కడప

ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,జనవరి 16: ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న ఐదుగు రు స్మగ్లర్లు, 10 దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు రూరల్ సిఐ నాగభూషణం, ఎస్‌ఐ రంగారావు తెలిపారు. ఖాజీపేట పోలీసుస్టేషన్‌లో సోమవారం ఎర్రచందనం దుంగలతోపాటు స్మగ్లర్లను హాజరుపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎర్రచందనం పుల్లూరు కొట్టాల గ్రామాల పరిధిలోని ఫారెస్టు రోడ్డునుంచి తరలివెళుతోందని సమాచారం రావడంతో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో తమిళనాడు రాష్ట్రం విల్లూపురం గ్రామానికి చెందిన వెల్లాయన్ సెల్వరాజ్, రామన్ సెల్వన్, చిన్నాయన్ రాజీవ్, తిరుమలరాజీ, లక్ష్మణ్‌చిన్నతంబీ స్మగ్లర్లుగా గుర్తించామన్నారు. వారి నుంచి 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుంటుండగా గొడ్డళ్లతో తమపై తిరగబడ్డారని చాకచాక్యంతో తాము, సిబ్బంది కలిసి పట్టుకున్నామన్నారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజపరిచామన్నారు. మండలం నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు మైదుకూరు రూరల్ సిఐ నాగభూషణం, ఎస్‌ఐ రంగారావులు అన్నారు.

సవాళ్లు... ప్రతి సవాళ్లు...

కడప,జనవరి 16:జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై టిడిపి, వైకాపా నేతలు ఒకరిపై ఒకరు అక్రమాలు జరిగాయంటూ ఘాటుగా విమర్శలు చేసుకుంటూ సవాళ్లు విసిరారు. కాగా ఆ సవాళ్ల్లు ప్రకటనల కే పరిమితమైనట్లు ప్రజలు బాహాటం గా చర్చించుకుంటున్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలు, జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడంపై ప్రతిపక్ష నేతలు అధికారపార్టీ అగ్రనేతలపై సవాళ్లు విసరడం, అధికారపార్టీ నేతలు ధీటుగా స్పందించడం జరిగిపోయింది. ప్రతిపక్షనేతలు ఒక దశలో విచారణకు వేదిక, సమయం చెప్పాలని అధికార పార్టీ నేతలను కోరారు. జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి ప్రెస్‌క్లబ్‌లో వేదికను ప్రకటించి వైసిపి నేతలనే తేదీ, సమయాన్ని తెలపాలని సవాల్ విసిరారు. అయితే ఇంతవరకు వైసిపి నేతల నుంచి ఉలుకుపలుకు లేదు. అధికారపార్టీకి చెందిన నేతలు వైసిపి నేతల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, ప్రత్యేకించి నేతల భూ కుంభకోణాలు, జలయజ్ఞం తదితర భూముల భూ ఆక్రమణలు, అప్పట్లో వారు పూర్తిచేసిన కాంట్రాక్టు నాసిరకం పనులను అధికారపార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమనుకుంటే ఎంపిలు, ఎమ్మెల్యేలుగా ఉన్నకాలంలో కాంగ్రెస్, వైఎస్సార్ సిపి నేతల ప్రత్యేక అభివృద్ధి నిధుల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై కూడా సమాచారం ఇవ్వాలని జిల్లాలోని సంబంధిత అధికారులను అధికారపార్టీ నేతలు కోరినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వైకాపా నేతలు కూడా టిడిపి హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జరిగిన అవకతవకలపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈనెల 11న ముఖ్యమంత్రి గండికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు గేట్లు ఎత్తివేయడం, ఆ నీరు పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు చేరిపోవడం కూడా జరిగింది. ఒకవేళ నీరు చేరని పక్షంలో వైసిపి నేతలు అధికారపార్టీ నేతలపై ఆరోపణలు చేసివుండేవారు. ప్రస్తుతం ఆరోపణలు సద్దుమణిగినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరిగి ఈనెల 29 లేదా 30న కానీ గండికోట ఉత్సవాల సందర్భంగా రానున్నారు. అదేరోజు ఆయన జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు, కాలువలపై జలవనరులశాఖ అధికారులతో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జగన్ ఇలాఖాపైనే దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని అధికారపార్టీ నేతలు కూడా ప్రతిపక్షపార్టీ నేతల ఆరోపణలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద జిల్లాలో నేతల సవాళ్లు ప్రతిసవాళ్లు తాత్కాలికంగా సద్దుమనిగాయని చెప్పవచ్చు.

