కడప

ఎమ్మెల్సీ ఎన్నికలపై గాలి ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 13: కడపలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత శాసన మండలి అభివృద్ధి కమిటీ చైర్మన్, రాష్టమ్రాజీమంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్యపోరుతో 2014 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశంపార్టీకి భారీ నష్టం వాటిల్లింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక సంఘాల్లో వైకాపా నేతలే అధిక సంఖ్యలో గెలుపొందారు. వీటన్నింటిని ముద్దుకృష్ణమనాయుడు బేరీజు వేసుకుంటూ జిల్లాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి పరిస్థితులు చక్కదిద్దుతున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జిల్లాకే పరిమితం కాగా, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎన్నికలు కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. ఈనేపధ్యంలో ముద్దుకృష్ణమనాయుడు గతంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయన్ ఇన్‌చార్జిగా వ్యవహరించి పలువురి గెలుపుకోసం కృషి చేశారు. ఆ అనుభవంతో ఆయన జిల్లాలో అధికారపార్టీ నేతల మధ్య ఉన్న ఆధిపత్యపోరు జగన్ సొంత జిల్లాలో పరిస్థితులు బేరీజు వేసుకుంటూ ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమపథకాలపై ప్రచారం చేస్తూ తనదైన శైలిలో ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తున్నారు. ఆయనతోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి మోహన్‌రెడ్డి తదితరులు కూడా కృషి చేస్తున్నారు. ముద్దుకృష్ణమనాయుడు మాత్రం తనదైన శైలిలో ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పెట్టుకుని ఆధిపత్యపోరు ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ పార్టీని నమ్ముకుని కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేందుకు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆధిపత్యం మధ్య వున్న నేతలు సైతం తమ గోడును ముద్దుకృష్ణమనాయుడుకు మొరపెట్టుకుంటుండంతో ఆయన ఇక్కడి పరిస్థితులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి అన్ని వర్గాలకున్యాయం చేస్తామని గట్టి హామీ ఇస్తూ నేతలమధ్య ఎటువంటి సమస్యలు ఉత్పన్నంకాకుండా నేతలందర్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రచారాన్ని తీవ్ర తరం చేస్తున్నారు.
రామయ్య సన్నిధిలో ఎస్పీ
ఒంటిమిట్ట, జనవరి 13: ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని శుక్రవారం సాయంత్రం ఎస్పీ రామకృష్ణ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ముందుగా ఎస్పీ రామకృష్ణకు ఆలయ అర్చకులు, టిటిడి సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను, చరిత్రను వివరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీరాములు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.