కడప

వారసత్వ సంపద ఖిల్లా...కడప జిల్లా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప (కల్చరల్), ఏప్రిల్ 17: ఆదిమానవుడి కాలం నాటి కొండ గుహలు, అరుదైన రేఖా చిత్రాల నుంచి నేటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి వరకు ప్రతిఅంశమూ మానవ జీవిత పరిణామక్రమంలో వారసత్వ సంపదే. వేల సంవత్సరాల మానవ పరిణామక్రమంలో మానవ మేధస్సుతో, సాంకేతిక ఉషస్సుతో నిర్మించిన వనె్న తగ్గని నిర్మాణాలు, కట్టడాలు విలువ కట్టలేని వారసత్వ సంపద. పురాతన కాలం నాటి నిర్మాణాలు ప్రాభవాన్ని గురించి ఐక్యరాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్) లోని విద్య,సాంఘిక, సాంస్కృతిక సంస్థకు అనుబంధ సంస్థ అయిన 3అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ సంఘం2 వారు 1982 ఏప్రిల్ 18న ఆఫ్రికా ఖండంలోని ట్యునీషియా లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చారిత్రక , పురాతన కట్టడాల గురించి ఉత్సవాలు జరుపుకోవాలని, వాటి అధ్యయనం, పరిరక్షణ విషయంలో సభ్యదేశాలు పరస్పరం ఆర్థిక, సాంకేతిక అంశాల్లో సహకరించుకోవాలని తీర్మానించారు. ఆ తీర్మానాన్ని అధికారికంగా యునెస్కో 1983లో యధాతధంగా ఆమోదించి, ఏప్రిల్ 18న వారసత్వ పరిరక్షణకు సమావేశం నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 18వ తేదిని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా, ప్రపంచవ్యాప్తంగా వారసత్వ పరిరక్షణ వేడుకలు నిర్వహించాలని ప్రకటించింది. అప్పట్నుంచి విశ్వవ్యాప్తంగా ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ప్రముఖంగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రారంభంలో వారసత్వం అంటే మానవ నిర్మిత కట్టడాల వరకే పరిమితమైనప్పటికీ క్రమక్రమంగా వారసత్వం పరిధి విస్తృతమైంది. మానవ జాతికి సంబంధించిన ఏ అంశమైనా వారసత్వంగా పరిగణింపబడే వివరణ ఆచరణలోకి వచ్చింది. మనదేశంలో 1956లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో మన సువిశాల, సుసంపన్న వారసత్వ విశిష్టతను పరిరక్షించుకోవాలని ప్రాధమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నారు. ప్రాధమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని వారసత్వ పరిరక్షణ అంశాలను ఆలంబనగా చేసుకుని 1984లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో దివంగత రాజీవ్ గాంధీ చైర్మన్‌గా 1984 జనవరి 27న భారత జాతీయ కళాసాంస్కృతిక సంస్థ (ఇండియన్ నేషనల్ ట్రస్టు ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్-ఇంటాక్)గా రిజిస్టర్ అయ్యింది. అనంతరం పరిరక్షణకే అంకితం నినాదంతో దేశవ్యాప్తంగా ఆయా జిల్లా కలెక్టర్లు ప్రధాన పోషకులుగా 188 చాప్టర్లు, విదేశాల్లోని బెల్జియం అండ్ ఇంగ్లండ్ చాప్టర్లతో కలిసి మొత్తం 190 ఇంటాక్ చాప్టర్లతో భారతదేశ భవ్య సాంస్కృతిక , సకల కళాత్మక, చెక్కుచెదరని చారిత్రాత్మక వారసత్వ పరిరక్షణకు అగ్రగామిగా ఉన్న సంస్థ ఇంటాక్. ప్రముఖులు జన్మించిన, జీవించిన, మరణించిన ప్రదేశాలు వారసత్వమే. అనాదిగా ఆడుతున్న ఆటలూ, పాడుతున్న పాటలూ వారసత్వమే. వేషబాషలూ, అలంకారాలు, ఆకృతులూ వారసత్వమే. అలాంటి ఖరీదు కట్టలేని విశేష వారసత్వం కలిగివున్న కమనీయ ఖిల్లా అయిన కడప జిల్లాలో 2006లో కడప కలెక్టర్ ప్రధాన పోషణతో ఇంటాక్ కడప చాప్టర్ ప్రాణం పోసుకుంది. 2006 నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ల ఆధ్వర్యంలో నాటి, నేటి కన్వీనర్లయిన సిద్దవటం సీతారామయ్య, ఇలియాస్‌రెడ్డి నేతృత్వంలో ఇంటాక్ 3ఇంతింతై వటుడింతై2 అన్న రీతిలో కడప జిల్లాలో వారసత్వ పరిరక్షణకు కృషిచేస్తోంది. కడప జిల్లా ద్విశాబ్ది ఉత్సవాలు, శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది ఉత్సవాలు, నేటి ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణ ఉత్సవాలు వరకు అన్ని రకాల వారసత్వపు ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్లకు చేదోడు వాదోడుగా ఇంటాక్ కీలక పాత్రను పోషిస్తోంది.