ఆంగ్ల మాధ్యమం కావాలి..

కడప,జనవరి 16: మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీషుమీడియం ఏర్పాటు చేస్తే పిల్లల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయబడుతున్నారు. మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెడుతున్నట్లు ఈ మద్యకాలంలో విద్యాసంవత్సరం మద్యలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటనతో మేధావులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో వ్యతిరేకత రావడంపై తాత్కాలికంగా ఆ నిర్ణయాన్నిప్రభుత్వం ఉపసంహరించుకుంది. వచ్చే ఏడాదినుంచి మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టాలని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెడితే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకే అధికనష్టం వాటిల్లుతుందనేది జగమెరిగిన సత్యం. పురపాలక సంఘాలు ఇంచుమించు పట్టణాల్లో ఉన్నందున పట్టణాల్లోనే అధికంగా కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టినట్లయితే పేద,మద్యతరగతికి చెందిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంగ్లీషుమీడియం ద్వారా ప్రయోజకులుగా అయ్యేందుకు అవకాశాలు ఏర్పడుతాయని పలువురి అభిప్రాయం. ఇంగ్లీషుమీడియం మున్సిపల్ హైస్కూల్స్‌లో ప్రవేశపెట్టడం వల్ల కొంతమేరకు ప్రభుత్వం లక్ష్యం నెరవేరి, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను అరికట్టవచ్చు. జిల్లాలో 20 ఏళ్లక్రితం ఏర్పాటైన కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లో మాత్రమే పురపాలక సంఘాల పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో పదేళ్లక్రితం, ఏడేళ్లక్రితం ఏర్పడిన రాయచోటి, రాజంపేట, బద్వేలు, జమ్మలమడుగు, మైదుకూరు, ఎర్రగుంట్ల పురపాలక సంఘాల్లో పురపాలక పాఠశాలలు లేవు. ప్రస్తుతం కడప, ప్రొద్దుటూరులో 68 పురపాలకసంఘం పాఠశాలలు ఉండగా ఆ పాఠశాలల్లో 16 హైస్కూల్స్ ఉన్నాయి. ఈపాఠశాలల్లో 10వేల మంది పైబడి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకంటే పురపాలక సంఘాల్లో 500 పైబడి వుంటాయి. కేవలం ఇంగ్లీషుమీడియం బూచితోనే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు బలోపేతం కావడం, ప్రజలను ఫీజులపేరుతో నిలువుదోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక బోధన సిబ్బంది కూడా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అంతంత మాత్రమే. మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులున్నా కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపంతోనే ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆదరణ తగ్గుతోందని చెప్పవచ్చు. అంతేగాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషుమీడియం లేని కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తమ పిల్లలను ఇంగ్లీషు ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకే పంపుతున్నారు. ప్రభుత్వం పురపాలక సంఘాల పాఠశాలల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెడితే ఉపాధ్యాయులు తమ పిల్లలను కూడా పురపాలక సంఘం పాఠశాలలకే పంపుతారు. దీంతో వారు సైతం అంకితభావంతో పాఠశాలల్లో పనిచేస్తారు. ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరడంతోపాటు సామాన్య విద్యార్థులకు సైతం ఇంగ్లీషుభాష వస్తుంది.

టమోటా రైతు కుదేలు.!

