కడప

చంద్రబాబు, కరవు కవల పిల్లలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జనవరి 13: కరవుపై నెట్‌లో సర్చ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రే ప్రముఖంగా కనపడుతున్నదని, చంద్రబాబు, కరవు కవల పిల్లలని ప్రముఖ సినీనటి, నగిరి శాసనసభ్యురాలు రోజా పేర్కొన్నారు. బుధవారం స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన అంతా అవినీతిమయమైందని, దానికితోడు రాష్ట్రంలో అరాచకం, అరిష్టాలు రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. చంద్రబాబు, కరవు కవలపిల్లలని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పల్లె సీమల్లో కూడా సంక్రాంతి శోభ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీని వడ్డీతో సహా మాఫీ చేస్తామని గద్దెనెక్కిన చంద్రబాబు ఆ మాటలకు నిలబడలేదని తెలిపారు. 2015లో 916 మంది రైతులు, రైతు కూలీలు చనిపోయినట్లు నేషనల్ క్రైం బ్రాంచ్ నివేదిక ఇచ్చిందని, ప్రస్తుతం టీడీపీ పాలనలో 45 శాతం ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రాధాకృష్ణన్ కమిటీ 92 శాతం రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు తెలిపారు. కర్నలు, కడప జిల్లాల్లో ప్రాజెక్టులు ప్రారంభించిన సమయంలో టీడీపీ నాయకులు, ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు సిగ్గుచేటని విమర్శించారు. 85-95 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను కలరింగ్ ఇచ్చి తామే పూర్తి చేసినట్లు చెప్పుకోవడం చంద్రబాబుకే సాధ్యమన్నారు. దీనికే టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటే తామెంత సంబరాలు జరుపుకోవాలని చెప్పాలని తెలిపారు.

కలెక్టర్ ఆదేశాలు డిఎంహెచ్‌ఓ బేఖాతర్

కడప,జనవరి 13: ఇటీవలే జిల్లాకు డిఎంహెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సుధాకర్ పనితీరుపై కలెక్టర్ కెవి సత్యనారాయణ అసంతృప్తి చెంది ఆయన్ను నాలుగురోజుల క్రితం ప్రభుత్వానికి సరెండర్ చేశారు. డిఎంహెచ్‌ఓ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తనకు కలెక్టర్ అన్యాయం చేశారని, తన విధులకు ఆటంకం కల్పించారని తాను కడప జిల్లాలోనే పనిచేసేలా అదేశాలు ఇవ్వాలని కోరాడు. ట్రిబ్యునల్ న్యాయమూర్తి డిఎంహెచ్‌ఓను విధుల్లోకి తీసుకోవాలని ఆయన చార్జి తీసుకోవచ్చునని ఆదేశాలు ఇవ్వడంతో గురువారం రాత్రి రాత్రికే స్వతహాగా ఆయనే విధుల్లో చేరారు. ట్రిబ్యునల్ ఆదేశాలు కలెక్టర్‌కు చేరాయో లేదో కానీ డిఎంహెచ్‌ఓ సుధాకర్ ఇన్‌చార్జ్ డిఎంహెచ్‌ఓగా కొనసాగుతున్న డాక్టర్ రామిరెడ్డికి ట్రిబ్యునల్ ఆదేశాలను ఇచ్చి నేరుగా డిఎంహెచ్‌ఓ కుర్చీలోనే ఆశీనులై ఆయన విధుల్లో చేరుతున్నట్లు రాసుకుని ఇన్‌చార్జ్ డిఎంహెచ్‌ఓగా ఉన్న డా.రామిరెడ్డిని డిఎంహెచ్‌ఓ బాధ్యతల నుంచి తొలగించి ఆయన అదనపు డిఎంహెచ్‌ఓగా పనిచేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా డిఎంహెచ్‌ఓ డా.సుధాకర్ జిల్లాలో సక్రమంగా విధులు నిర్వహించకుండా ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌ల యజమానుల నుంచి, ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల వైద్యులు, సిబ్బందినుంచి మామూళ్లు తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఈ జిల్లాకు వద్దని కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యకు ఫిర్యాదు చేస్తూ సరెండర్ చేశారు. ఆ ఆదేశాలు అమలు జరిగేలోపే డా.సుధాకర్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి డిఎంహెచ్‌ఓగా విధుల్లో చేరారు. దీంతో కలెక్టర్ కెవి సత్యనారాయణ తాను జిల్లా ఉన్నతాధికారిగా జిల్లాస్థాయిలో ఉన్న తన సబార్డినెట్ అధికారులంతా పనిచేయాలనే ఉద్దేశ్యంతో ఆరోపణలున్న అధికారులను తొలగించుకుని పనిచేసే అధికారులను తెప్పించుకునే బాధ్యతలు ప్రభుత్వం కల్పించింది. అయితే డా.సుధాకర్ వ్యవహారంతో కలెక్టర్ తాను డిఎంహెచ్‌ఓగా జిల్లాలో పనిచేయడం అనవసరమని సరెండర్ చేస్తే, ట్రిబ్యునల్ నుంచి ఆదేశాలు తెస్తారా అని డిఎంహెచ్‌ఓపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా డిఎంహెచ్‌ఓ తిరిగి బాధ్యతలు చేపట్టడంతో జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.