క్షేత్ర స్థాయి నుంచి లబ్ధిదారులను ఎంపికచేసి కేవలం 101 మంది ద్వారా 34378 మొక్కలు నాటి అందుకు రూ.10.97లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు అంటున్నారు. వాస్తవంగా గట్లపై చెట్ల పెంపకానికి తొలుత 1057 మంది లబ్ధిదారులకు 377363 మొక్కలు పెంపకానికి ప్రతిపాదనలు తయారు చేయగా 965 మంది లబ్ధిదారులను ఎంపికచేసి 337913 మొక్కలు నాటాలని ప్రభుత్వం అనుమతించింది. అయితే మొక్కలు నాటింది మాత్రం 34378 మొక్కలు మాత్రమే. ఇక 91 ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో 20297 మొక్కలు నాటేందుకు ప్రతిపాదనలు తయారుచేయగా, 69ప్రభుత్వకార్యాలయాల ప్రాంగణాల్లో 18382 మొక్కలు నాటేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ఇప్పటి వరకు 17 ప్రభుత్వ కార్యాలయాల్లో 2094 మొక్కలు నాటి, రూ.4.03 లక్షలు ఖర్చుచేశారు. హోమ్‌సీడ్ ప్లాంటేషన్‌లో 92345 మంది లబ్ధిదారులను ఎంపికచేయగా, 421055 మొక్కలు నాటేందుకు అంచనా వేసి 89994 మందికి 411286 మొక్కలు నాటేందుకు అనుమతులు రాగా, వాటిలో 58930 మంది లబ్ధిదారులు 169014 మొక్కలు నాటేందుకు రూ.133.13 లక్షలు ఖర్చుచేశారు. ఇక రోడ్లకు ఇరువైపులా 1122.80 కి.మీ పొడవున 449120 మొక్కలు నాటేందుకు అంచనాలు వేయగా, 1032 కి.మీలు 412820 మొక్కలు నాటాలని ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే ఇంతవరకు 378కి.మీ.పొడవునా 149061 మొక్కలు నాటి రూ.135.33 లక్షలు ఖర్చు చేశారు. ఈ దామాషిలో కేవలం మొక్కల పెంపకానికి రూ.273.46 లక్షలు ఖర్చు చేశారు. అయితే మొక్కలు గానీ, వాటికి తీసిన గోతులు కానీ సగానికి పైబడి కన్పించడం లేదు. 30శాతం మొక్కలే బతికినట్లు సంబంధిత అధికారులు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే చాలా మంది అధికారులు, కిందిస్థాయి సిబ్బంది మొక్కల పేరిట పెద్ద ఎత్తున భోం చేసినట్లు వెల్లడవుతోంది. వాస్తవంగా స్వచ్చంధంగా ముందుకొచ్చిన ప్రజలు, విద్యార్థులు, స్వచ్చంధ సంస్థలు గోతులు తీసి మొక్కలు పాతి , మొక్కలకు ఇరువైపులా కంచెవేసి సంరక్షిస్తున్న మొక్కలకు కూడా కొంతమంది అధికారులు నిధులు విడుదల చేసుకుని స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈవ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.