కడప,జనవరి 16: ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందేలోపు ధరలు పతన మవుతుండడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. కరవుకోరల్లో చిక్కుకున్న జిల్లా రైతాంగానికి ఖరీఫ్‌లో పంటలు పండక అరకొర వర్షాలతో బోరుబావుల కింద సాగుచేసిన టమోటా పంటలు సాగు చేసుకున్న రైతాంగానికి మూలిగే నక్కపై తాడిపండు పడిన చందంగా టమోటా దిగుబడి వచ్చే సమయంలో గిట్టుబాటు ధర లేక రైతాంగం ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో టమోటా పంట సాగుచేసిన రైతులకు గిట్టుబాటు కావడంతో ప్రస్తుతం రబీలో అదే ధరలు ఉంటాయన్న ఉద్దేశ్యంతో రైతులు టమోటా పంట సాగుచేయగా ప్రస్తుతం ధరలు పతనం కావడంతో రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ కోవలో జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, మైదుకూరు, కడప, పులివెందుల తదితర ప్రాంతాల్లో 10వేల ఎకరాలు పైబడి టమోటాసాగు చేశారు. అయితే టమోటా కిలో రూ.3లు మాత్రమే ధరపలుకుతుండటంతో మార్కెట్‌లో లేకపోవడం, దళారులు, వ్యాపారులు రైతుల వద్దకు వెళ్లి కిలో రూపాయి కంటే ఎక్కువ ధర పెట్టకపోవడంతో రైతులకు కూలీల ఖర్చులు కూడా రాక పంట పొలాలను పశువులకు వదిలేస్తున్నారు. ఇందుకు కారణం మార్కెట్ కమిటీలు, అధికారులు, పాలకులు జిల్లాలో టమోటా రైతులకోసం మార్కెట్‌యార్డులు నిర్మించడం కానీ, కోల్డ్‌స్టోరేజిలను ఏర్పాటుచేయడంలో విఫలమయ్యారు. గత రెండునెలలుగా కేంద్రప్రభుత్వం పెద్దనోట్లు రద్దు ప్రభావం రైతులపై పడిందని చెప్పవచ్చు. టమోటాను నగదు వెచ్చించి ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వ్యాపారస్తులు ఆసక్తి కనబరచకపోవడంతో మార్కెట్ పతనానికి మరింత కారణం ఏర్పడింది. గత రెండునెలలుగా మార్కెట్‌లో ఏ కూరగాయలు కూడా రైతులకు గిట్టుబాటు కావడం లేదు. కాగా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు, రైల్వేకోడూరు, సుండుపల్లె ప్రాంతాల్లో టమోటాలను కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యాపారస్తులు జిల్లాకు చెందిన దళారులను ఆశ్రయించి కొనుగోలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన అధికారులు మదనపల్లె, గుర్రం కొండ, తిరుపతి, పాకాల, రేణిగుంట ప్రాంతాల్లో మార్కెట్‌యార్డులు ఏర్పాటుచేసినందున జిల్లా నుంచి కొనుగోలు చేసిన టమోటాను సంబంధిత మార్కెట్‌యార్డులకు తరలించి అక్కడి నుంచి తమిళనాడు , కర్నాటక, మహారాష్ట్ర,తెలంగాణ రాష్ట్రాలకు దళారులు, వ్యాపారులు టమోటాలు రవాణాచేసి లక్షలాదిరూపాయలు సంపాదిస్తున్నారు. రైతులకు మాత్రం పంటసాగుచేసేందుకు వేలాది రూపాయలు ఖర్చుచేస్తున్నా పెట్టిన పెట్టుబడులు రాక పురుగుమందులు, రసాయనిక ఎరువులకు వేలాది రూపాయలు వెచ్చించి పంటలు సాగుచేస్తే తీరా చేతికొచ్చే సమయానికి ధర పతనం కావడంతో రైతులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. అతివృష్టి, అనావృష్టితో రైతుల పరిస్థితి దీనంగా తయారైందని ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులుభావిస్తున్నారు. అలాగే జిల్లాకు చెందిన పలువురు వ్యాపారులు రైతులకు అరకొర అడ్వాన్సులు ఇచ్చి రైతుల నుంచే పచ్చి టమోటాను రహదారుల వద్దకు తెప్పించుకుని వాటిని ఆపిల్ తరహాలో బాక్సుల్లో నింపి జిల్లాలో వివిధప్రాంతాలతోపాటు రాయలసీమ జిల్లాల్లో టమోటా డిమాండ్ ఉన్న ప్రాంతాలకు పంపి కిలో.రూ.6 నుంచి రూ.10వరకు సొమ్ముచేసుకుని లక్షలాదిరూపాయాలు ఆర్జిస్తున్నారు. అయితే రైతులకు మాత్రం కిలో రూపాయిలోపే దళారులు, వ్యాపారులు చెల్లిస్తున్నారు. రైతులు ఎకరాకు రూ.50వేలు నుంచి రూ.70వేల వరకు పెట్టుబడులు పెట్టి టమోటా ధర పతనం కావడంతో పంటలకు పెట్టిన పెట్టుబడులు పక్కనపెడితే కూలీలకు ఇచ్చే డబ్బులు కూడా గిట్టుబాటు లభించక రైతులు అప్పులపాలై డీలాపడి అప్పుల ఊబిలో చిక్కుకుని గిల గిలకొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం టమోటా అధిక సాగుచేస్తున్న ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీలు, మార్కెట్‌ను ఏర్పాటుచేసి రైతులందరికీ గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాష్టస్థ్రాయి వాలీబాల్ పోటీలు విజయవంతం చేయాలి

