కడప

పనిచేయని అధికారులపై కలెక్టర్ కొరఢా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 9: జిల్లా యంత్రాంగాన్ని గాడిలో పెట్టే భాగంగా జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టి అందులో భాగంగా ఆదివారం రాత్రి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సక్రమంగా విధులు నిర్వహించని డిఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్‌ను కలెక్టర్ ప్రభుత్వానికి ఆయన్ను అప్పగించారు. దీంతో జిల్లాలోని అన్నిశాఖల అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇంతవరకు జిల్లా కలెక్టర్ శాఖల వారీగా అధికారుల పనితీరుపై తెలుసుకుంటూ పనిచేయకుండా అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై వేటు వేసేందుకు సర్వం సిద్దంచేసుకున్నట్లు తెలుస్తోంది. గత కలెక్టర్ కెవి రమణ తన మాట వినని 15 మంది అధికారులు పైబడి వేటువేశారు. ప్రస్తుత కలెక్టర్ గత ఆరుమాసాలుగా అధికారుల పనితీరును పరిశీలిస్తూ వివిధ శాఖలను సమీక్షిస్తూ జిల్లాకు రెండు మాసాలక్రితమే వచ్చిన డిఎంహెచ్‌ఓ సుధాకర్‌పై ఫిర్యాదు అందడంతో కలెక్టర్ రెండు మూడు పర్యాయాలు డిఎంహెచ్‌ఓను హెచ్చరించి, హెచ్చరికలతో మార్పు రాకపోవడంతో ఏకంగా ఆయన్ను ప్రభుత్వానికి అప్పగించారు. డిఎంహెచ్‌ఓ క్యాంపులకు వెళితే సంబంధిత ఆసుపత్రుల అభివృద్ధి నిధుల నుంచి రూ.5 నుంచి రూ.10వేలు డిమాండ్ చేయడం, ఆసుపత్రుల విధులకు హాజరుకాని గ్రామీణ ప్రాంతాల వైద్యుల నుంచి ముడుపులు తీసుకుని వారు సక్రమంగా పనిచేయకపోయినా వారిని గాలికి వదిలి వేసినట్లు తెలిసింది. దీంతో కలెక్టర్ కొరఢా ఝళిపించారు. అలాగే జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశం నిర్వహించి వారికి టార్గెట్ ఇచ్చి పనిచేయని అధికారులను ప్రభుత్వానికి అప్పగించడమే మంచిదని కలెక్టర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ కొన్ని మాసాల్లో రిటైర్డ్ అవుతున్న తరుణంలో ఏ అధికారికి ఇబ్బందిపెట్టకుండా అందరినీ కలుపుకుని పోవాలనుకున్నారు. అయితే చాలామంది అధికారులు కలెక్టర్ మంచితనాన్ని అలుసుగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కలెక్టర్ కొరడా ఝళిపించడమే శ్రేయస్కరమని, పనిచేయని వారు డిప్యుటేషన్లపై వచ్చిన అధికారులు తమ మాతృశాఖలకు వెళ్లవచ్చునని కలెక్టర్ ఇప్పటికే హెచ్చరించినట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న కీలకమైన శాఖల అధికారులంతా డిప్యుటేషన్‌పైనే పనిచేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. చాలా మంది అధికారులకు అధికారపార్టీ నేతల అండదండలుండటంతో వారిపై అధికారులు కూడా చర్యలకు సాహసించడం లేదని తేలుస్తోంది. కలెక్టర్‌కు ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆయన కఠిన చర్యలు తీసుకునేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కలెక్టర్ చర్యలకు జిల్లా అధికారులు బెంబేలెత్తుతున్నారు.

పోరుమామిళ్ల జన్మభూమి రసాభాస

పోరుమామిళ్ల, జనవరి 9: పోరుమామిళ్ల పంచాయతీ కార్యాలయంలో జన్మభూమి గ్రామసభ ప్రారంభం కాగా ముఖ్య అతిథులుగా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, ఎంపిపి చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, జడ్పిటిసి శారదమ్మ, ఎంపిడిఒ రామక్రిష్ణయ్య, తహశీల్దార్ దైవాదీనం, సర్పంచ్ హబీబున్నీసాలు హాజరై సభ ప్రారంభ దశలోనే పెద్ద ఎత్తున ఎర్రజెండాలతో సిపిఐ ఏరియా కార్యదర్శి వీరశేఖర్, జిల్లా కమిటీ సభ్యుడు చంద్రశేఖర్, మండల కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఆద్వర్యంలో పెద్ద ఎత్తున సభను ముట్టడించేందుకు రాగానే అక్కడున్న ఎస్సై ఓబన్న, పోలీసులు గమనించి అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే అధికారులు, నాయకులున్నారని నినాదాలు చేస్తూ చుట్టుముట్టారు. పోలీసులకు, సిపిఐ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకోగా దాదన దుర్గమ్మ ఎడమచెవి తెగిపోగా రక్తస్రావమైంది. ఎమ్మెల్యే, ఎంపిపి వారి వద్దకు వెళ్లి వారికి పోలీసుల తరుపున ఆయనే చేతులెత్తి దండంపెట్టి క్షమాపణ చెప్పారు. 1008 సర్వే నెంబర్‌లో నాలుగేళ్లుగా గుడిసెలు వేసుకున్న వారికి ఇంటి స్థలాలివ్వకుండా అధికారులు వేధిస్తున్నారని, ఇప్పటికైనా వారికి న్యాయం చేయకపోతే పార్టీ తరుపున ఆందోళన చేపడుతామని నినాదాలు చేయడంతో వారి నుంచి వెంటనే అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించి, సమస్యను పరిష్కరించేందుకు తన వంతుగా కృషిచేస్తానని చెప్పారు. దీంతో సమస్య సర్దుమణిగింది. సభ ప్రారంభం కాగానే పోరుమామిళ్లలో మంచినీటి సమస్య తీవ్రతరంగా మారిందని, నీరు దొరక్క అల్లాడుతున్నారని, పంచాయతీ తరుపున ట్యాంకర్లు ఏర్పాటుచేయడంలో విఫలమయ్యారని ఎంపిపి అన్నారు. వెంటనే సర్పంచ్ హబీబున్నీసా కోపంతో రెచ్చిపోయి నీరు ఇచ్చేందుకు అనుమతిచ్చేది లేదంటూ వాగ్వివాదానికి దిగారు. నాయకుల వాగ్వివాదంతో సభ రసాభసగా మారింది. ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్య తలెత్తకుండా తనవంతుగా కృషి చేస్తానంటూ చెప్పి చంద్రన్నకానుకలు, రేషన్‌కార్డులను లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.