రాజంపేట, జనవరి 16:రాజంపేట జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నుండి నిర్వహిస్తున్న రాష్టస్థ్రాయి వాలీబాల్ పోటీలు విజయవంతం చేసేందుకు అధికారులు, స్వచ్ఛంధసేవా ప్రతినిధులు తమవంతు సహాయ సహకారాలు అందించాలని రాజంపేట రెవిన్యూ డివిజనల్ అధికారి వీరబ్రహ్మం తెలిపారు. సోమవారం వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్న మైదానాన్ని పరిశీలించి, ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మాట్లాడి తగుసూచనలు, సలహాలు అందించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల నిర్వహణకు అన్నిచర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. క్రీడాకారులకు అవసరమైన వసతులు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మున్సిపల్ కార్మికులతో క్రీడా మైదానాన్ని పరిశుద్ధం చేసి పారిశుద్ధ్యం పనులు చేపట్టామన్నారు. ఇతర జిల్లాల నుండి విచ్చేసి వాలీబాల్ క్రీడాకారులకు, క్రీడాకారిణిలకు వేర్వేరుగా సౌకర్యాలు కల్పించామన్నారు. పట్టణంలోని వివిధ స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులను, వ్యాపార సంస్థలను క్రీడాకారులకు అవసరమైన మజ్జిగ ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను అందించేందుకు తగుఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్పిపల్ కమిషనర్ ఎన్.వి.రమణారెడ్డి, ఆర్‌ఐపిఇ భానుమూర్తిరాజు, ఎంపిడిఓ హరినాధ్‌బాబు, తహశీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, అర్బన్ సిఐ అశోక్‌కుమార్, మున్పిపల్ అధికారులు డి.శ్రీనివాసులు, కె.మోహన్, టిడిపి నాయకులు వడ్డిరమణ, షేక్ అబ్దుల్లా, స్వచ్చంధ సేవా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

నగర సమస్యలు పరిష్కరించాలని
సీఎంకు వినతి

కడప,(కల్చరల్)జనవరి 16: కడప నగర పరిధిలోని వివిధ సమస్యలను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు దృష్టికి డిప్యూటీమేయర్ బి.ఆరిఫుల్లా తీసుకెళ్లడంతోపాటు వినతి పత్రం ఇచ్చినట్లు సోమవారం విలేఖరులకు తెలిపారు. అమరావతిలో సీఎంను కలిసిన ఆయన ప్రధానంగా 2వేల ఎన్‌టిఆర్ భరోసా పెన్షన్లను మంజూరు చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి త్వరలో నగర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలియజేశారు. అదేవిధంగా నగర అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని, తాగునీటి సమస్య తీర్చాలని కోరినట్లు తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లా సోముల మండలం పెద్ద ఉప్పరపల్లె గ్రామస్థులైన 6సంవత్సరాల హేమంత్ అనే బాలుడు తన తల్లిదండ్రులతో సిఎంను కలిసేందుకు రాగా భద్రతా సిబ్బంది వారిని పంపలేదని, కాలిన గాయాలతో ఉన్న బాలుడిని చూసి చలించిన తాను వారిని సీఎం వద్దకు తీసుకెళ్లానన్నారు.
వారు బాలుడి వ్యాధికి ఇప్పటికే రూ.2లక్షలు ఖర్చుచేసినా వ్యాధి నయం కాలేదని సీఎం వద్ద విలపించారన్నారు. ఇందుకు స్పందించిన సీఎం తన సహాయ నిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేయడమేగాకుండా ఆ బాలుడిని అన్ని విధాల ఆదుకోవాల్సిందిగా అక్కడే ఉన్న చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు వారు పేర్కొన్నారు.

ప్రజావినతులు వెంటనే పరిష్కరించాలి

కడప,(కల్చరల్)జనవరి 16: జిల్లాలోని ప్రజలనుంచి వివిధ సమస్యలపై వచ్చిన వినతులు అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం సభాభవన్‌లో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన వినతులను కొన్నింటిని కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కరించి మరికొన్నింటిని సంబంధిత శాఖల అధికారులకు ఎన్‌డార్స్‌మెంట్ చేసి తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. చిట్వేలి మండల కేంద్రానికి చెందిన అమర్ మారెమ్మగుడికి చెందిన స్థలాన్ని ఆక్రమించాడని, బద్వేలు మండలం భాకరాపేటకు చెందిన జయరామిరెడ్డి డికెటి పట్టాపాసుపుస్తకాలు మంజూరు చేయాలని, కడప ఊటుకూరుకు చెందిన పెద్దయ్య 45వ డివిజన్‌లో మరుగుదొడ్లు మరమ్మతులు చేయించాలని, కొండాపురం మండలం చౌటపల్లెకు చెందిన కె.పుల్లయ్య సోషియో ఎకనామిక్‌సర్వేలో తన పేరును నమోదు చేయించి పరిహారం చెల్లించాలని కోరారు. అలాగే బద్వేలుకు చెందిన అరుణ తన భూమితగాదాను పరిష్కరించాలని, సిద్దవటానికి చెందిన వెంకటసుబ్బయ్య తనకు ఆరుమాసాల నుంచి వృద్ధాప్య పెన్షన్ అందడంలేదని, వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పలువు రు తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ, జెసి -2 నాగేశ్వరరావు, డిఆర్వో ఈశ్వరయ్య, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

కంప్యూటర్ బోధకులను ప్రభుత్వం ఆదుకోవాలి

రాయచోటి, జనవరి 16: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2008 నుండి 2015 వరకు కంప్యూటర్ బోధకులుగా పనిచేసిన వారిని ఇప్పటి ప్రభుత్వం తొలగించిందని వెంటనే వారిని ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శి కొండూరు శ్రీనివాసరాజుకు పలువురు కంప్యూటర్ బోధకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందం ముగియడంతో జిల్లాలోని 230 పాఠశాలల్లో 460 మంది కంప్యూటర్ బోధకులను తొలగించిందన్నారు. అప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య పూర్తిగా నిలిచిపోయిందన్నారు. పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను ఐదు సంవత్సరాలు పాటు బోధించిన బోధకులు రోడ్డున పడ్డారని తెలిపారు. ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకొని తమకు జీవనోపాధి కల్పిస్తుందని ఎన్నోమార్లు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పేద విద్యార్థులకు విద్యను అందించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకొని కొనసాగించేలా తమ వంతు కృషి చేయాలని వారు శ్రీనివాసరాజుకు విజ్ఞప్తి చేశారు. గత ఏడాది తిరిగి పునః ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపినా అవి ప్రకటనలకే పరిమితమాయ్యయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రారంభిస్తోందని, అందులో కంప్యూటర్ విద్యను ప్రారంభించి కంప్యూటర్ బోధకులను తిరిగి విధుల్లోకి ప్రభుత్వం తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు మాట్లాడుతూ గత నవంబర్‌లోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావులను కలవడం జరిగిందన్నారు. గతంలో పనిచేసిన కంప్యూటర్ టీచర్లను కొనసాగిస్తామని హామీ కూడా ఇచ్చారన్నారు. అయితే ప్రస్తుతం మళ్లీ మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి ప్రస్తుతం డిజిటల్ క్లాస్‌రూమ్‌ల నిర్వహణ బాధ్యత పాత కంప్యూటర్ టీచర్లకే అప్పగించేలా ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ టీచర్లు మనోహర్, జాఫర్, చంద్రకళ, రవిశేఖర్, రాజశేఖర్, మాసాపేట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డి, పీఆర్‌టీయూ నాయకులు లక్ష్మీరమణయ్య, శ్రీనివాసులు, దేవప్రసాదరెడ్డి, శ్రీ్ధర్‌రెడ్డి పాల్గొన్నారు.

అన్ని వర్గాలను మభ్యపెడుతున్న ప్రభుత్వం

ఖాజీపేట,జనవరి 16:రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతూ టిడిపి ప్రభుత్వం మోసం చేస్తోందని వైకాపా ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి అన్నారు. మండలంలోని బుడ్డాయపల్లె, పేరారెడ్డి కొట్టాలు, సిద్దాంతిపురం గ్రామాల్లో నేతలు గడప గడపకు వైకాపా కార్యక్రమం చేపట్టారు. జిల్లాకార్యదర్శి దస్తగిరిబాబు, మండల కన్వీనర్ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపిపి శ్రీనివాసులురెడ్డి, గంగాధర్‌రెడ్డి, బి.కొత్తపల్లె మాజీ సర్పంచ్ నాగిరెడ్డిలు హాజరయ్యారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా మహిళలను, రైతులను, చేనేత కార్మికులను రుణమాఫీ చేస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇప్పటి వరకు రైతులకు అరకొర, చేనేతలకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేయకపోవడం దారుణమన్నారు. చంద్రన్నకానుకల పేరుతో వేలాదికోట్లరూపాయలు వృధా చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు అవసరమయ్యే పనులు చేయకపోగా నిరుద్యోగ యువతకు భృతి చెల్లించక ఇంటికి ఉద్యోగం అని చెప్పిన చంద్రబాబు మండలానికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టడం మాని సేవచేసుకోవాలని సూచించారు.

జన్మభూమి దరఖాస్తులు పరిష్కరించాలి

కడప,(కలెక్టరేట్)జనవరి 16: జన్మభూమిలో ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యల దరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని, అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ యాప్ సేవలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కడప నగర డిప్యూటీమేయర్ బి.ఆరిఫుల్లా, కార్పొరేషన్ కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛ యాప్‌ను ప్రతి ఒక్కరు తమ సెల్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. నగర పరిధిలోని తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ఫొటోలు తీసి యాప్‌లో అనుసంధానం చేస్తే మా దృష్టికి వస్తాయన్నారు. వచ్చిన సమస్యలు 24 గంటల్లో పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే నగరంలోని వివిధ సమస్యలపై వినతులు ప్రజల నుంచి స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బి.ఆరిఫుల్లా, ఎంఇ చెన్నకేశవరెడ్డి, ఆరోగ్యశాఖ అధికారి వినోద్‌కుమార్, టౌన్‌ప్లానింగ్ అధికారి ఆసిఫ్, డిఇలు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.